Bigg Boss Nominations: నామినేషన్స్ లిస్ట్ లీక్.. మొదటి వారం 8 మంది.. టాప్ కంటెస్టెంట్లకే షాక్

తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతూ.. దాదాపు ఆరేళ్లుగా ప్రేక్షకులను మజాను పంచుతోంది బిగ్ బాస్. ఎంటర్‌టైన్‌మెంట్‌కు పరిమితులు ఉండవని నిరూపించిన ఈ షో.. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుని సత్తా చాటింది. అదే సమయంలో భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని నేషనల్ లెవెల్‌లో ట్రెండ్ సెట్ చేసింది. ఇక, ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఆరోది కూడా గత ఆదివారమే ప్రారంభం అయింది. ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ఈ సీజన్ మజాను పంచుతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారం నామినేషన్స్ ప్రక్రియ లీక్ అయింది. ఇందులో ఎవరెవరు నామినేట్ అయ్యారో మీరే చూడండి!

మరింత ఆసక్తికరంగా ఆరో సీజన్

మరింత ఆసక్తికరంగా ఆరో సీజన్

బిగ్ బాస్ షో ఇండియాలోనే ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోంది. అయితే, తెలుగులో మాత్రమే దీనికి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. అందుకే ఆరో సీజన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. అందుకు అనుగుణంగానే దీన్ని గత ఆదివారం ఎంతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఇక, ఈ సీజన్‌లో నిర్వహకులు ఎన్నో ప్రయోగాలు చేయబోతున్నట్లు ముందుగానే తెలిపిన సంగతి తెలిసిందే.

21 మందితో సాహం చేసిన టీమ్

21 మందితో సాహం చేసిన టీమ్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు కంటెస్టెంట్లు ఎంటర్ అయ్యారు. ఇలా ఇంత మంది ఎప్పుడూ హౌస్‌లోకి రాలేదు.

బిగ్ బాస్‌లో ముఖ్యమైన ప్రక్రియ

బిగ్ బాస్‌లో ముఖ్యమైన ప్రక్రియ

బిగ్ బాస్ షో మొత్తంలోనే ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అని చెప్పాలి. ఈ ప్రక్రియ జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా పుడుతుంది. అవే సగటు బిగ్ బాస్ ప్రేక్షకుడికి మజాను పంచుతాయి. ఈ ప్రక్రియను ప్రతి సోమవారం ఎపిసోడ్‌లో చూపించేవారన్న విషయం తెలిసిందే.

టాస్కును బుధవారానికి మార్చేసి

టాస్కును బుధవారానికి మార్చేసి


సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ ప్రక్రియ సోమవారం రాత్రి ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో జరుగుతుంది. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం దీన్ని సోమవారం చూపించడం లేదు. అంతేకాదు, ఈ టాస్కును బుధవారం ప్రసారం చేయబోతున్నారు. వీక్ డేస్‌లో ఈ షోకు ఆదరణ తగ్గకుండా ఉంచేందుకే నిర్వహకులు ఈ నిర్ణయం తీసుకున్నారని బుల్లితెర వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

నామినేషన్ టాస్క్‌పై ఉత్కంఠగా

నామినేషన్ టాస్క్‌పై ఉత్కంఠగా

బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించి మొత్తం 21 మంది ప్రముఖులు హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఆదివారం హౌస్ ఎంతో సందడిగా కనిపించింది. అయితే, బుధవారం మాత్రం నామినేషన్స్ టాస్కుతో గేమ్ మొదలవుతుంది. ఈ నేపథ్యంలో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారా అన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ ఎంతో ఉత్కంఠకరంగా మారింది.

బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్ లీక్

బిగ్ బాస్ నామినేషన్స్ లిస్ట్ లీక్


బుధవారం రాత్రి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో నామినేషన్ ప్రక్రియను చూపించబోతున్నారు. అయితే, దీనికి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ నేపథ్యంలో ఈ టాస్కులో ఎవరు నామినేట్ అయ్యారన్న విషయం తాజాగా లీకైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారం ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారని తెలిసింది.

ఈ వారం 8 మంది నామినేషన్

ఈ వారం 8 మంది నామినేషన్

తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఆరో సీజన్ మొదటి వారం నామినేషన్స్‌లో రేవంత్, చలాకీ చంటి, బాలాదిత్య, జబర్ధస్త్ ఫైమా, ఇనాయా సుల్తానా, ఆరోహీ రావ్, శ్రీ సత్య, అభినయ శ్రీలు నామినేట్ అయ్యారట. ఇందులో ఎక్కువ మంది టైటిల్ ఫేవరెట్లే ఉండడం గమనార్హం. ఇక, ఈ లిస్టులో మార్పులు ఉంటాయా అన్నది మాత్రం చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X