Bigg Boss Elimination: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. ఆట మారింది షాక్ తగిలింది.. ఈ వారం అతడు సేఫేనా!

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇప్పటి వరకు తెలుగులో వచ్చిన సీజన్లు అన్ని సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. దీంతో నిర్వాహకులు మరింత ఉత్సాహంగా సీజన్ల మీద సీజన్లను తీసుకువస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ షో సీజన్‌ను పరిచయం చేశారు. ఇందులో ఏడో వారంలో ఏకంగా 13 మంది నామినేషన్‌లో ఉన్నారు. అందులో నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఓటింగ్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం పదండి!

కంటెంట్ మార్చినా రావట్లేదుగా

కంటెంట్ మార్చినా రావట్లేదుగా

బిగ్ బాస్ తెలుగులో ఎప్పుడు వచ్చినా భారీ స్థాయిలో స్పందనను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా ఆరో దానిపై కూడా బజ్‌ ఓ రేంజ్‌లో ఏర్పడింది. అందుకు అనుగుణంగానే ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త అంశాలతో కూడిన కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. కానీ, దీనికి ఆశించిన రీతిలో రెస్పాన్స్ రావట్లేదు. దీంతో నిర్వహకులు నిరాశగా ఉన్నారు.

ఇప్పటి వరకూ ఆరుగురు ఔట్

ఇప్పటి వరకూ ఆరుగురు ఔట్

ఆరో సీజన్‌లోకి శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌‌లు ఎంటరయ్యారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీపలు ఎలిమినేట్ అయ్యారు.

ఈ వారం 13 మంది నామినేట్

ఈ వారం 13 మంది నామినేట్

బిగ్ బాస్ తాజా సీజన్‌లో ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవలతో రసాభాసగా జరిగింది. ఇలా ఈ టాస్కు మొత్తంలో 13 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్, కీర్తి భట్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, రోహిత్‌లు ఉన్నారు.

ఓటింగ్ మార్పు... స్థానాల్లోనూ

ఓటింగ్ మార్పు... స్థానాల్లోనూ

తాజాగా జరుగుతోన్న సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఎన్నో ట్విస్టులతో సాగాయి. దీనికి కారణం ఇప్పటి వరకూ దీని నుంచి వెళ్లిన వాళ్లలో పలువురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆరో వారంలో కూడా ఓటింగ్ ఎన్నో మార్పులతో నడుస్తోంది. దీంతో ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ల స్థానాలు మారుతున్నాయట.

 తొలి రెండు స్థానాల్లో ఎవరు?

తొలి రెండు స్థానాల్లో ఎవరు?

ఈ సీజన్‌లో ఏడో వారానికి సంబంధించిన ఓటింగ్ మొదటి రోజు నుంచి చాలా మార్పులతో సాగుతోంది. కానీ, మొదటి రెండు స్థానాల్లో మాత్రం ఎటువంటి మార్పులు కనిపించడం లేదని తెలిసింది. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఇందులో అత్యధిక ఓటింగ్‌తో రేవంత్ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడట. అలాగే, శ్రీహాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

ఏ పొజిషన్‌లో ఎవరున్నారు

ఏ పొజిషన్‌లో ఎవరున్నారు

ఏడో వారం ఓటింగ్‌లో గురువారం ఎపిసోడ్ తర్వాత ఓటింగ్ మారిందట. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్స్ చూస్తే.. బాలాదిత్య మూడో స్థానంలో, నాలుగో స్థానంలో జబర్ధస్త్ ఫైమా, ఐదో స్థానంలో ఆది రెడ్డి, ఆరో స్థానంలో కీర్తి భట్, ఏడో స్థానంలో రోహిత్, ఎనిమిదో స్థానంలో అర్జున్ కల్యాణ్, తొమ్మిదో స్థానంలో ఇనాయా, పదో స్థానంలో వాసంతి ఉన్నారని బుల్లితెర వర్గాల ద్వారా తెలిసింది.

వాళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్

వాళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్

ఏడో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ప్రస్తుతం రాజశేఖర్ ఒక స్థానం మెరుగు పరుచుకుని 11వ స్థానంలోకి వచ్చాడట. అయితే, ఊహించని విధంగా శ్రీ సత్య, మెరీనా 12, 13 స్థానాల్లో ఉన్నారట. దీంతో ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. కానీ, ఓటింగ్‌కు సమయం ఉన్నందున మళ్లీ మారే ఛాన్స్ ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X