Bigg Boss Elimination: 8వ వారం షాకింగ్ ఓటింగ్.. చివరికి టాప్ కంటెస్టెంట్.. మరో ఇద్దరూ డేంజర్‌లోనే!

బిగ్ బాస్.. రియాలిటీ కంటెంట్‌తో నడిచే కార్యక్రమాలను ఇష్టపడే వారికి అస్సలు పరిచయమే చేయనవసరం లేని షో ఇది. అంతలా ఇది సుదీర్ఘ కాలంగా ఇండియాలో సత్తా చాటుతూ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా తెలుగులో కూడా ఈ షో చాలా సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు నిర్వహకులు ఆరో సీజన్‌ను ప్రసారం చేస్తున్నారు. ఇందులో ఎవరూ ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిదో వారంలో మరోసారి ఓటింగ్ ఊహించని విధంగా సాగుతుందని తెలిసింది. ఆ వివరాలు మీకోసం!

ఎన్ని మార్చినా రేటింగ్ రావట్లే

ఎన్ని మార్చినా రేటింగ్ రావట్లే

బిగ్ బాస్ షో తెలుగులో ప్రత్యేకతను చాటుకుంటూ ముందుకు సాగుతోంది. ఫలితంగా భారీ స్థాయిలో రేటింగ్‌ను రాబడుతూ నెంబర్ వన్ షోగా నిలుస్తుంది. అలాంటి ఎన్నో అంచనాలతో ప్రారంభం అయిన ఆరో సీజన్‌కు మాత్రం ప్రేక్షకుల నుంచి స్పందన అంతగా రావడం లేదు. ఫలితంగా ఈ సీజన్‌కు రేటింగ్ క్రమంగా పడిపోతోంది. దీంతో నిర్వహకులు నిరాశగా ఉన్నారు.

ఈ సీజన్‌లో ఏడుగురు అవుట్

ఈ సీజన్‌లో ఏడుగురు అవుట్

ఆరో సీజన్‌లోకి శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, రేవంత్‌‌లు ఎంటరయ్యారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, ఆర్జున్‌లు ఎలిమినేట్ అయ్యారు.

ఈ వారం 14 మంది నామినేట్

ఈ వారం 14 మంది నామినేట్

ఆరో సీజన్‌లోని ఎనిమిదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ కూడా ఎన్నో గొడవలతో ఎంతో రచ్చ రచ్చగా సాగింది. ఇలా ఈ టాస్కు మొత్తంలో ఇంట్లో ఉన్న 14 మంది నామినేట్ అయ్యారు. అందులో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ, కీర్తి భట్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, ఫైమా, వాసంతి, మెరీనా, రాజశేఖర్, రోహిత్‌, ఆర్జే సూర్యలు ఉన్నారు.

షాకింగ్ ఓటింగ్... తారుమారు

షాకింగ్ ఓటింగ్... తారుమారు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ ఏడు ఎలిమినేషన్స్ జరిగాయి. అందులో ఒకరిద్దరు తప్ప మిగిలిన వాళ్లంతా అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. దీంతో ఈ సారి ఓటింగ్ చాలా మార్పులతో సాగుతున్నట్లు అర్థం అవుతోంది. అదే కంటిన్యూ అవుతూ ఎనిమిదో వారంలో కూడా పోలింగ్ ఊహించని విధంగా సాగుతోంది. దీంతో తరచూ కంటెస్టెంట్ల స్థానాలు మారుతున్నాయి.

టాప్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు

టాప్ 2లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు

ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్ సోమవారం రాత్రి నుంచే చాలా మార్పులతో సాగుతోంది. కానీ, మొదటి రెండు స్థానాల్లో మాత్రం ఎటువంటి తేడా కనిపించడం లేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. ఇందులో టైటిల్ ఫేవరెట్ రేవంత్‌ భారీగా ఓటింగ్‌ను సాధిస్తూ టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడని తెలిసింది. అలాగే, శ్రీహాన్‌ రెండో స్థానంలో కొనసాగుతున్నాడని సమాచారం.

ఏ స్థానంలో ఎవరున్నారంటే

ఏ స్థానంలో ఎవరున్నారంటే

బిగ్ బాస్ ఆరో సీజన్ ఎనిమిదో వారం ఓటింగ్‌లో ప్రస్తుతానికి ఉన్న కంటెస్టెంట్ల స్థానాలను చూస్తే.. గీతూ రాయల్ మూడో స్థానంలో, నాలుగో స్థానంలో ఆది రెడ్డి, ఐదో స్థానంలో ఇనాయా సుల్తానా, ఆరో స్థానంలో మెరీనా, ఎనిమిదో స్థానంలో బాలాదిత్య, ఎనిమిదో స్థానంలో ఫైమా, తొమ్మిదో స్థానంలో శ్రీ సత్య, పదో స్థానంలో కీర్తి భట్, పదకొండో స్థానంలో రోహిత్‌లు ఉన్నారని సమాచారం.

డేంజర్ జోన్‌లో స్ట్రాంగ్ ప్లేయర్

డేంజర్ జోన్‌లో స్ట్రాంగ్ ప్లేయర్

బిగ్ బాస్ ఆరో సీజన్ ఎనిమిదో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో ప్రస్తుతం వాసంతి 12వ స్థానంలో ఉందని తెలిసింది. అలాగే, రాజశేఖర్, ఆర్జే సూర్య 13, 14 స్థానాల్లో కొనసాగుతున్నారట. అంటే స్ట్రాంగ్ ప్లేయర్‌గా పేరొందిన సూర్య ఈ సారి ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నాడన్న మాట. అయితే, క్రమంగా ఈ స్థానాలు మారే అవకాశం కూడా కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X