Bigg Boss Elimination: ఓటింగ్‌లో ట్విస్ట్.. ఆమెకు కలిసొచ్చిన ఫ్యామిలీ ఎపిసోడ్.. వీళ్లలోనే ఒకరు ఔట్
తెలుగు బుల్లితెరపైకి సాదాసీదాగానే వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో చాలా తక్కువ సమయంలోనే సూపర్ డూపర్ హిట్‌గా నిలిచిన ఏకైక షో బిగ్ బాస్. అంతుచిక్కని టాస్కులు, అబ్బురపరిచే పరిణామాలతో సాగుతూ ఇప్పటికే ఎన్నో సీజన్లను కూడా ఇది పూర్తి చేసుకుంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ కూడా ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఇందులో ఎలిమినేషన్స్ షాకింగ్‌గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో 12వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఎలా జరుగుతుంది? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? అనేవి చూద్దాం పదండి!

ఆఖర్లో మరింత ఆసక్తికరంగానే
గతంలో వచ్చిన సీజన్లు అన్నీ అత్యధిక రేటింగ్‌ను రాబట్టి భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నాయి. దీంతో ఆరో సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లుగానే ఇందులో కొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. కానీ, దీనికి రేటింగ్ మాత్రం దక్కట్లేదు. దీంతో ఇప్పుడు ఈ సీజన్ చివరి దశకు చేరడంతో మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఫలితంగా రేటింగ్ పెరుగుతోంది.

ఈ సీజన్ నుంచి వాళ్లు అవుట్
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోకి ఏకంగా 21 మంది సెలెబ్రిటీలు అడుగు పెట్టారు. అయితే, మొదటి వారం ఎలిమినేషన్ తీసేసి.. రెండో వారంలో, పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ చేశారు. ఇలా ఇప్పటికి పదకొండు వారాలు కంప్లీట్ అయిపోయాయి. ఇందులో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతి, మెరీనాలు ఎలిమినేట్ అయ్యారు.

ఎలిమినేషన్స్ ఊహించనట్లు
తాజాగా ప్రసారం అవుతోన్న ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ పన్నెండు ఎలిమినేషన్స్ జరిగాయి. ఇందులో మూడు, నాలుగు మినహా మిగిలినవి అన్నీ ఎన్నో ట్విస్టులతో షాకింగ్‌గా నడిచాయి. ఫలితంగా ఈ సీజన్ నుంచి చాలా మంది టాప్ ప్లేయర్లు ఎలిమినేట్ అయిపోయారు. దీంతో ఇందులో ఎప్పుడేం జరుగుతుందే ఊహించడం కష్టం మారింది. ఇది షోకు ప్లస్ అవుతూనే ఉంది.

ఈ వారంలో 7గురు నామినేట్
తాజా సీజన్‌లోని నామినేషన్స్ టాస్కుల్లో గొడవలు గతంలో కంటే మరింత ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కానీ, గత సోమవారం జరిగిన పన్నెండో వారం నామినేషన్స్ టాస్కు కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్‌గా నిర్వహించారు. ఇక, ఈ వారానికి జరిగిన టాస్క్‌లో ఇనాయా సుల్తానా, రాజశేఖర్, ఆది రెడ్డి, శ్రీహాన్ చోటూ, జబర్ధస్త్ ఫైమా, రోహిత్ సాహ్నీ, శ్రీ సత్యలు నామినేషన్‌లో ఉన్నారు.

రేవంత్ లేకపోవడంతో ఆమెకే
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ టైటిల్ ఫేవరెట్‌గా ఉన్నాడు. దీంతో అతడు ఎప్పుడు నామినేషన్స్‌లో ఉన్నా అత్యధిక ఓట్లతో టాప్ ప్లేస్‌లో ఉంటున్నాడు. కానీ, పన్నెండో వారంలో అతడు కెప్టెన్ కావడంతో నామినేషన్ తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇనాయా సుల్తానాకు ఎక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయి. ఫలితంగా ఈ వారంలో ఆమెనే టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది.

ఏ స్థానంలో ఎవరు ఉన్నారు?
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ పన్నెండో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి ఇనాయా సుల్తానా మొదటి స్థానంలోనే ఉంది. దీంతో రెండో స్థానంలో శ్రీహాన్, మూడో స్థానంలో ఆది రెడ్డి, నాలుగో స్థానంలో రోహిత్ సాహ్నీ, ఐదో స్థానంలో శ్రీ సత్య ఉన్నారని తెలిసింది. ఫ్యామిలీ ఎపిసోడ్‌లో భాగంగా శ్రీ సత్య ఎమోషనల్ అవడంతో ఆమెకు ఓటింగ్ పెరిగినట్లు తెలుస్తోంది.

ఆమెకు ప్లస్... వాళ్లిద్దరూ డౌన్
బిగ్ బాస్ ఆరో సీజన్ పన్నెండో వారానికి సంబంధించిన ఓటింగ్‌లో ప్రస్తుతం రాజశేఖర్ ఆరో స్థానంలో, ఫైమా ఏడో స్థానంలో ఉన్నట్లు సమాచారం. అంటే ఈ వారానికి వీళ్లిద్దరూ డేంజర్ జోన్‌లో పడిపోయారు. ఇదే కంటిన్యూ అయితే మాత్రం ఈ ఇద్దరిలోనే ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే, ఫైమా దగ్గర 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' ఉండడం వల్ల ఆమె సేఫ్ అవొచ్చు కూడా.


Click it and Unblock the Notifications











