Bigg Boss Elimination: తొలిరోజే షాకింగ్ ఓటింగ్.. టాప్‌లో ఊహించని ప్లేయర్.. ప్రమాదంలో ఆ లేడీస్
సరికొత్త కాన్సెప్టుతో ప్రసారం అవుతూ.. సంలచనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తోన్న ఏకైక షో బిగ్ బాస్. ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే దానికి మాత్రమే భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా దేశంలోనే ఎక్కడా రానంత టీఆర్పీ రేటింగ్ దక్కుతోంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుకుంటూ వస్తున్నారు. ఇలా ఇప్పుడు ఆరో దాన్ని ప్రసారం చేస్తున్నారు. ఇందులో పన్నెండో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతోంది? ఇందులో ఎవరు టాప్, లాస్ట్‌లో ఉన్నారు? అనే విషయాలు చూద్దాం పదండి!

చివరి దశలో మరింత రంజుగా
బిగ్ బాస్ షో తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకుని దూసుకుపోతోంది. ఫలితంగా వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరోది కూడా గతంలో కంటే కొత్త కాన్సెప్టుతో నడుస్తోంది. కానీ, దీనికి రేటింగ్ మాత్రం రావట్లేదు. కానీ, ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరడంతో మరిన్ని ప్రయోగాలతో రంజుగా మారి దూసుకుపోతోంది.

21 మందిలో వాళ్లు ఎలిమినేట్
తాజా సీజన్‌లోకి గతంలో ఎన్నడూ లేనట్లుగా 21 మంది సెలెబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికి పదకొండు వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనాలు ఎలిమినేట్ అయిపోయారు.

ఎలిమినేషన్స్ ఊహించనట్లు
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ జరిగిన ఎలిమినేషన్స్ అన్నీ ఎన్నో ట్విస్టులతో షాకింగ్‌గా నడిచాయని తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇందులో టాప్ ప్లేయర్లు అనుకున్న వాళ్లు చాలా మంది ఎలిమినేట్ అయిపోయారు. ఫలితంగా నామినేషన్స్ టాస్కులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పన్నెండో వారం ఓటింగ్ ఎలా జరుగుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఈ వారం ఏడుగురు నామినేట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని నామినేషన్స్ టాస్కుల్లో గొడవలు గతంలో కంటే మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ, గత సోమవారం జరిగిన పన్నెండో వారం నామినేషన్స్ టాస్కు కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్‌గా నిర్వహించారు. ఇక, ఈ వారానికి గానూ జరిగిన టాస్క్‌లో ఇనాయా సుల్తానా, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీహాన్ చోటూ, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేట్ అయ్యారు.

టాప్‌లో ఊహించని ప్లేయర్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పన్నెండో వారానికి సంబంధించిన ఓటింగ్ షాకింగ్‌గా జరుగుతున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చేసింది. మరీ ముఖ్యంగా ఈ వారం నామినేషన్స్‌లో టైటిల్ ఫేవరెట్ రేవంత్ లేకపోవడంతో అతడికి పోటీ ఇస్తూ వస్తున్న ఇనాయా సుల్తానా టాప్ ప్లేస్‌లో కొనసాగుతుందట. ఆమె ఒక్కరికే దాదాపు 25 శాతానికి పైగా ఓట్లు పోలవుతున్నట్లు తెలిసింది.

మిగిలిన స్థానాల్లో ఎవరంటే?
బిగ్ బాస్ ఆరో సీజన్ పన్నెండో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి ఇనాయా సుల్తానా టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది. దీంతో రెండో స్థానంలో ఆది రెడ్డి, మూడో స్థానాలో రోహిత్ సాహ్నీ, నాలుగో స్థానాలో శ్రీహాన్ చోటు, ఐదో స్థానంలో రాజశేఖర్‌లు ఉన్నారని తెలిసింది. అంటే.. ఈ వారం మొత్తం ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే దాదాపుగా వీళ్లంతా సేఫ్ అవుతారని అంటున్నారు.

డేంజర్ జోన్‌లో ఆ బ్యూటీస్
బిగ్ బాస్ ఆరో సీజన్ పన్నెండో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ఫైమా ఆరో స్థానంలో, శ్రీ సత్య ఏడో స్థానంలో ఉన్నట్లు సమాచారం. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో పడిపోయారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఫైమా దగ్గర 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' ఉండడం వల్ల ఆమె సేఫ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.


Click it and Unblock the Notifications











