Bigg Boss Elimination: 7వ వారం షాకింగ్ ఓటింగ్.. డేంజర్‌లో ఊహించని కంటెస్టెంట్లు.. టాప్‌లో మాత్రం!

గతంలో ఎప్పుడూ చూడని టాస్కులు, కుట్రలు కుతంత్రాలు, గ్రూపు తగాదాలు, మిడ్ నైట్ మసాలా సన్నివేశాలు ఇలా ఎన్నో రకరకాల పరిణామాలతో సాగే ఏకైక షో బిగ్ బాస్. అందుకే అసలే మాత్రం తెలియని కాన్సెప్టుతో వచ్చినా.. తెలుగు ప్రేక్షకుల దీనికి భారీ స్థాయిలో స్పందనను అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్‌‌గా నిలిచింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను జరుపుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని ప్రసారం చేస్తున్నారు. ఇందులో ఏడో వారం ఓటింగ్ ఆసక్తికరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఆ సంగతులేంటో చూద్దామా!

ఎంత కొత్తగా చూపించినా కూడా

ఎంత కొత్తగా చూపించినా కూడా

గతంలో వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. అంతేకాదు, ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌ను చూపిస్తూ మజాను పంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఈ సీజన్‌కు ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. దీంతో రేటింగ్ ఘోరంగా పడిపోతూనే ఉంది.

ఈ సీజన్‌లో 6 గురు ఎలిమినేట్

ఈ సీజన్‌లో 6 గురు ఎలిమినేట్

తాజా సీజన్‌లోకి శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌‌లు ఎంటరయ్యారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీపలు వెళ్లిపోయారు.

ఈ వారం 13 మంది నామినేషన్

ఈ వారం 13 మంది నామినేషన్

ఆరో సీజన్‌లోని ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవలతో ఎంతో రచ్చ రచ్చగా సాగింది. ఇలా ఈ టాస్కు మొత్తంలో 13 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్, కీర్తి భట్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, రోహిత్‌లు ఉన్నారు.

షాకింగ్ ఓటింగ్... చాలా మార్పు

షాకింగ్ ఓటింగ్... చాలా మార్పు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఊహించని విధంగానే సాగుతున్నాయి. ఇప్పటి వరకూ దీని నుంచి వెళ్లిన వాళ్లలో పలువురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉన్నారన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆరో వారంలో కూడా ఓటింగ్ ఎన్నో మార్పులతో సాగుతోంది. దీంతో ఎప్పటికప్పుడు కంటెస్టెంట్ల స్థానాలు మారుతున్నట్లు తెలిసింది.

టాప్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు

టాప్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు

ఏడో వారానికి సంబంధించిన ఓటింగ్ మొదటి రోజు నుంచి చాలా మార్పులతో సాగుతోంది. కానీ, మొదటి రెండు స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా కనిపించడం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో రేవంత్‌కు భారీగా ఓటింగ్ జరుగుతోందట. ఫలితంగా అతడు టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడని తెలిసింది. అలాగే, శ్రీహాన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడని టాక్.

మిగిలిన వాళ్ల పొజిషన్స్ ఇలా

మిగిలిన వాళ్ల పొజిషన్స్ ఇలా

ఏడో వారం ఓటింగ్‌లో చాలా ట్విస్టులు కనిపించడంతో కంటెస్టెంట్ల స్థానాల్లోనూ మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఉన్న పొజిషన్స్ చూస్తే.. బాలాదిత్య మూడో స్థానంలో, నాలుగో స్థానంలో జబర్ధస్త్ ఫైమా, ఐదో స్థానంలో ఆది రెడ్డి, ఆరో స్థానంలో కీర్తి భట్, ఏడో స్థానంలో రోహిత్, ఎనిమిదో స్థానంలో అర్జున్ కల్యాణ్, తొమ్మిదో స్థానంలో ఇనాయా, పదో స్థానంలో వాసంతి ఉన్నారని సమాచారం.

డేంజర్ జోన్‌లోనే ఈ ముగ్గురు

డేంజర్ జోన్‌లోనే ఈ ముగ్గురు

బిగ్ బాస్ ఆరో సీజన్ ఆరో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ప్రస్తుతం శ్రీ సత్య 11వ స్థానంలో ఉందని తెలిసింది. అలాగే, రాజశేఖర్, మెరీనా 12, 13 స్థానాల్లో కొనసాగుతున్నారట. దీంతో ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఇంకా ఓటింగ్‌కు సమయం ఉన్నందున ఇది మారే ఛాన్స్ కూడా ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X