Bigg Boss: డబుల్ ఎలిమినేషన్ వెనుక కుట్ర.. ఒకరి బదులు మరొకరు ఎలిమినేట్.. లీకైన సెన్సేషనల్ న్యూస్

విచిత్రమైన టాస్కులు.. లవ్ ట్రాకులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్టాటలు.. రొమాన్స్.. డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇలా ఎన్నో రకాల రియాలిటీ సీన్స్‌తో సాగుతోన్న షోనే బిగ్ బాస్. గతంలో ఎప్పుడూ చూడని కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో రెస్పాన్స్ అందించారు. ఫలితంగా ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఆరో సీజన్‌ను ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇందులో భాగంగానే పదో వారంలో ఏకంగా డబుల్ ఎలిమినేషన్‌తో షాకిచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా దీని వెనుక కుట్ర ఒకటి లీకైంది. ఆ సంగతులు మీకోసం!

క్రమంగా పుంజుకుంటోందిగా

క్రమంగా పుంజుకుంటోందిగా

తెలుగులో వస్తున్న బిగ్ బాస్ షోకు ఆరంభం నుంచే ఆదరణ భారీ స్థాయిలో సొంతం అవుతుంది. దీంతో నిర్వహకులు ఎన్నో అంచనాలతో ఆరో సీజన్‌ను తీసుకు వచ్చారు. కానీ, దీనికి ఆరంభంలోనే అత్యల్ప స్పందన దక్కింది. దీంతో క్రమంగా సరికొత్త ప్రయోగాలతో సాగే టాస్కులు ఇస్తూ షోను రంజుగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా రేటింగ్‌ పుంజుకుంటోంది.

తొమ్మిది మంది ఎలిమినేట్

తొమ్మిది మంది ఎలిమినేట్

తాజా సీజన్‌లోకి అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో ఇప్పటి వరకూ తొమ్మిది మంది కంటెస్టెంట్లు బయటకు వెళ్లిపోయారు.

పదో వారం డబుల్ ట్రబుల్

పదో వారం డబుల్ ట్రబుల్

బిగ్ బాస్ షోలో అసలు ఎప్పుడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు. మరీ ముఖ్యంగా ఆరో సీజన్‌లో అయితే ఎలిమినేషన్స్ అన్నీ షాకింగ్‌గా జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే పదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్‌లో షో నిర్వహకులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఈ వారం ఒకరిని కాకుండా ఏకంగా ఇద్దరిని ఎలిమినేట్ చేసేలా ప్లాన్ చేశారు. దీంతో అంతా షాక్ అయ్యారు.

శనివారమే బాలాదిత్య ఔట్

శనివారమే బాలాదిత్య ఔట్


బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదో వారానికి సంబంధించి మొత్తం తొమ్మిది మంది నామినేషన్‌లో ఉన్నారు. ఇక, ఈ వారానికి గానూ నిర్వహకులు డబుల్ ఎలిమినేషన్‌ ప్లాన్ చేయగా.. ఇందులో శనివారం జరిగిన ఎపిసోడ్‌లోనే సాఫ్ట్ కంటెస్టెంట్‌గా పేరొందిన బాలాదిత్యను బయటకు పంపించేశారు. హౌస్‌లోకి ఎలా వెళ్లాడో అదే మంచి పేరుతో అతడు షో నుంచి తిరిగి వచ్చాడు.

ఆదివారం వాసంతి అంటూ

ఆదివారం వాసంతి అంటూ

బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని పదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఇందులో భాగంగానే శనివారం ఎపిసోడ్‌లో బాలాదిత్యను ఎలిమినేట్ చేయగా.. ఆదివారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌లో మాత్రం వాసంతి కృష్ణన్‌ను బయటకు పంపించబోతున్నారని ఓ న్యూస్ నిన్న రాత్రే లీకైంది. దీంతో ఆమె అభిమానులు ఆందోళనలో ఉండిపోయారు.

డబుల్ ఎలిమినేషన్‌ కుట్ర

డబుల్ ఎలిమినేషన్‌ కుట్ర

ఈ వారంలో డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేశారని వార్తలు వెలువడిన సమయంలోనే.. ఎవరు బయటకు వస్తారన్నది కూడా లీకైంది. అయితే, బాలాదిత్యతో పాటు మెరీనా అబ్రహం ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగింది. కానీ, చివరి నిమిషంలో ఆమె స్థానంలో వాసంతిని ఎలిమినేట్ చేశారని తెలిసింది. దీని వెనుక భారీ కుట్ర ఉన్నట్లు తాజాగా ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.

లీకుల నుంచి తప్పించేలా

లీకుల నుంచి తప్పించేలా

సాధారణంగా బిగ్ బాస్ హౌస్‌లో ఏదైనా సీక్రెట్‌గానే జరుగుతుంది. కానీ, ఆరో సీజన్‌లో మాత్రం అన్నీ ముందే లీక్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకులు ఈ లీక్‌లను నమ్మకుండా ఉండేందుకు చివరి నిమిషం స్క్రిప్టును మార్చి మెరీనా స్థానంలో వాసంతిని ఎలిమినేట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే స్వార్థం కోసమే బిగ్ బాస్ టీమ్ ఈ పని చేసిందని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X