Bigg Boss Winner: నాగార్జున సంచలన ప్రకటన.. ఇనాయాతో పాటు మరొకరు ఔట్.. షో చరిత్రలోనే తొలిసారి

ఊహించని టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్టాటలు.. లవ్ ట్రాకులు.. రొమాన్స్.. ఎమోషనల్ ఎలిమినేషన్స్.. ఇలా ఎన్నో రకాల రియాలిటీ సీన్స్‌తో సాగుతోన్న షోనే బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఆరో సీజన్‌ను ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇది ఇప్పుడు ఫినాలే వీక్‌కు కూడా చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా హోస్ట్ అక్కినేని నాగార్జున సంచలన ప్రకటన చేశాడు. అసలేం జరిగిందో మీరే తెలుసుకోండి మరి!

చివర్లో మరింత కొత్త కంటెంట్

చివర్లో మరింత కొత్త కంటెంట్

బిగ్ బాస్ ఆరో సీజన్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్ అవలేదన్న విషయం తెలిసిందే. దీంతో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తూ ముందుకు సాగుతోన్నారు. ఇందులో భాగంగానే గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త పద్దతులను తీసుకు వస్తున్నారు. దీంతో చివరి వారాల్లో దీనికి రేటింగ్ కాస్త పెరిగింది. ఇక, ఫినాలే వీక్‌లో కంటెస్టెంట్ల జర్నీ వీడియోలను చూపించబోతున్నారు.

వాళ్లంతా వచ్చి వెళ్లిపోయారు

వాళ్లంతా వచ్చి వెళ్లిపోయారు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో ఎన్నో ఊహించని ఎలిమినేషన్స్ జరిగాయి. ఇలా గత 13 వారాల్లో.. హౌస్ నుంచి 14 మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లారు. ఇందులో వరుసగా షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజ్‌, ఫైమాలు ఎలిమినేట్ అయిపోయారు.

14వ వారంలో ఇనాయా ఔట్

14వ వారంలో ఇనాయా ఔట్

బిగ్ బాస్ ఫినాలే వీక్‌కు ముందు అత్యంత ముఖ్యమైనదిగా చెప్పుకునే 14వ ఎలిమినేషన్ గత ఆదివారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ముగిసింది. ఈ వారానికి గానూ శ్రీహాన్ తప్ప హౌస్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లను బిగ్ బాస్ నేరుగా నామినేట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్లందరిలో నుంచి ఊహించని విధంగా లేడీ ఫైర్ బ్రాండ్ ఇనాయా సుల్తానాను బయటకు పంపించారు.

ఫినాలే వీక్‌లోకి ఆ ఆరుగురు

ఫినాలే వీక్‌లోకి ఆ ఆరుగురు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఆదివారం రాత్రి నుంచే ఫినాలే వీక్ జరుగుతోంది. అంతేకాదు, విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. ఇక, ఏడుగురు సభ్యుల్లో ఇనాయా సుల్తానా ఎలిమినేట్ అవడంతో.. షో చరిత్రలోనే తొలిసారి ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి అడుగు పెట్టారు. అందులో రేవంత్, శ్రీహాన్, శ్రీ సత్య, ఆది రెడ్డి, కీర్తి భట్, రోహిత్‌లు ఉన్నారు.

నాగార్జున సంచలన ప్రకటన

నాగార్జున సంచలన ప్రకటన

ఆరో సీజన్‌లో 14వ వారం ఎలిమినేషన్ జరిగిన తర్వాత హోస్ట్ అక్కినేని నాగార్జున ఫినాలేలోకి వెళ్లిన కంటెస్టెంట్లను అభినందించాడు. అంతేకాదు, వాళ్లకు బైబై చెప్పిన తర్వాత ఆడియెన్స్‌కు ఓ సంచలన అనౌన్స్‌మెంట్ చేశాడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుందని వెల్లడించాడు. అంటే.. గ్రాండ్ ఫినాలేలో ఐదుగురు సభ్యులే ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న మాట.

ఇనాయాతో పాటు మరొకరు

ఇనాయాతో పాటు మరొకరు

బిగ్ బాస్ తెలుగు షో చరిత్రలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎప్పుడూ జరగలేదు. తొలిసారి దాన్ని ఆరో సీజన్ 15వ వారంలో పెట్టబోతున్నారు. ఇక, ఇందులో ఆదివారం రాత్రి 10.30 గంటల నుంచి జరుగుతున్న ఓటింగ్‌లో చివరి స్థానంలో నిలిచిన కంటెస్టెంట్‌ బయటకు వెళ్లిపోబోతారని హోస్ట్ నాగార్జున ప్రకటించాడు. ఇది బుధవారం రాత్రి ఎపిసోడ్‌లో జరుగుతుందని కూడా చెప్పాడు.

ఇద్దరిలోనే ఒకరు బయటకు

బిగ్ బాస్ ఆరో సీజన్ విజేతను నిర్ణయించే ఓటింగ్ లైన్స్ ఆదివారం రాత్రి నుంచే ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇక, అప్పుడే ఇందులో ఎవరు మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారు అన్న చర్చ జరుగుతోంది. గత వారం ఓటింగ్‌లో చివర్లో ఉన్న కీర్తి భట్, శ్రీ సత్యలే ఇప్పుడు కూడా లీస్ట్‌లో ఉన్నారట. దీంతో వీళ్లలో ఒకరిని బయటకు పంపే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X