Bigg Boss Elimination: బిగ్ ట్విస్టుతో ముగిసిన ఓటింగ్.. ఆ ఇద్దరి వీడియోలు రెడీ.. వెళ్లేది ఎవరంటే!

ఇండియాలోని ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగు బిగ్ బాస్ మాత్రమే దేశంలోనే నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోన్న విషయం తెలిసిందే. ఇది ఎప్పుడు ప్రసారం అయినా మన ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తూనే ఉంది. అందుకే సక్సెస్‌ఫుల్‌గా పలు సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఎంతో ప్రయోగాత్మకంగా సాగుతోంది. ఇక, ఇందులో ఇప్పటికే ఐదు ఎలిమినేషన్స్ జరిగాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆరో వారంలో ఎవరు బయటకు వెళ్లిపోతారు అన్న దానిపై ఓ న్యూస్ లీకైంది. ఆ వివరాలు మీకోసం!

ప్రయోగాలు చేసినా కూడా

ప్రయోగాలు చేసినా కూడా

ఏమాత్రం అంచనాలు లేకుండానే తెలుగులోకి వచ్చినా సూపర్ డూపర్ హిట్ అయిన షో బిగ్ బాస్. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఆరో దాన్ని ఎంతో ప్రయోగాత్మకంగా నడుపుకుంటోంది. ఇందులో అంతకు ముందెన్నడూ చూడని కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, దీనికి మాత్రం ఆదరణ దక్కక రేటింగ్ పెద్దగా దక్కడం లేదు.

ఆ ఐదుగురు ఎలిమినేషన్

ఆ ఐదుగురు ఎలిమినేషన్

ఇప్పుడు నడుస్తోన్న సీజన్‌లోకి శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటిలు బయటకు వెళ్లిపోయారు.

ఈ సారి 9మంది నామినేట్

ఈ సారి 9మంది నామినేట్

బిగ్ బాస్ ఆరో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది. కొందరు కంటెస్టెంట్లు పాత గొడవలను మనసులో పెట్టుకుని ఆ పాయింట్లతో గొడవలకు దిగారు. ఇలా ఈ టాస్కులో మొత్తం ఇనాయా సుల్తానా, మెరీనా, బాలాదిత్య, శ్రీహాన్, రాజశేఖర్, శ్రీ సత్య, ఆది రెడ్డి, సుదీప పింకీ, గీతూ రాయల్‌లు ఆరో వారానికి నామినేట్ అయ్యారు.

ట్విస్టుతో ముగిసిన ఓటింగ్

ట్విస్టుతో ముగిసిన ఓటింగ్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ ఐదు ఎలిమినేషన్స్ జరిగాయి. వాటిలో చాలా వరకూ ఊహించని విధంగానే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఆరో వారంలో కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్నది ఆసక్తికరంగా మారింది. దీనికి తగ్గట్లుగానే ఈ వారం ఓటింగ్ కూడా చిత్ర విచిత్రంగా సాగింది. చివరకు బిగ్ ట్విస్టుతో ఆరో వారం ఓటింగ్ ముగిసినట్లు ఓ న్యూస్ లీకైంది.

టాప్‌ 2లో ఆ కంటెస్టెంట్లు

టాప్‌ 2లో ఆ కంటెస్టెంట్లు

తాజా సీజన్‌లో ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్ ఆరంభం నుంచే ఎన్నో మలుపులతో సాగిందని తెలిసింది. కానీ, మొదటి రెండు స్థానాల్లో మాత్రం ఇద్దరు కంటెస్టెంట్లు సెట్టైపోయి ఉన్నారని సమాచారం. ఇక, ఓటింగ్ ముగిసే సమయానికి శ్రీహాన్‌కు ఎక్కువ ఓట్లతో టాప్‌లో ఉన్నాడట. రెండో స్థానంలో మాత్రం యూట్యూబర్ ఆది రెడ్డి నిలిచినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

వీళ్లంతా సేఫ్ అయినట్లేగా

వీళ్లంతా సేఫ్ అయినట్లేగా

ఆరో వారానికి సంబంధించిన ఓటింగ్ ముగిసే సమయానికి చాలా మంది స్థానాల్లో మార్పులు కనిపించాయని సమాచారం. పోలింగ్ పూర్తయ్యే సమయానికి కీర్తి భట్ మూడో స్థానంలో, గీతూ రాయల్ నాలుగో స్థానంలో, శ్రీ సత్య ఐదో స్థానంలో, బాలాదిత్య ఆరో స్థానంలో ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. అంటే.. ఈ వారంలో వీళ్లందరూ సేఫ్ అయిపోయినట్లే అనే టాక్ వినిపిస్తోంది.

ఆ ఇద్దరిలో ఒకరు అవుట్

ఆ ఇద్దరిలో ఒకరు అవుట్

తాజా వారానికి సంబంధించి జరిగిన ఓటింగ్‌లో మెరీనా ఏడో స్థానంలో నిలిచిందట. అలాగే, రాజశేఖర్, సుదీప ఎనిమిది, తొమ్మిది స్థానాల్లో ఉన్నారని తెలిసింది. దీంతో ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు, ఇప్పటికే సుదీప పింకీ, రాజశేఖర్‌కు సంబంధించిన ఏవీ (వీడియోలు)లను కూడా రెడీ చేశారని టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X