హాట్ టీవీ నటిపై దాడి చేసిన కోహ్లి అరెస్ట్ (వీడియో)
ముంబై: కలర్స్ ఛానల్‌లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్-7 టీవీ రియాల్టీ షో పోటీ దారుడైన అర్మాన్ కోహ్లీని పోలీసులు సోమవారం రాత్రి అరెస్టు చేసారు. ఇదే షోలో పాల్గొన్న మరొక నటి సోఫియా హత్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసారు. అర్మాన్ కోహ్లి తనపై దాడి చేసాడని, బూతులు తిట్టాడని సోఫియా హయత్ ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ముంబైలోని లోనావాలా సిటీ పోలీసులు బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి అక్కడి నుంచి అర్మాన్ కోహ్లీని తీసుకెళ్లారు. దాడి చేసినట్లు అతనిపై ఫిర్యాదు అందడం వల్లనే అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. డిసెంబర్ 11న బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన సోఫియా హయత్....బయటకు వచ్చిన వెంటనే ముంబైలోని శాంతా క్రజ్ పోలీసులకు అర్మాన్ కోహ్లిపై ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేసాడని, బూతులు తిట్టాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
సోఫియా హయత్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్‌స్పెక్టర్ అరుణ్ చవాన్ మీడియాకు వెల్లడించారు. అయితే బిగ్ బాస్ హౌస్ పుణె జిల్లాలోని లోనావాలా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో కేసును అక్కడికి బదిలీ చేసారు. ఈ మేరకు అక్కడి పోలీసులు అర్మాన్ కోహ్లిని అరెస్టు చేసారు.
కోహ్లిపై ఐపిసీ సెక్షన్ 324(మారణాయుధాలతో లేదా అలాంటి వస్తువులతో ద్వారా గాయపర్చడం), 504(శాంతి ఉల్లంఘనను రేకెత్తించి కావాలని అవమానించడం), 509(మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం), 506(బెదరింపు నేరం), 354(లైంగిక వేధింపులు) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 29 ఏళ్ల సోఫియా హయత్ ట్విట్టర్లో స్పందిస్తూ..'పోలసులు ప్రొఫెషనల్ గా వ్యవహరిచారు' అని ట్విట్ చేసింది.
ఫోటో పై క్లిక్ చేసి అరెస్టు దృశ్యాలను వీక్షించండి


Click it and Unblock the Notifications












