Bigg Boss Elimination: ఓటింగ్‌లో ట్విస్ట్.. అతడు సేఫ్ అవడంతో వాళ్లకు షాక్.. డేంజర్‌ జోన్‌లో ఎవరంటే!

అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టు.. ఊహించని మలుపులు.. ఓటింగ్‌లో ట్విస్టులు.. షాకింగ్ ఎలిమినేషన్లు.. ఇలా ఎన్నో రకాల పరిణామాలతో సరికొత్తగా సాగుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా తెలుగులో వచ్చే షో మాత్రమే సూపర్ సక్సెస్‌ అవుతోంది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఆరో సీజన్‌ను అత్యంత ప్రయోగాత్మకంగా నడుపుతున్నారు. కానీ, దీనికి మాత్రం రెస్పాన్స్ రావడం లేదు. ఈ నేపథ్యంలో ఎన్నో ట్విస్టులు ఇస్తూ వస్తున్నారు. ఇక, ఈ వారానికి సంబంధించిన ఓటింగ్ గురించి ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులు మీకోసం!

చివరి దశలో సరికొత్త ట్విస్టులే

చివరి దశలో సరికొత్త ట్విస్టులే

తెలుగులో బిగ్ బాస్ షో ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను ఇటీవలే మొదలు పెట్టారు. అయితే, ఇది కొత్త టాస్కులతో చిత్ర విచిత్రంగా సాగుతోంది. కానీ, దీనికి పెద్దగా రేటింగ్ రావట్లేదు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఇది చివరికి రావడంతో నిర్వహకులు అదిరిపోయే ట్విస్టులు ఇస్తూ రంజుగా మార్చుతున్నారు.

21 మందిలో... 11 మంది ఔట్

21 మందిలో... 11 మంది ఔట్

ఆరో సీజన్‌లోకి మొత్తం 21 మంది సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేశారు. కానీ, రెండో వారంలో డబుల్ నామినేషన్ పెట్టారు. ఆ తర్వాత ఒక్కొక్కరినే పంపించి.. మళ్లీ పదో వారంలో ఇద్దరిని సాగనంపారు. ఇలా ఇప్పటికే షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతిలు వెళ్లిపోయారు.

ఈ వారం 9 మంది నామినేట్

ఈ వారం 9 మంది నామినేట్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని నామినేషన్స్ టాస్కుల్లో గొడవలు గతంలో కంటే మరింత ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన పదకొండో వారం నామినేషన్స్ టాస్కు మాత్రం కాస్త కామ్‌గానే సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్‌లు నామినేట్ అయ్యారు.

ఇమ్యూనిటీ టాస్క్.. రాజ్ సేఫ్

ఇమ్యూనిటీ టాస్క్.. రాజ్ సేఫ్

పదకొండో వారానికి సంబంధించి నామినేట్ అయిన వాళ్లకు బిగ్ బాస్ ఓ టాస్కును ఇచ్చాడు. దీని ప్రకారం.. ఆ తొమ్మిది మంది లక్ష నుంచి ఐదు లక్షల వరకూ కోట్ చేయాల్సి ఉంటుంది. అందులో ఎవరైతే మిగిలిన వాళ్లు రాయని ఎక్కువ మొత్తం చెక్‌పై వేస్తారో వాళ్లకు ఇమ్యూనిటీ లభిస్తుంది. ఇందులో రాజ్ గెలిచి సేఫ్ అయ్యాడు. దీంతో నామినేషన్స్‌లో 8 మందే మిగిలారు.

అతడే టాప్‌లో.. ఆమె రెండు

అతడే టాప్‌లో.. ఆమె రెండు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదకొండో వారానికి సంబంధించిన ఓటింగ్ ఎంతో టఫ్‌గా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా టాప్ ప్లేస్‌ కోసం రేవంత్, ఇనాయా సుల్తానా మధ్య హోరాహోరీ పోరు నడుస్తున్నట్లు సమాచారం. కానీ, ఇప్పటి వరకూ ఇందులో రేవంత్‌కే ఎక్కువ ఓట్లు రావడంతో అతడు టాప్‌లో ఉన్నాడట. దీంతో ఇనాయా రెండో స్థానంలోనే ఉండిపోయిందని తెలిసింది.

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు

బిగ్ బాస్ ఆరో సీజన్ పదకొండో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి రేవంత్, ఇనాయా టాప్ 2 ప్లేసుల్లో ఉన్నారు. ఇక, శ్రీహాన్ మూడో స్థానంలో, కీర్తి భట్ నాలుగో స్థానంలో, రోహిత్ సాహ్నీ ఐదో స్థానంలో, ఆది రెడ్డి ఆరో స్థానంలో కొనసాగుతున్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. అంటే ఇదే ఓటింగ్ కంటిన్యూ అయితే ఈ వారం వీళ్లంతా సేఫ్ అవుతారని అంటున్నారు.

డేంజర్ జోన్‌లో ఎవరున్నారు?

డేంజర్ జోన్‌లో ఎవరున్నారు?

ఆరో సీజన్ పదకొండో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో మెరీనా అబ్రహం ఏడో స్థానంలో, శ్రీ సత్య ఎనిమిదో స్థానంలోనూ ఉన్నట్లు సమాచారం. అంటే ప్రస్తుతానికి వీళ్లిద్దరూ డేంజర్‌ జోన్‌లో పడిపోయారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ, ఓటింగ్‌కు చాలా సమయం ఉన్నందున ఈ స్థానాలు మారినా మారొచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X