Bigg Boss 6 Telugu: ఆ రెండు విషయాల్లో హై సెక్యూరిటీ.. షో ముగిసే వరకు కఠినంగానే..

ఇండియన్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వచ్చిన ప్రతీ సీజన్ కు కూడా మంచి క్రేజ్ దక్కింది. అలాగే మొదటిసారి ఓటీటీ లో కూడా బిగ్ బాస్ నాన్ స్టాప్ షోకు మంచి క్రేజ్ దక్కింది. ఇక టెలివిజన్లో ఆరవ సీజన్ ను కూడా గ్రాండ్ గా మొదలు పెట్టాలని ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే ప్రత్యేకమైన సెట్ కూడా నిర్మించడం జరిగింది. పూర్తిస్థాయిలో కంటెస్టెంట్స్ ని తయారు చేయాలని అనుకుంటున్నారు. అయితే ఆరో సీజన్లో రెండు ప్రత్యేకమైన విషయాల్లో అత్యంత కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారట. పూర్తి వివరాల్లోకి వెళితే..
మంచి రేటింగ్స్

మంచి రేటింగ్స్

మంచి రేటింగ్స్

మొదట బిగ్ బాస్ తెలుగులో ప్రసారమవుతోంది అనగానే నెగిటివ్ కామెంట్లు ఎక్కువగా వచ్చాయి. ఎందుకంటే అలాంటి కాంట్రవర్షియల్ షో తెలుగులో వర్కౌట్ కాకపోవచ్చునని అభిప్రాయాలు చాలానే వచ్చాయి. నిర్వాహకులు మాత్రం ఎన్టీఆర్ తో మొదలు పెట్టి ఆ తరువాత నాగార్జునతో మరింత సక్సెస్ అయ్యేలా చేశారు. రేటింగ్స్ కూడా ఊహించని రేంజ్ లో వస్తున్నాయి.

గతంలో కంటే కాస్త భిన్నంగా..

గతంలో కంటే కాస్త భిన్నంగా..

ముఖ్యంగా నాగార్జున గత మూడు సీజన్స్ లో తన హోస్టింగ్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు ఆరవ సీజన్ కోసం కూడా ఆయన మరోసారి హోస్టింగ్ చేయబోతున్నారు. అయితే ఈ సారి బిగ్ బాస్ షో లో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో కంటే కాస్త భిన్నమైన నియమాలు అలాగే కంటెస్టెంట్స్ ను కూడా డిఫరెంట్ స్టైల్ ఎలిమినెట్ సమాచారం.

కఠినమైన నిర్ణయం

కఠినమైన నిర్ణయం

గత సీజన్స్ కంటే కూడా ఆరో సీజన్ ప్రత్యేకంగా ఉండాలని నిర్వాహకులు ప్రత్యేకమైన నియమాలను కూడా ఆచరణలోకి తీసుకు రాబోతున్నారు. ముఖ్యంగా రెండు విషయాల్లో ఈసారి నిర్వాహకులు చాలా కఠినమైన రూల్స్ కూడా సెట్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలుగు సీజన్స్ లో ఇప్పటివరకు వచ్చిన ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయం ముందుగానే సోషల్ మీడియాలో లీకైపోతున్నాయి. అయితే ఈ క్రమంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ముందుగా ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయంలో లీక్ అవ్వకూడదు అని బిగ్ బాస్ నిర్వాకులు ప్రతి ఒక్కరిని కూడా వారి పరిధిలోనే ఉంచుకోబోతున్నారట.

 షో ముగిసే వరకు

షో ముగిసే వరకు

బిగ్ బాస్ షో ముగిసే వరకు కూడా షోకు సంబంధించిన యూనిట్ మొత్తం కూడా బయటకు వెళ్లకుండా నిర్వాహకుల కంట్రోల్ లోనే ఉండాలట. ప్రత్యేకంగా వారికి కూడా వసతులు ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ ఎవరూ కూడా ఇంటికి వెళ్లడానికి వీల్లేదు. అలాగే ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి కూడా వీలు లేదు. వారి కోసం ప్రత్యేకంగా మరొక వసతి గృహాన్ని ఏర్పాటు చేయబోతున్నారట.

 లీక్ అవ్వకూడదని..

లీక్ అవ్వకూడదని..

అన్నపూర్ణ స్టూడియోలోనే బిగ్ బాస్ కు సంబంధించిన అన్ని పనులు నిర్వహించాలని అని.. గేటు దాటి ఒక్క విషయం కూడా బయటకు వెళ్లకూడదు అని నిర్వాహకులు చాలా కఠినమైన రూల్స్ తో ఈసారి ఈ రియాలిటీ షోను నిర్వహించబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఖర్చుకు ఏమాత్రం వెనుకాడకుండా కొంతమంది ఉన్నతమైన సెలబ్రిటీలను కూడా ఈసారి కంటెస్టెంట్స్ గా తీసుకురాబోతున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X