Bigg Boss Elimination: ఒక్కసారిగా మారిన ఓటింగ్.. ఆమె మళ్లీ సేఫే.. ఎలిమినేషన్ ప్రమాదంలో మంచోళ్లు!
కొందరు సెలెబ్రిటీలను ఒక ఇంట్లో ఉంచడం.. వాళ్లకు చిత్ర విచిత్రమైన టాస్కులు ఇచ్చి ఆడించడం.. ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా విజేతను నిర్ణయించడం.. ఈ కాన్సెప్టుతోనే నడుస్తోన్న షోనే బిగ్ బాస్. తెలుగులోకి ఆలస్యంగానే వచ్చిన ఈ కార్యక్రమం.. అనతి కాలంలోనే భారీ స్పందనను సొంతం చేసుకుంది. ఫలితంగా సూపర్ హిట్ అవడంతో పాటు వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఇప్పుడు నడస్తోన్న ఆరో సీజన్‌లో 12వ వారానికి సంబంధించిన ఓటింగ్ చాలా ట్విస్టులతో సాగుతోంది. మరి ఇందులో ఎలిమినేషన్ ప్రమాదంలో ఉన్నదెవరో మీరే చూడండి!

చివరి దశలో మరింత రంజుగా
ఎన్నో అంచనాలతో వచ్చిన బిగ్ బాస్ ఆరో సీజన్‌కు ఆదరణ అంతంత మాత్రంగానే వస్తోంది. దీంతో నిర్వహకులు ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడిది చివరి దశకు చేరడంతో మరింత రంజుగా మార్చే టాస్కులు ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్‌కు ఆదరణ క్రమంగా పెరుగుతోంది. దీంతో రేటింగ్ కూడా కొంచెం కొంచెంగా పుంజుకుంటూనే ఉంటోంది.

ఏకంగా 12 మంది ఎలిమినేట్
ఇప్పుడు నడుస్తోన్న ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు అడుగు పెట్టారు. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికి పదకొండు వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనాలు బయటకు వెళ్లారు.

ఇద్దరు తప్ప అంతా నామినేట్
ఆరో సీజన్‌లోని పన్నెండో వారం నామినేషన్స్ టాస్కు కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్‌గా నిర్వహించారు. ఇక, ఈ వారానికి జరిగిన టాస్క్‌లో ఇనాయా సుల్తానా, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీహాన్ చోటూ, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నారు. ఇక, ఈ వారం కెప్టెన్ అవడం వల్ల రేవంత్ సేఫ్ అవగా.. ఓట్లు పడని కారణంగా కీర్తి భట్ కూడా నామినేషన్స్‌లో లేదు.

ఈ వారం ఓటింగ్‌లో ట్విస్టులు
బిగ్ బాస్ ఆరో సీజన్ చివరి దశకు చేరడంతో ఎలిమినేషన్స్‌పై అందరూ ఫోకస్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కరూ తమ అభిమాన కంటెస్టెంట్‌ను సేఫ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. దీంతో పన్నెండో వారం ఓటింగ్‌లో ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి. ఫలితంగా కంటెస్టెంట్ల పోలింగ్ స్థానాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

నెంబర్ వన్ ప్లేస్‌లో ఇనాయా
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా అత్యధిక ఓట్లతో టాప్ ప్లేస్‌లో ఉంటున్నాడు. కానీ, పన్నెండో వారంలో అతడు కెప్టెన్ కావడంతో నామినేషన్ తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇనాయా సుల్తానాకు ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయి. ఫలితంగా ఈ వారంలో ఆమెనే టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇనాయాకే 25 శాతం పైగా ఓట్లు వస్తున్నాయి.

మిగిలిన స్థానాల్లో ఎవరంటే!
ఆరో సీజన్ పన్నెండో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి ఇనాయా సుల్తానా మొదటి స్థానంలోనే ఉంది. దీంతో రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో ఆది రెడ్డి, నాలుగో స్థానంలో శ్రీ సత్య, ఐదో స్థానంలో రోహిత్ ఉన్నారని తెలిసింది. ఇదే కంటిన్యూ అయితే వీళ్లంతా సేఫ్ అవుతారు. ఇక, ఫ్యామిలీ ఎపిసోడ్‌తో పాటు రేవంత్ ఫ్యాన్స్ ఓటింగ్ వల్ల శ్రీ సత్య సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది.

ప్రమాదంలో ఇద్దరు మంచోళ్లు
బిగ్ బాస్ ఆరో సీజన్ పన్నెండో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ప్రస్తుతం రాజశేఖర్ ఆరో స్థానంలో, ఏడో స్థానంలో ఫైమా ఉన్నట్లు సమాచారం. అంటే ఈ వారానికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో పడిపోయారు. ఫైమా దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఉంది కాబట్టి ఈ వారం రోహిత్ కూడా డేంజర్ జోన్‌లోనే ఉన్నాడు. అంటే మంచోళ్లుగా పేరొందిన రాజ్, రోహిత్‌కే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది.


Click it and Unblock the Notifications











