Bigg Boss Elimination: ఓటింగ్‌లో రేవంత్‌కు షాక్.. ఈ సీజన్‌లో తొలిసారి.. డేంజర్ జోన్‌లో ఎవరంటే!
తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే భారీ స్థాయిలో ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన దీనికి ప్రేక్షకులు భారీ స్థాయిలో స్పందనను అందించారు. దీంతో ఇది సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు కొన్ని సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పదో వారానికి సంబంధించిన ఓటింగ్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

ఆరంభంలో తక్కువ.. ఇప్పుడు
చాలా భాషల కంటే తెలుగులో ప్రసారం అవుతోన్న బిగ్ బాస్ షోకు మాత్రమే ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ దక్కుతోంది. దీంతో ఆరో సీజన్ కూడా అలాగే సక్సెస్ అవుతుందని అంతా అనుకున్నారు. అందుకు అనుగుణంగానే సరికొత్త హంగులతో నడుపుతున్నా రేటింగ్ అంతగా రావట్లేదు. అయితే, క్రమంగా దీనికి స్పందన పెరగడంతో రేటింగ్ కూడా మంచిగా వస్తోంది.

21 మందిలో.. వాళ్లు బయటకు
ఆరో సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్, సూర్య, గీతూలు వెళ్లారు.

పదో నామినేషన్స్‌లో 9 మంది
బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని నామినేషన్స్ టాస్కుల్లో ఎన్నో రకాల గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన పదో వారం నామినేషన్స్ టాస్కు కూడా రచ్చ రచ్చగానే సాగింది. ఇక, ఇందులో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్‌లు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చేశారు.

స్ట్రాంగ్ ప్లేయర్లు వెళ్లిపోవడంతో
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఇప్పటి వరకూ తొమ్మిది ఎలిమినేషన్స్ జరిగాయి. ఇందులో స్ట్రాంగ్ ప్లేయర్లు అనుకున్న వాళ్లే చాలా మంది ఉన్నారు. ఇలా గతంలో ఏ సీజన్‌లోనూ టాప్ ప్లేయర్లు బయటకు వెళ్లిపోలేదు. దీంతో పదో వారం ఎలిమినేషన్ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సారి పోలింగ్‌లో ఎన్నో ట్విస్టులు కనిపిస్తున్నాయి.

తొలిసారి రేవంత్‌కు భారీ షాక్
ఆరో సీజన్‌లోని పదో వారానికి సంబంధించిన ఓటింగ్ సోమవారం రాత్రి నుంచే ఎన్నో మార్పులతో నడుస్తోంది. కానీ, మొదటి స్థానంలో మాత్రం టైటిల్ ఫేవరెట్ రేవంత్ అత్యధిక ఓటింగ్‌తో టాప్ ప్లేస్‌లో ఉన్నాడని తెలిసింది. అయితే, ఒక దశలో ఇనాయా సుల్తానా టాప్ ప్లేస్‌కు చేరుకుని అతడికి షాకిచ్చింది. కానీ, తర్వాత రేవంత్ మొదటికి రాగా.. ఆమె రెండో స్థానంలో కొనసాగుతోంది.

మిగిలిన స్థానాల్లో ఎవరున్నారు
బిగ్ బాస్ ఆరో సీజన్ పదో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో తాజా సమాచారం ప్రకారం.. ఇనాయా సుల్తానా రెండో స్థానానికి వెళ్లడంతో మరో ఫేవరెట్ శ్రీహాన్ మూడో స్థానానికి పడిపోయాడు. అలాగే, ఆది రెడ్డి నాలుగో స్థానంలో, జబర్ధస్త్ ఫైమా ఐదో స్థానంలో, మెరీనా అబ్రహం ఆరో స్థానంలో కొనసాగుతున్నట్లు తెలిసింది. ఏ మార్పులు లేకపోతే వీళ్లంతా దాదాపుగా సేఫ్ అయినట్లే అని టాక్.

డేంజర్ జోన్‌లో ఉన్నది ఎవరు?
ఆరో సీజన్ పదో వారానికి సంబంధించిన ఓటింగ్ ఊహించని విధంగా సాగుతుంది. ఇందులో కీర్తి భట్ ఏడో స్థానంలో ఉందని తెలిసింది. అలాగే, బాలాదిత్య తొమ్మిదో స్థానంలోనూ, వాసంతి కృష్ణన్ పదో స్థానంలోనూ ఉన్నట్లు సమాచారం. అంటే ఈ వారంలో చివర్లో ఉన్న ఈ ఇద్దరిలోనే ఒకరు బయటకు వెళ్లిపోయే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.


Click it and Unblock the Notifications











