Bigg Boss Elimination: మళ్లీ ఊహించని ఎలిమినేషన్‌.. వాళ్లిద్దరి ఏవీలు రెడీ.. ఇంతకీ ఎలిమినేట్ ఎవరంటే!

ఎటువంటి పరిస్థితుల్లో ప్రసారం అయినా ప్రేక్షకుల ఆదరాభిమానాలను దక్కించుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతోంది బిగ్ బాస్. విచిత్రమైన టాస్కులు.. కంటెస్టెంట్ల మధ్య కొట్లాటలు.. కోల్డ్ వార్‌లు.. ప్రేమ వ్యవహారాలు.. రొమాంటిక్ సన్నివేశాలు వంటివి చూపిస్తూ నిర్వహకులు దీనిపై ఆసక్తిని మరింతగా పెంచుతున్నారు. దీంతో ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్ సరికొత్త కంటెంట్‌తో సాగుతోంది. ఇక, ఇందులో ఏడో వారం ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు అన్న దానిపై వచ్చిన సమాచారం మీకోసం!

ఆరో సీజన్‌కు ఆదరణ కరువు

ఆరో సీజన్‌కు ఆదరణ కరువు

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షోకు మించిన ఆదరణ మరే దానికి రావడం లేదన్నది తెలిసిందే. అందుకే ఇది వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను ఎంతో ప్రయోగాత్మకంగా నడిపిస్తున్నారు. కానీ, దీనికి ఆదరణ మాత్రం అందడం లేదు. ఫలితంగా దీనికి రేటింగ్ దారుణంగా పడిపోతూనే ఉంటోంది.

6వ సీజన్‌లో ఆరుగురు ఔట్

6వ సీజన్‌లో ఆరుగురు ఔట్

ఇప్పుడు జరుగుతున్న సీజన్‌లోకి అర్జున్ కల్యాణ్, గీతూ రాయల్, అభినయ శ్రీ, కీర్తి భట్, సుదీప పింకీ, శ్రీహాన్, నేహా చౌదరి, చలాకీ చంటి, రోహిత్ సాహ్నీ, మెరీనా అబ్రహం, బాలాదిత్య, వాసంతి కృష్ణన్, షానీ సాల్మన్, ఇనయా సుల్తానా, శ్రీ సత్య, ఆర్జే సూర్య, ఫైమా, ఆదిరెడ్డి, రాజశేఖర్, అరోహీ రావ్, రేవంత్‌‌లు వచ్చారు. వీరిలో షానీ, అభినయ, నేహా, ఆరోహి, చంటి, సుదీపలు వెళ్లిపోయారు.

ఈ వారంలో 13మందికి షాక్

ఈ వారంలో 13మందికి షాక్

సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కు ఎన్నో గొడవలతో సాగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఏడో వారం ప్రక్రియ కూడా చాలా వాగ్వాదాలతో రసవత్తరంగా సాగింది. ఇందులో మొత్తం 13 మంది అంటే ఇనాయా, బాలాదిత్య, ఆది రెడ్డి, అర్జున్ కల్యాణ్, కీర్తి భట్, శ్రీహాన్‌, శ్రీ సత్య, రేవంత్, ఫైమా, వాసంతి కృష్ణన్, మెరీనా అబ్రహం, రాజశేఖర్, రోహిత్‌లు నామినేట్ అయ్యారు.

ట్విస్ట్‌లతోనే సాగిన ఓటింగ్

ట్విస్ట్‌లతోనే సాగిన ఓటింగ్

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్‌లో ఏకంగా 13 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. దీంతో ఈ వారం ఆటతీరును బట్టి కాకుండా ఫేమ్‌ను బట్టి ఓటింగ్ జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఈ వారం ఓటింగ్ ఎన్నో మార్పులతో సాగింది. దీంతో ఒకరిద్దరి స్థానాలు తప్ప మిగిలిన వాళ్లవి మాత్రం క్రమంగా మారాయి.

తొలి రెండు స్థానాల్లో వాళ్లు

తొలి రెండు స్థానాల్లో వాళ్లు

బిగ్ బాస్ ఆరో సీజన్‌లో ఏడో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎన్నో ట్విస్టులతో రసవత్తరంగా సాగినట్లు తెలిసింది. ఇక, పోలింగ్ ముగిసే సమయానికి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన రేవంత్ ఎక్కువ ఓట్లు సాధించి టాప్‌ ప్లేస్‌లో నిలిచాడట. అలాగే, మరో స్ట్రాంగ్ ప్లేయర్ శ్రీహాన్ రెండో స్థానంలో ఉన్నాడని తెలిసింది. వీళ్లిద్దరికే దాదాపు 30 శాతం ఓట్లు పోల్ అయ్యాయని టాక్.

 వాళ్లంతా దాదాపుగా సేఫ్‌గా

వాళ్లంతా దాదాపుగా సేఫ్‌గా

చాలా మార్పులతో సాగిన ఏడో వారం ఓటింగ్‌లో చివరికి ఎవరు ఏ స్థానంలో నిలిచారో తెలిసింది. దీని ప్రకారం.. బాలాదిత్య మూడో స్థానంలో, నాలుగో స్థానంలో జబర్ధస్త్ ఫైమా, ఐదో స్థానంలో ఆది రెడ్డి, ఆరో స్థానంలో కీర్తి భట్, ఏడో స్థానంలో రోహిత్, ఎనిమిదో స్థానంలో అర్జున్ కల్యాణ్, తొమ్మిదో స్థానంలో రాజశేఖర్, పదో స్థానంలో మెరీనాలు ఉండి వీళ్లంతా సేఫ్ అయ్యారని తెలుస్తోంది.

 ఎలిమినేట్ అయ్యేది ఆమె!

ఎలిమినేట్ అయ్యేది ఆమె!

ఏడో వారానికి సంబంధించి జరుగుతోన్న ఓటింగ్‌లో శ్రీ సత్య 11వ స్థానంలో నిలిచిందని తెలిసింది. అయితే, ఇనాయా సుల్తానా, వాసంతి కృష్ణన్ 12, 13 స్థానాల్లో ఉన్నారని సమాచారం. దీంతో ఈ వారం వీళ్లిద్దరిలోనే ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయే అవకాశం ఉంది. అంతేకాదు, ఇప్పటికే ఇనాయా, వాసంతికి సంబంధించిన జర్నీ వీడియోలు కూడా రెడీ అయ్యాయని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X