Bigg Boss Elimination: ఒక్క దెబ్బకు మారిన ఓటింగ్‌.. చివరికి పడిపోయిన బ్యూటీ.. ఎలిమినేషన్ మాత్రం!

ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు ఆరేళ్లుగా తెలుగు బుల్లితెరపై హవాను చూపిస్తూ నెంబర్ వన్ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. గతంలో ఎన్నడూ చూడని టాస్కులు ఇచ్చి.. ప్రేక్షకుల మద్దతును దక్కించుకున్న వాళ్లను విజేతగా ప్రకటించడమే ఈ షో నేపథ్యం. కొత్త కాన్సెప్టే అయినా ఇది తెలుగులో రికార్డు స్థాయి రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ సత్తా చాటుతోంది. ఇక, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో 11వ వారానికి సంబంధించిన ఓటింగ్ ఎలా జరుగుతుంది? డేంజర్ జోన్‌లో ఎవరున్నారు? చూద్దామా!

కొత్త కంటెంట్‌తో రసవత్తరంగా

కొత్త కంటెంట్‌తో రసవత్తరంగా

ఇండియాలోని చాలా భాషల్లో బిగ్ బాస్ షో ప్రసారం అవుతోంది. కానీ, తెలుగులో మాత్రమే దీనికి అత్యధిక రేటింగ్ వస్తోంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేస్తున్నారు. కానీ, ఆరో సీజన్‌కు మాత్రం షాకింగ్‌గా తక్కువ స్పందన దక్కుతోంది. దీంతో బిగ్ బాస్ టీమ్ కొత్త రకాల టాస్కులతో కంటెంట్‌ను మార్చేసింది. దీంతో రసవత్తరంగా సాగుతోంది.

10 వారాలు.. పదకొండు మంది

10 వారాలు.. పదకొండు మంది

గతంలో ఎన్నడూ లేని విధంగా బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో పది వారాల్లో ఒకసారి ఎలిమినేషన్ తీసేసి.. రెండుసార్లు ఇద్దరేసి కంటెస్టెంట్లను పంపించారు. దీంతో 10 వారాలకు గానూ షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూ, బాలాదిత్య, వాసంతిలు షో నుంచి ఎలిమినేట్ అయిపోయారు.

9 మందిలో ఒకరికి ఇమ్యూనిటీ

9 మందిలో ఒకరికి ఇమ్యూనిటీ


గతంలో మాదిరిగానే బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని నామినేషన్స్ టాస్కుల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి. కానీ, గత సోమవారం జరిగిన పదకొండో వారం నామినేషన్స్ టాస్కు మాత్రం కాస్త కామ్‌గానే సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రేవంత్, మెరీనా, రోహిత్, శ్రీ సత్య, రాజ్‌లు నామినేట్ అయ్యారు. కానీ, ఇమ్యూనిటీ టాస్కు ద్వారా రాజ్ సేఫ్ అయ్యాడు.

ఆటను బట్టే ఓటింగ్ నమోదు

ఆటను బట్టే ఓటింగ్ నమోదు

పదకొండో వారంలోని మొదటి రెండు రోజులు 9 మంది కంటెస్టెంట్లకు ఓటింగ్ పడింది. కానీ, రాజ్ సేఫ్ అవడంతో పోలింగ్‌లో మార్పులు కనిపించాయి. అదే కంటిన్యూ అవుతూ ఆటను బట్టి ఆయా కంటెస్టెంట్లకు ఓట్లు వేస్తున్నారు. దీంతో ఈ వారంలో కొన్ని స్థానాల్లో పూర్తిగా మార్పులు కనిపిస్తున్నాయి. దీంతో ఈ సారి ఎవరు సేఫ్ అవుతారో చెప్పడం చాలా కష్టంగా మారిపోయింది.

టాప్ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ

టాప్ ప్లేస్ కోసం ఇద్దరు పోటీ

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదకొండో వారానికి సంబంధించిన ఓటింగ్ రసవత్తరంగా సాగుతోంది. ఫలితంగా టాప్ ప్లేస్‌ కోసం రేవంత్, ఇనాయా సుల్తానా మధ్య బిగ్ ఫైట్ నడుస్తున్నట్లు తెలిసింది. కానీ, ఇప్పటి వరకూ ఇందులో రేవంత్‌కే ఎక్కువ ఓట్లు రావడంతో అతడు టాప్‌లో ఉన్నాడట. దీంతో ఇనాయా రెండో స్థానంలోనే కొనసాగుతోందట. అయితే, వీళ్ల మధ్య ఎంతో తేడా లేదని టాక్.

ఏ స్థానంలో ఎవరు ఉన్నారు

ఏ స్థానంలో ఎవరు ఉన్నారు


ఆరో సీజన్ పదకొండో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి రేవంత్, ఇనాయా మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక, శ్రీహాన్ మూడో స్థానంలో, కీర్తి భట్ నాలుగో స్థానంలో, ఆది రెడ్డి ఐదో స్థానంలో, రోహిత్ సాహ్నీ ఆరో స్థానంలో ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది. ఈ ఓటింగ్ పొజిషన్లలో ఎలాంటి తేడాలు లేకపోతే వీళ్లంతా ఈ వారం సేఫ్ అవుతారని సమాచారం.

ఎలిమినేట్ అయ్యేది ఆమేనా

ఎలిమినేట్ అయ్యేది ఆమేనా


తాజా సీజన్ పదకొండో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో మెరీనా అబ్రహం ఏడో స్థానంలో ఉండగా, శ్రీ సత్య ఎనిమిదో స్థానానికి పడిపోయినట్లు తెలిసింది. అంటే వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే, మెరీనా కంటే శ్రీ సత్య కంటెంట్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి.. ఆమెను సేవ్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X