Bigg Boss Elimination: తొలిసారి అలాంటి ఎలిమినేషన్.. డబుల్ అయితే ఆ ఇద్దరు.. సింగిల్ అయితే ట్విస్ట్!

ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. అనూహ్యంగా అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకుని నెంబర్ వన్ షోగా ఎదిగిపోయింది బిగ్ బాస్. కొత్త కాన్సెప్టుతో ప్రసారం అయ్యేదే అయినా దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందించారు. ఫలితంగా ఇది భారీ స్థాయిలో టీఆర్పీ రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో 12వ వారానికి సంబంధించి షాకింగ్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలిసింది. ఆ సంగతులు మీకోసం!

చివరి వారాల్లో పెరుగుతోందిగా

చివరి వారాల్లో పెరుగుతోందిగా

బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు ప్రసారం అయినా ఊహించని రీతిలో స్పందన దక్కుతోంది. కానీ, ఆరో సీజన్‌కు మాత్రం ఆరంభం నుంచి ఆదరణ అంతంత మాత్రంగానే వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడిది చివరి దశలో ఉండడంతో రంజుగా మారింది. ఫలితంగా కొత్త ట్విస్టులతో మజాను పంచుతోంది. దీంతో ఈ సీజన్‌కు రేటింగ్ కూడా క్రమంగా పెరుగుతూనే ఉంది.

ఈ వారం వాళ్లంతా నామినేట్

ఈ వారం వాళ్లంతా నామినేట్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని పన్నెండో వారం నామినేషన్స్ టాస్కు కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్‌గా నిర్వహించారు. ఇక, ఈ వారానికి జరిగిన టాస్క్‌లో ఇనాయా సుల్తానా, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీహాన్ చోటూ, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నారు. ఇక, ఈ వారం కెప్టెన్ అవడం వల్ల రేవంత్ సేఫ్ అవగా.. నామినేట్ చేయని కారణంగా కీర్తి భట్ కూడా తప్పించుకుంది.

ట్విస్టులతో ముగిసిన ఓటింగ్

ట్విస్టులతో ముగిసిన ఓటింగ్

ఆరో సీజన్ చివరి దశకు చేరడంతో ఇప్పటి నుంచి అన్ని ఎలిమినేషన్స్‌ ఎంతో ఆసక్తికరంగా మారబోతున్నాయి. దీంతో తమకు నచ్చిన కంటెస్టెంట్లను కాపాడుకోవడం కోసం ప్రేక్షకులు పోటీపోటీగా ఓట్లు వేస్తున్నారు. ఫలితంగా పన్నెండో వారం ఓటింగ్‌లో ఎన్నో ట్విస్టులు కనిపించాయి. దీంతో కంటెస్టెంట్ల పోలింగ్ స్థానాల్లో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆ ఒక్కరికే 25 శాతం పోలింగ్

ఆ ఒక్కరికే 25 శాతం పోలింగ్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. కానీ, అతడి ప్రవర్తనతో విమర్శలను ఎదుర్కోంటోన్నాడు. అదే సమయంలో చక్కని ఆటతీరుతో ఇనాయా సుల్తానా బాగా మెప్పిస్తోంది. దీంతో ఆమె ఎంతో పోటీ ఇస్తోంది. ఇక, ఈ వారంలో రేవంత్ లేకపోవడంతో ఇనాయాకు దాదాపు 25 శాతం ఓట్లు పోలయ్యాయని తెలుస్తోంది. దీంతో ఆమె టాప్ ప్లేస్‌లో ఉందట.

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు?

ఆరో సీజన్ పన్నెండో వారానికి జరిగిన ఓటింగ్‌లో ఇనాయా సుల్తానా మొదటి స్థానంలోనే ఉందని తెలిసింది. ఆమె తర్వాత అంటే రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో ఆది రెడ్డి, నాలుగో స్థానంలో శ్రీ సత్య, ఐదో స్థానంలో రోహిత్ ఉన్నారని తెలిసింది. అయితే, మిస్స్‌డ్ కాల్స్ ద్వారా మాత్రం రోహిత్ నాలుగో స్థానంలో, శ్రీ సత్య ఆరో స్థానంలో ఉన్నట్లు కూడా టాక్ వినిపిస్తోంది.

నలుగురూ డేంజర్ జోన్‌లోనే

నలుగురూ డేంజర్ జోన్‌లోనే

బిగ్ బాస్ ఆరో సీజన్ పన్నెండో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో ప్రస్తుతం రాజశేఖర్ ఆరో స్థానంలో, ఏడో స్థానంలో ఫైమా ఉన్నట్లు తెలిసింది. వీళ్లతో పాటు శ్రీ సత్య, రోహిత్ కూడా ఈ వారానికి డేంజర్ జోన్‌లోనే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం వీళ్ల ఓటింగ్‌లో తేడా చాలా తక్కువగా ఉండడమేనట. అంటే ఈ నలుగురిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.

డబులైతే ఇలా.. సింగిలైతే అలా

డబులైతే ఇలా.. సింగిలైతే అలా

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశం ఉంది. అలాగే, ఎలిమినేషన్ లేకుండా ఉండే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే శ్రీ సత్య, రాజ్, రోహిత్‌లలో ఒకరు వెళ్తారు. ఫైమా పాస్ వాడుకుంటే ఆమె ఉంటుంది. లేకపోతే వాళ్లతో పాటు వెళ్లిపోతుంది. అలాగే, సింగిల్ ఎలిమినేషన్ అయితే ఫైమా పాస్ వాడితే ఉంటుంది. లేకపోతే ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సీజన్‌లో తొలిసారి సెన్సేషనల్ వీక్ కాబోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X