Bigg Boss Elimination: మళ్లీ ఊహించని ఎలిమినేషన్.. శ్రీహాన్‌కు కోలుకోలేని షాక్.. ఎలిమినేట్ ఎవరంటే!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ ఉన్నా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అంతలా ఈ కార్యక్రమాన్ని ఇక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. దీనికి కారణం చిత్ర విచిత్రమైన టాస్కులు, రకరకాల ఎమోషన్స్‌తో ఈ షో ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ ఉండడమే. దీంతో నిర్వహకులు వరుస సీజన్లతో వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో దాన్ని నడుపుతున్నారు. ఇందులో పదకొండో వారానికి సంబంధించిన ఓటింగ్ ఎలా జరిగింది? ఎవరెవరికి షాక్ తగిలింది? ఇంతకీ ఈ వారం ఎవరు వెళ్లే ఛాన్స్ ఉంది? అనేవి మీరే చూసేయండి!

చిన్నగా పుంజుకుంటోందిగా

చిన్నగా పుంజుకుంటోందిగా

గతంలో వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఆరో దానిపై భారీ అంచానలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో గ్రాండ్‌గా మొదలు పెట్టారు. కానీ, ఆరంభం నుంచే దీనికి ఆశించిన రీతిలో స్పందన రావడం లేదు. దీంతో నిర్వహకులు ప్లాన్లు మార్చుకుని ఎన్నో ట్విస్టులను ఇస్తున్నారు. దీంతో ఇది రంజుగా సాగుతూ క్రమంగా పుంజుకుంటోంది.

పదకొండు మంది వెళ్లారుగా

పదకొండు మంది వెళ్లారుగా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి ప్రవేశించారు. ఇందులో పది వారాల్లో ఒకసారి ఎలిమినేషన్ తీసేసి.. రెండుసార్లు ఇద్దరేసి కంటెస్టెంట్లను పంపించారు. ఇక, ఇప్పటి వరకూ జరిగిన 10 వారాలకు గానూ షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతిలు షో నుంచి బయటకు వెళ్లిపోయారు.

9 మందిలో ఒకరు సేఫ్‌గానే

9 మందిలో ఒకరు సేఫ్‌గానే

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని నామినేషన్స్ టాస్కులు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. కానీ, గత సోమవారం జరిగిన పదకొండో వారం నామినేషన్స్ టాస్కు మాత్రం గొడవలు లేకుండానే సోసోగా సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రేవంత్, మెరీనా, రోహిత్, శ్రీ సత్య, రాజ్‌లు నామినేట్ అయ్యారు. కానీ, ఇందులో ఇమ్యూనిటీ టాస్కు ద్వారా రాజ్ సేఫ్ అయ్యాడు.

ట్విస్టులతో సాగిన ఓటింగ్

ట్విస్టులతో సాగిన ఓటింగ్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఊహించని విధంగానే జరిగాయి. అందుకు తగ్గట్లుగానే పదకొండో వారంలో సైతం ఓటింగ్ విభిన్నంగా సాగినట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి నుంచి చివరి వరకూ కంటెస్టెంట్ల స్థానాలు మారినట్లు తెలిసింది. ప్రతిరోజూ ఒక్కోరకంగా పోలింగ్ జరిగింది. దీంతో ఈ వారం కూడా ఏదైనా జరిగే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

 గట్టి పోటీతో టాప్‌లో అతడు

గట్టి పోటీతో టాప్‌లో అతడు

ఈ సీజన్‌లో రేవంత్ ఎప్పుడు నామినేషన్స్‌లోకి వచ్చినా అతడికే ఎక్కువ ఓట్లు పడడం జరిగేది. కానీ, పదకొండో వారంలో మాత్రం ఊహించని విధంగా అతడి కంటే ఇనాయా సుల్తానాకు ఎక్కువ ఓటింగ్ జరిగినట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. అలా వీళ్లిద్దరూ టాప్ ప్లేస్‌ కోసం పోటీ పడ్డారని సమాచారం. అయితే, చివర్లో రేవంత్ పుంజుకోవడంతో అతడే టాప్ ప్లేస్‌లో నిలిచాడని టాక్.

చాలా మందికి తక్కువగానే

చాలా మందికి తక్కువగానే

చాలా ట్విస్టులతో సాగిన పదకొండో వారం ఓటింగ్‌తో కంటెస్టెంట్ల స్థానాలు ఎలా ఉన్నాయి అనే దానిపై తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనిబట్టి ఈ వారంలో రేవంత్, ఇనాయా టాప్ 2 ప్లేసుల్లో నిలిచారు. ఇక, కీర్తి భట్ మూడో స్థానంలో, ఆది రెడ్డి నాలుగో స్థానంలో, రోహిత్ ఐదో స్థానంలో, శ్రీ హాన్ ఆరో స్థానంలో ఉన్నట్లు తెలిసింది. ఈ వారం శ్రీహాన్‌కు కోలుకోలేని షాక్ తగిలింది.

ఈ వారం ఎలిమినేట్ ఎవరు?

ఈ వారం ఎలిమినేట్ ఎవరు?

ఈ వారానికి జరిగిన ఓటింగ్‌‌లో శ్రీ సత్య ఏడో స్థానంలో, మెరీనా ఎనిమిదో స్థానంలోనూ ఉన్నట్లు తెలిసింది. అంటే వీళ్ల ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక, విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. మెరీనానే ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది. శ్రీహాన్ కూడా డేంజర్‌ జోన్‌లోకి వచ్చినా చివరి రోజు తప్పించుకున్నాడని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X