Bigg Boss Elimination: 6వ వారం షాకింగ్ ఓటింగ్.. మళ్లీ వాళ్లకే తక్కువ ఓట్లు.. డేంజర్ జోన్‌లో ఎవరంటే!
బిగ్ బాస్.. సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతోన్నా.. ప్రేక్షకుల మన్ననలు అందుకుని చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరుకున్న ఏకైక షో. వేరే భాషల్లోకి ఎప్పుడో వచ్చినా.. తెలుగులోకి మాత్రం ఆరేళ్ల క్రితమే ఇది పరిచయం అయింది. ఆరంభంలోనే ప్రేక్షకుల మనసు దోచుకుని సక్సెస్‌ను అందుకుంది. ఆ తర్వాత ప్రతి సీజన్ కూడా ఒకదానికి మించి ఒకటి విజయం సాధించాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆరో వారంలో జరుగుతున్న ఓటింగ్ సరళి గురించి తెలుసుకుందాం పదండి!

కొత్త కాన్సెప్టు.. చాలా చప్పగానే
ఇండియాలోని ఎన్నో భాషల్లో వస్తున్నా తెలుగులో మాత్రమే బిగ్ బాస్ షో సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు ఇటీవలే ఆరో సీజన్‌ను ఎన్నో అంచనాలతో ప్రారంభించారు. అందుకు తగ్గట్లుగానే ఇందులో సరికొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, దీనికి గతంలో మాదిరిగా స్పందన దక్కడం లేదు. ఫలితంగా ఈ సీజన్‌కు రేటింగ్ కూడా తక్కువగానే వస్తోంది.

21 మందిలో 5గురు బయటకు
తాజా సీజన్‌లోకి శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు ఎంటరయ్యారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటిలు బయటకు వెళ్లిపోయారు.

ఆరో వారం 9 మంది నామినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. మరీ ముఖ్యంగా కొందరు చంటి టాపిక్ తీసుకొచ్చి రచ్చ చేశారు. ఇలా ఈ టాస్కులో మొత్తంగా 9 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, శ్రీహాన్, రాజశేఖర్, శ్రీ సత్య, ఆది రెడ్డి, సుదీప పింకీ, గీతూ రాయల్‌లు ఉన్నారు.

ఒకే రకంగా సాగుతోన్న ఓటింగ్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎలిమినేషన్స్ ఎంతో ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకూ బయటకు వెళ్లిన వాళ్లలో పలువురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నా ఓటింగ్ రాబట్టుకోలేక వాళ్లు ఎలిమినేట్ అవక తప్పలేదు. దీంతో ఏ వారం ఓటింగ్ ఎలా జరుగుతుందో అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తుంది. ఇప్పుడు ఆరో సీజన్‌లో మాత్రం పోలింగ్ ఒకే రకంగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

టాప్‌లో అతడే.. రెండో స్థానం
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్ మొదటి రోజు నుంచి ఒకే రకంగా సాగుతుందని తెలిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయట. దీంతో అతడే ఆరంభం నుంచి మొదటి స్థానంలో ఉన్నాడట. అలాగే, రెండో స్థానంలో మాత్రం ఊహించని విధంగా యూట్యూబర్ ఆది రెడ్డి కొనసాగుతున్నట్లు సమాచారం.

మిగతా కంటెస్టెంట్ల పొజిషన్స్
ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో లైన్స్ ఓపెన్ అయినప్పటి నుంచి కంటెస్టెంట్ల స్థానాలు ఒకే రకంగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి అయితే కీర్తి భట్ మూడో స్థానంలో, గీతూ రాయల్ నాలుగో స్థానంలో, శ్రీ సత్య ఐదో స్థానంలో, రాజశేఖర్ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. అంటే.. వీళ్ల స్థానాల్లో మార్పులు లేకపోతే మాత్రం వీళ్లంతా ఈ వారానికి సేఫ్ అవుతారన్న మాట.

మళ్లీ వాళ్లిద్దరే డేంజర్ జోన్‌లో
బిగ్ బాస్ ఆరో సీజన్ ఆరో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ప్రస్తుతం సుదీప పింకీ ఏడో స్థానంలో ఉందని అంటున్నారు. అలాగే, బాలాదిత్య, మెరీనా ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో కొనసాగుతున్నారట. వీళ్లిద్దరి ప్లేస్‌లు క్రమంగా మారుతున్నట్లు తెలిసింది. మొత్తానికి మెరీనా, బాలాదిత్య మాత్రమే ఈ వారం డేంజర్ జోన్‌లో ఉన్నారని బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











