Bigg Boss Elimination: 9వ ఊహించని ఎలిమినేషన్.. ప్రమాదంలో ఇద్దరు టాప్ ప్లేయర్లు.. ఈ సారి ఆమె ఔట్!

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, ఏదీ కూడా అత్యధిక రేటింగ్‌ను సొంతం చేసుకునే స్థాయిలోకి వెళ్లడం లేదు. దీనికి కారణం వాటన్నింటికీ బిగ్ బాస్ షో భారీ టార్గెట్ సెట్ చేసి పెట్టడమే. అసలేమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ షో.. చాలా అంటే చాలా తక్కువ సమయంలోనే సూపర్ హిట్ అయింది. దీంతో వరుసగా సీజన్లు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ గురించి ఓ న్యూస్ లీకైంది. మరి ఈ వారం ఎవరు వెళ్లిపోతారో చూద్దాం పదండి!

చప్పగా మొదలై.. ఆసక్తికరంగా

చప్పగా మొదలై.. ఆసక్తికరంగా

బిగ్ బాస్ షో తెలుగులో భారీ సక్సెస్ అయింది. దీంతో ఆరో సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని మరింత ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. కానీ, ఆరంభం నుంచే ఈ సీజన్ చప్పగా సాగుతూ రేటింగ్‌ను అంతగా రాబట్టలేకపోయింది. కానీ, రెండు మూడు వారాలుగా ఎంతో ఆసక్తికరంగా నడుస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతూ వస్తోంది.

ఎనిమిది మంది వెళ్లిపోయారు

ఎనిమిది మంది వెళ్లిపోయారు


ఈ సీజన్‌లోకి అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్యలు ఎలిమినేట్ అయ్యారు.

ఈ వారం 10 మంది నామినేట్

ఈ వారం 10 మంది నామినేట్

అంతకు ముందు సీజన్ల కంటే ఆరో దానిలో నామినేషన్స్ టాస్కులో గొడవలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన తొమ్మిదో నామినేషన్స్ టాస్కు కూడా రచ్చ రచ్చగానే సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ రాయల్, కీర్తి భట్, శ్రీ సత్య, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, రోహిత్‌ సాహ్నీలు నామినేట్ అయ్యారు.

ఆటను బట్టి.. ఫేమ్ వల్ల కూడా

ఆటను బట్టి.. ఫేమ్ వల్ల కూడా

ఆరో సీజన్‌లో తొమ్మిదో వారానికి సంబంధించి కెప్టెన్సీ కంటెండర్ల కోసం 'మిషన్ ఇంపాజిబుల్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో ఆటతీరును బట్టి కంటెంస్టెంట్లకు ఓటింగ్ నమోదైంది. దీంతో ఎవరు మంచిగా ఆడుతున్నారో వాళ్లకు ఎక్కువ.. చెడ్డగా ఆడుతూ, తమ ప్రవర్తనతో విసుగు తెప్పిస్తున్న వారికి తక్కువగా ఓట్లు వచ్చాయి. అయితే, కొందరికి ఫేమ్‌ను బట్టి ఓట్లు పడ్డాయి.

టాప్‌లో అతడు.. ఇనాయాతో

టాప్‌లో అతడు.. ఇనాయాతో

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఊహించని మలుపులతో సాగినట్లు తెలిసింది. ఇక, పోలింగ్ ముగిసే సమయానికి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రేవంత్ ఎక్కువ ఓట్లు సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడట. అతడి తర్వాతి స్థానంలో మాత్రం ఫైర్ బ్రాండ్ ఇనాయా సుల్తానా ఉన్నట్లు తెలిసింది. ఆమె రేవంత్‌కు గట్టిపోటీనే ఇచ్చిందట.

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?

ఈ వారం చాలా ట్విస్టులతో సాగిన ఓటింగ్‌తో కంటెస్టెంట్ల స్థానాల్లో మార్పులు కనిపించాయి. అయితే తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. బాలాదిత్య మూడో స్థానంలో, కీర్తి భట్ నాలుగో స్థానంలో, రోహిత్ ఐదో స్థానంలో, ఆది రెడ్డి ఆరో స్థానంలో, శ్రీ సత్య ఏడో స్థానంలో ఉన్నారని తెలిసింది. అంటే ఈ వారం వీళ్లంతా దాదాపు సేఫ్ అయినట్లే అని బిగ్ బాస్ వర్గాల సమాచారం.

ఈ వారం ఊహించని విధంగా

ఈ వారం ఊహించని విధంగా


తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో గీతూ రాయల్ ఎనిమిదో స్థానంలో ఉందని తెలిసింది. అలాగే, మెరీనా అబ్రహం తొమ్మిదో స్థానంలోనూ, జబర్ధస్త్ ఫైమా పదో స్థానంలోనూ ఉన్నారని అంటున్నారు. అంటే ఈ వారంలో ఈ ముగ్గురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. మెరీనా తప్ప వాళ్లిద్దరిలో ఎవరు వెళ్లిపోయినా షాకింగ్ ఎలిమినేషనే అనొచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X