Bigg Boss Elimination: రేవంత్‌, ఫైమాకు భారీ దెబ్బ.. ఎలిమినేషన్ ప్రమాదంలో ఆ నలుగురు!

తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అయ్యాయి. కానీ, అందులో చాలా తక్కువ షోలు మాత్రమే ఈ రంగాన్నే శాశించే విధంగా సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ రావడంతో దేశంలో ఏ షోకూ రాని రేటింగ్ వచ్చింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ ప్రసారం చేస్తున్నారు. ఇక, ఇందులో పదో వారానికి సంబంధించిన ఓటింగ్‌పై ఓ న్యూస్ లీకైంది. ఇంతకీ ఏం జరిగిందో మీరే చూసేయండి!

స్లోగా మొదలై.. ఆసక్తికరంగానే

స్లోగా మొదలై.. ఆసక్తికరంగానే

తెలుగు బుల్లితెర చరిత్రలోనే సంచలన రేటింగ్‌తో దూసుకుపోతోన్న బిగ్ బాస్.. ఇప్పటికే ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ కూడా చిత్ర విచిత్రంగా సాగుతోంది. దీనికి ఆరంభంలో పెద్దగా రేటింగ్ రాలేదు. కానీ, క్రమంగా ఇందులో అదిరిపోయే కంటెంట్ వస్తుండడంతో ఆదరణ పెరుగుతోంది. ఫలితంగా రేటింగ్ పెరుగుతోంది.

21 మందిలో... వాళ్లంతా ఔట్

21 మందిలో... వాళ్లంతా ఔట్

తాజా సీజన్‌లో కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, శ్రీ సత్య, అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీప, అర్జున్‌, సూర్య, గీతూలు వెళ్లిపోయారు.

ఈ వారం 9 మంది నామినేట్

ఈ వారం 9 మంది నామినేట్

గతంలో కంటే బిగ్ బాస్ ఆరో సీజన్‌లోని నామినేషన్స్ టాస్కుల్లో గొడవలు మరింత ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన పదో వారం నామినేషన్స్ టాస్కు కూడా ఎంతో ఆసక్తిగా సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, శ్రీహాన్, కీర్తి భట్, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, వాసంతి కృష్ణన్‌లు నామినేట్ అయ్యారు.

అలాంటి ఎలిమినేషన్స్‌ వల్ల

అలాంటి ఎలిమినేషన్స్‌ వల్ల

తాజాగా జరుగుతోన్న ఆరో సీజన్‌లో గతంలో ఎన్నడూ చూడని విధంగా ఎలిమినేషన్స్ అన్నీ షాకింగ్‌గా జరుగుతున్నాయి. ఫలితంగా ఇప్పటికే పలువురు స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయిపోయారు. మరీ ముఖ్యంగా 8, 9 వారాల్లో సూర్య, గీతూ వంటి వాళ్లు వెళ్లిపోయారు. దీంతో ఇప్పుడు పదో వారం ఎలిమినేషన్‌ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా వేచి చూస్తున్నారు.

రేవంత్‌కు, ఫైమాకు దెబ్బలు

రేవంత్‌కు, ఫైమాకు దెబ్బలు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో పదో వారానికి సంబంధించిన ఓటింగ్ ఎంతో వైవిధ్యంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లనే తొలిసారి ఇందులో పోలింగ్ సరళి విభిన్నంగా నడుస్తుందని తెలిసింది. దీనికి కారణం టైటిల్ ఫేవరెట్ అయిన రేవంత్‌ను ఇనాయా సుల్తానా బీట్ చేయడమేనట. అంతేకాదు, మరో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఫైమాకు కూడా తక్కువ ఓట్లు పడుతున్నాయని టాక్.

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు

ఎవరు ఏ స్థానంలో ఉన్నారు

బిగ్ బాస్ ఆరో సీజన్ పదో వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో ప్రస్తుతానికి ఇనాయా సుల్తానా టాప్ ప్లేస్‌లో ఉండగా.. రేవంత్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడని తెలిసింది. అయితే, వీళ్ల స్థానాల్లో మార్పులు వస్తున్నాయట. ఇక, శ్రీహాన్ మూడో స్థానంలో, ఆది రెడ్డి నాలుగో స్థానంలో, కీర్తి భట్ ఐదో స్థానంలో, జబర్ధస్త్ ఫైమా ఆరో స్థానంలో కొనసాగుతున్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసింది.

డేంజర్ జోన్‌లో ఆ నలుగురు

డేంజర్ జోన్‌లో ఆ నలుగురు

ఆరో సీజన్ పదో వారానికి సంబంధించిన ఓటింగ్‌‌లో బాలాదిత్య ఏడో స్థానంలో ఉన్నాడట. అలాగే, మెరీనా ఎనిమిదో స్థానంలోనూ, వాసంతి కృష్ణన్ తొమ్మిదో స్థానంలోనూ ఉన్నట్లు సమాచారం. అయితే, ఆరో స్థానంలో ఉన్న ఫైమాతో పాటు చివరి ముగ్గురి మధ్య చాలా తక్కువ తేడానే ఉందని అంటున్నారు. అంటే.. ఈ వారంలో ఈ నలుగురిలో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X