Bigg Boss Elimination: తొలిరోజే ఓటింగ్‌లో సెన్సేషన్.. ఇనాయాకు షాక్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు!

ఎన్నో అనుమానాల నడుమ ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా ఆరేళ్లుగా తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ మధ్యలో ఎన్నో షోలు మొదలైనా.. దీన్ని మాత్రం అస్సలు టచ్ చేయలేకపోయాయి. అంతలా ఈ షో బుల్లితెరపై హవాను చూపిస్తూ దూసుకెళ్తోంది. ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ ఆశించిన స్థాయిలో స్పందనను సొంతం చేసుకోలేకపోయినా.. ఫిలానే స్టేజ్‌కు రావడంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో 14వ వారానికి సంబంధించిన ఓటింగ్‌ ఎలా జరుగుతుందో ఓ లుక్కేద్దాం పదండి మరి!

 ఫినాలేకు ముందు సరికొత్తగా

ఫినాలేకు ముందు సరికొత్తగా

ఎన్నో అంచనాలతో వచ్చినా.. సరికొత్త కంటెంట్‌ను చూపిస్తోన్నా.. బిగ్ బాస్ ఆరో సీజన్‌కు ఆరంభంలో పెద్దగా స్పందన దక్కలేదు. దీంతో నిర్వహకులు పంథాను మార్చి మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడిది చివరి దశకు చేరడంతో మరింత రసవత్తరంగా సాగేలా టాస్కులు ఇస్తున్నారు. ఫలితంగా దీనికి ఆదరణ పెరగడంతో పాటు రేటింగ్ పుంజుకుంటోంది.

14 మంది ఎలిమినేట్ అవగా

14 మంది ఎలిమినేట్ అవగా

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేసినా.. రెండు, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ పెట్టారు. ఇలా ఇప్పటికి 13 వారాలకు 14 మంది వెళ్లారు. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనా, రాజ్‌, ఫైమాలు ఎలిమినేట్ అయ్యారు.

ఈసారి అందరూ నామినేట్

ఈసారి అందరూ నామినేట్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని పద్నాలుగో వారం నామినేషన్స్ టాస్కులు ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా జరుగుతున్నాయి. అయితే, ఇది నామినేషన్స్‌కు చివరి వారం కావడంతో టికెట్ టు ఫినాలే టాస్కు గెలిచి ఫస్ట్ ఫైనలిస్టుగా నిలిచిన శ్రీహాన్‌ తప్ప హౌస్‌లో ఉన్న వాళ్లందరూ అంటే రేవంత్, ఆది రెడ్డి, కీర్తి భట్, ఇనాయా సుల్తానా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నారు.

తొలిరోజే ఓటింగ్‌లో మార్పు

తొలిరోజే ఓటింగ్‌లో మార్పు

గతంలో కంటే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో షాకింగ్ ఎలిమినేషన్స్ సాగుతున్నాయి. ఇక, ఇప్పుడిది చివరి దశకు చేరడంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన కంటెస్టెంట్‌కు ఓట్ చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో 14వ వారంలో తొలిరోజే ఓటింగ్ ఊహించని విధంగా సాగినట్లు తెలిసింది. దీంతో అప్పుడే కంటెస్టెంట్ల స్థానాల్లో మార్పులు కూడా కనిపించాయని సమాచారం.

రేవంత్ హవా.. ఆమెకు షాక్

రేవంత్ హవా.. ఆమెకు షాక్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో చాలా మంది బిగ్ సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా వచ్చారు. కానీ, అందులో సింగర్ రేవంత్ మాత్రం టైటిల్ ఫేవరెట్ అనిపించుకుంటున్నాడు. అందుకే పద్నాలుగో వారం కూడా రేవంత్‌కే ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నట్లు తాజాగా తెలిసింది. అతడి తర్వాత మాత్రం ఇనాయా సుల్తానా ఉంటుందని అనుకున్నా.. ఆమెకు ప్రేక్షకులు షాకిచ్చినట్లు తెలుస్తోంది.

మిగిలిన వాళ్ల స్థానాలు ఇవే

మిగిలిన వాళ్ల స్థానాలు ఇవే

బిగ్ బాస్ ఆరో సీజన్ పద్నాలుగో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి సింగర్ రేవంత్ మొదటి స్థానంలోనే ఉన్నాడు. అతడి తర్వాత వరుసగా రెండో స్థానంలో రోహిత్ సాహ్నీ, మూడో స్థానంలో ఆది రెడ్డి, నాలుగో స్థానంలో ఇనాయా సుల్తానాలు ఉన్నారని తెలిసింది. ఇది ఓటింగ్‌కు తొలి రోజే కాబట్టి.. ఈ స్థానాల్లో మార్పులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తోంది.

డేంజర్ జోన్‌లో ఆ లేడీస్?

డేంజర్ జోన్‌లో ఆ లేడీస్?

బిగ్ బాస్ ఆరో సీజన్ పద్నాలుగో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో ప్రస్తుతం కీర్తి భట్ ఐదో స్థానంలో, శ్రీ సత్య ఆరో స్థానంలో ఉన్నట్లు సమాచారం. అంటే ఈ వారానికి వీళ్లిద్దరూ డేంజర్‌ జోన్‌లో పడిపోయారు. ఇక, ఈ వారం టాస్కులను బట్టి వీళ్ల స్థానాలు మారొచ్చు.. లేకుంటే ఈ ఇద్దరిలో ఒకరు వెళ్లొచ్చు. శ్రీహాన్‌తో గొడవ పెట్టుకోవడం వల్ల అతడి ఫ్యాన్స్ సత్యకు ఓట్లు వేయట్లేదని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X