Bigg Boss Nominations: 2వ వారం నామినేషన్స్ లిస్ట్ ఇదే.. ఈసారి 8 మంది.. ఆ ముగ్గురికి బిగ్ షాక్
సాదాసీదాగానే తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఏకైక షో బిగ్ బాస్. రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం ఎన్నో వివాదాలకు, గొడవలకు కారణం అయింది. అయినప్పటికీ ఎవరూ ఊహించని రీతిలో స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా దేశంలో ఏ షోకూ రానంత రేటింగ్‌తో దుమ్ము దులుపుతోంది. ఇలా ఇప్పటికే పలు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఆరో సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇక, ఈ షోలోనే అత్యంత ముఖ్యమైన నామినేషన్స్ ప్రక్రియ.. రెండో వారంలో ఎలా జరగబోతుంది? ఇందులో ఎంత మంది నామినేట్ అయ్యారు? అనే విషయాలు తాజాగా లీక్ అయ్యాయి. ఆ సంగతులేంటో మీరే చూడండి మరి!

కొత్త ప్రయోగాలతో ఆసక్తికరంగానే
తెలుగులో బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా ప్రేక్షకులు దీనికి భారీ స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఈ షో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఆరో దానిని కూడా మొదలు పెట్టారు. దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ప్రతి ఎపిసోడ్ జనరంజకంగానే సాగుతోంది.

తొలి వారం ఎలిమినేషన్ లేదుగా
ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు హౌస్‌లోకి ప్రవేశించారు. వీరిలో మొదటి వారం ఎవరినీ ఎలిమినేట్ చేయకుండా సర్‌ప్రైజ్ చేశారు.

ఈ వారం నామినేషన్స్‌పై ఆసక్తి
బిగ్ బాస్ షోలోనే ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అని చెప్పాలి. ఈ ప్రక్రియ జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా పుడుతుంది. అవే సగటు బిగ్ బాస్ ప్రేక్షకుడికి మజాను పంచుతాయి. ఇక, మొదటి వారం ఎలిమినేషన్ లేకపోవడంతో ఈసారి నామినేషన్స్‌పై ఆసక్తి నెలకొంది.

మళ్లీ మారిన నామినేషన్స్ టాస్క్
సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కును సోమవారం జరిగే ఎపిసోడ్‌లోనే చూపిస్తుంటారు. ప్రతి సీజన్‌లోనే ఇలానే చేశారు. అయితే, ఆరో సీజన్ మొదటి వారంలో మాత్రం దీన్ని బుధవారం నిర్వహించారు. అయితే, ఇప్పుడు నిర్వహకులు మరోసారి పాత పద్దతినే వాడుతున్నారు. ఇందులో భాగంగానే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియను సోమవారమే పెట్టబోతున్నారు.

రెండో వారం.. అవి బావిలో పడేసి
బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను కొత్తగా నిర్వహించబోతున్నారు. ఇందులో భాగంగానే గార్డెన్ ఏరియాలో ఓ బావిని ఏర్పాటు చేసి.. ప్రతి కంటెస్టెంట్ నామినేట్ చేసే కంటెస్టెంట్ ఫొటో కుండలో పెట్టి నీటిలో పడేయాలి. ఇక, ఈ టాస్కు ఎన్నో గొడవలతో రంజుగా సాగినట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

2వ వారంలో 8 మంది నామినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని రెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో రేవంత్, ఫైమా, అభినయశ్రీ, ఆదిరెడ్డి, గీతూ రాయల్, రాజశేఖర్, షానీ సాల్మన్, రోహిత్ అండ్ మెరీనా (ఈ జంటను ఒక కంటెస్టెంట్‌గా నిర్ణయించారు)లు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చారు.

అలా అతడు సేఫ్.. ఈ ముగ్గురు
మొదటి వారంలో కెప్టెన్ అయిన బాలాదిత్య.. రెండో వారంలో సేఫ్ అయ్యాడు. ఇక, మిగిలిన వాళ్లలో ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వీళ్లను మినహాయించి అందరూ సేఫ్ అయ్యారు. అయితే, బిగ్ బాస్ మరోసారి ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి. ఇదిలా ఉండగా.. రేవంత్, ఫైమా, అభినయశ్రీ వరుసగా రెండో వారం కూడా నామినేట్ అవడం గమనార్హం.


Click it and Unblock the Notifications











