Revanth Remuneration: రేవంత్‌కు షాకింగ్ రెమ్యూనరేషన్.. ప్రైజ్ మనీతో కలిపితే.. చేతికొచ్చింది మాత్రం!

తెలుగు బుల్లితెరపై గతంలో ఎన్నడూ రానంత రేటింగ్‌ను రాబడుతూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలేమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన ఇది.. టాప్ రేటింగ్‌తో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా ఇప్పుడు ఆరో సీజన్‌ను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఎంతో వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో బోలెడన్ని ట్విస్టులు కనిపించాయి. చివరికి ఇందులో రేవంత్ విజేతగా నిలిచాడు. ఈ నేపథ్యంలో అతడు ఈ షో ద్వారా సంపాదించిన మొత్తం గురించిన వివరాలపై ఓ లుక్కేద్దాం పదండి!

వైభవంగా జరిగిన ఫినాలే

వైభవంగా జరిగిన ఫినాలే

15 వారాల పాటు ప్రేక్షకులను అలరించిన ఆరో సీజన్ ఆదివారంతో ముగిసింది. తారల తళుకుబెళుకుల మధ్య ఎంతో అంగరంగ వైభవంగా సాగింది. ఇందులో గతంలో ఎన్నడూ చూడని గెస్టులు స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, మాజీ కంటెస్టెంట్లు డ్యాన్సులతో మెప్పించారు. నాగార్జున కూడా ఆకట్టుకున్నాడు. మొత్తంగా ఈ ఎపిసోడ్ ఓ రేంజ్‌లో రెస్పాన్స్ అందుకుంది.

వాళ్లిద్దరి మధ్య రంజుగా

వాళ్లిద్దరి మధ్య రంజుగా


బిగ్ బాస్ ఆరో సీజన్‌కు సంబంధించిన ఫినాలే ఎపిసోడ్‌ల మాదిరిగా కాకుండా మరింత ఉత్కంఠభరితంగా సాగింది. ముందుగా రోహిత్ ఎలిమినేట్ అయి ఐదో స్థానంతో ప్రయాణాన్ని ముగించాడు. అతడి తర్వాత ఆది రెడ్డి, కీర్తి భట్‌లు నాలుగు, మూడు స్థానాల్లో మిగిలారు. దీంతో రేవంత్, శ్రీహాన్ టాప్ 2గా నిలిచారు. వీళ్లలో విజేతను నిర్ణయించే ప్రక్రియ రంజుగా సాగింది.

చివర్లో ట్విస్ట్.. రేవంత్‌దే

చివర్లో ట్విస్ట్.. రేవంత్‌దే


తుది దశకు చేరిన రేవంత్, శ్రీహాన్‌లకు హోస్ట్ అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి గోల్డెన్ సూట్‌కేసుతో వెళ్లి ఆఫర్ ఇచ్చాడు. మొదట అమౌంట్‌కు వద్దన్నా రూ. 40 లక్షలకు శ్రీహాన్ ఓకే అనేశాడు. ఫలితంగా అతడు రన్నరప్‌తో సరిపెట్టుకోగా.. రేవంత్ ఈ సీజన్‌లో విజేతగా నిలిచాడు. ఓట్లలో మాత్రం శ్రీహాన్‌ టాప్‌లో నిలిచినట్లు చెప్పి నాగార్జున అందరికీ బిగ్ షాక్ ఇచ్చాడు.

రేవంత్‌ రెమ్యూనరేషన్

రేవంత్‌ రెమ్యూనరేషన్


దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులారిటీ ఉన్న రేవంత్‌ టైటిల్ ఫేవరెట్‌గానే బరిలోకి దిగాడు. అందుకు తగ్గట్లే అతడికి వారానికి 65 వేల రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చారని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అంటే అతడు హౌస్‌లో పదిహేను వారాల పాటు కొనసాగాడు. దీని ద్వారా మొత్తం రూ. 9.75 లక్షలు రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడు. ఇదే ఈ సీజన్ మొత్తంలో అత్యధిక మొత్తం అని టాక్.

ప్రైజ్‌మనీ తక్కువగానే

ప్రైజ్‌మనీ తక్కువగానే


రేవంత్ బిగ్ బాస్ ఆరో సీజన్ ఆరంభం నుంచే టైటిల్ ఫేవరెట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అందుకు తగ్గట్లుగానే ఆడి ఫినాలేకు చేరాడు. దీంతో రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ అతడికే దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ, శ్రీహాన్ ఫినాలే ఎపిసోడ్‌లో రూ. 40 లక్షల ప్రైజ్ మనీకి ఓకే చెప్పి రన్నర్ అయ్యాడు. దీంతో రేవంత్‌ విన్నర్ అయినా కేవలం రూ. 10 లక్షలు మాత్రమే లభించాయి.

మొత్తం కలిపి ఎంతంటే

మొత్తం కలిపి ఎంతంటే


ఎన్నో ట్విస్టులతో ఆరో సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రేవంత్‌కు తక్కువ ప్రైమ్ మనీనే వచ్చింది. విజేతగా నిలవడం ద్వారా రూ. 10 లక్షలు గెలిచిన అతడు.. రెమ్యూనరేషన్‌గా రూ. 9.75 లక్షలు అందుకున్నాడు. అలాగే, రూ. 30 లక్షలు విలువైన ఫ్లాట్, రూ. 13 లక్షలు విలువైన కారును సొంతం చేసుకున్నాడు. అంటే మొత్తంగా రూ. 62.75 లక్షలు ఖాతాలో వేసుకున్నాడని తెలిసింది.

అందులో కూడా కటింగ్

అందులో కూడా కటింగ్


ఇక, ఆదాయపు పన్ను లెక్కల ప్రకారం.. ఏదైనా షోలో 10 వేల కంటే ఎక్కువ ప్రైజ్ మనీ గెలిస్తే 31.2% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. రూ. 10 లక్షలు ప్రైజ్ మనీగా అందుకున్న రేవంత్.. రూ. 3.12 లక్షలు ట్యాక్స్ చెల్లించాలి. ఇంత మొత్తం పోతే అతడి చేతికి రూ. 6.88 లక్షలు మాత్రమే వచ్చినట్లు తెలిసింది. ఎలా చూసుకున్నా అతడు రూ. 50 లక్షలు పైనే సంపాదించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X