Bigg Boss Elimination: 8వ షాకింగ్ ఎలిమినేషన్.. ఫైమాకు బిగ్ షాక్.. అతడికి ప్లస్.. ఎలిమినేట్ ఎవరంటే!

ఎన్నో ఊహించని సంఘటనలు, ప్రేమ కహానీలు, గొడవలు, రొమాన్స్, కొత్త కొత్త టాస్కులు ఇలా రకరకాల ఎమోషన్స్ కనిపించేలా ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఏకైక షో బిగ్ బాస్. కొంత మంది కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచడం.. ఆటతీరు, వ్యవహార శైలితో ప్రేక్షకుల మనసు గెలుచుకునేందుకు వాళ్లంతా పాట్లు పడడంతో ఈ రంజుగా సాగుతూ ఉంటుంది. ఆరో సీజన్‌ను కూడా అలాగే నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఇందులో ఎనిమిదో వారం ఓటింగ్ ఎలా జరిగింది? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? ఈ వారం ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది? అనే సమాచారం మీకోసం!

అంతగా ఆకట్టుకోని ఆరో సీజన్

అంతగా ఆకట్టుకోని ఆరో సీజన్


భారతదేశంలోని చాలా భాషల్లో వస్తున్నా తెలుగు బుల్లితెరపైన ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు మించిన ఆదరణ మరే దానికి రావడం లేదన్నది తెలిసిందే. అందుకే ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌కు అదే రెస్పాన్స్ వస్తుందని అనుకున్నారు. కానీ, దీనికి ఆదరణ రాక రేటింగ్ కూడా దక్కడంలేదు.

ఇప్పటికే వాళ్లంతా ఎలిమినేట్

ఇప్పటికే వాళ్లంతా ఎలిమినేట్


ఆరో సీజన్‌లోకి అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌లు వెళ్లిపోయారు.

 ఇంట్లోని వాళ్లంతా నామినేషన్

ఇంట్లోని వాళ్లంతా నామినేషన్


సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కు ఎన్నో గొడవలతో సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎనిమిదో వారం ప్రక్రియ కూడా చాలా వాగ్వాదాలతో రసవత్తరంగా సాగింది. ఇందులో ఇంట్లో ఉన్న 14 మంది ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ, కీర్తి భట్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, ఫైమా, వాసంతి, మెరీనా, రాజశేఖర్, రోహిత్‌, ఆర్జే సూర్యలు నామినేట్ అయ్యారు.

ఎన్నో మార్పులతో సాగిందిగా

ఎన్నో మార్పులతో సాగిందిగా


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎనిమిదో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో ఏకంగా 14 మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఆటతీరును బట్టి కాకుండా ఫేమ్‌ను బట్టి ఓటింగ్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ వారం ఓటింగ్ ఎన్నో ట్విస్టులతో సాగింది. దీంతో మొదటి ఇద్దరి స్థానాలు తప్ప అందరివీ మారిపోయాయి.

టాప్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు

టాప్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎన్నో మార్పులతో రసవత్తరంగా సాగింది. ఇక, పోలింగ్ ముగిసే సమయానికి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రేవంత్ ఎక్కువ ఓట్లు సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడని తెలిసింది. అలాగే, మరో స్ట్రాంగ్ ప్లేయర్ శ్రీహాన్ రెండో స్థానంలో ఉన్నాడట. వీళ్లిద్దరికే దాదాపు 30 శాతం పైగా ఓటింగ్ వచ్చిందని సమాచారం.

వాళ్లంతా సేఫ్.. ఫైమాకు షాక్

వాళ్లంతా సేఫ్.. ఫైమాకు షాక్


తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం.. గీతూ రాయల్ మూడో స్థానంలో, నాలుగో స్థానంలో మెరీనా, ఐదో స్థానంలో ఆది రెడ్డి, ఆరో స్థానంలో ఇనాయా, ఏడో స్థానంలో ఫైమా, ఎనిమిదో స్థానంలో బాలాదిత్య, తొమ్మిదో స్థానంలో రోహిత్, పదో స్థానంలో కీర్తి భట్, పదకొండో స్థానంలో వాసంతిలు ఉన్నారని తెలిసింది. ఈ వారం మెరీనాతో ప్రవర్తించిన తీరుతో ఫైమాకు ఓటింగ్ తగ్గిపోయింది.

 ఎలిమినేట్ అయ్యేది ఆమె!

ఎలిమినేట్ అయ్యేది ఆమె!


ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌ ఊహించని విధంగా సాగింది. పోలింగ్ ముగిసే సమయానికి శ్రీ సత్య 12వ స్థానంలో నిలిచిందట. అలాగే, ఆర్జే సూర్య 13, రాజ్ 14వ స్థానంలో ఉన్నారని అంటున్నారు. అంటే.. ఈ వారంలో రాజ్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొదట్లో చివరి స్థానంలో ఉన్న సూర్యకు లాస్ట్ డే ఓటింగ్ బాగా పెరిగిందని టాక్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X