ఆ భయంతోనే సిరీయల్స్ మానేశా.. బిగ్ బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు ప్రియాంక జైన్ (Priyanka Jain). మౌనరాగం, జానకి కలగనలేదు వంటి హిట్ సీరియల్స్‌తో బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ఈ భామ, తక్కువ కాలంలోనే ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. సహజ నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ సాధించిన ప్రియాంక. బిగ్ బాస్ తెలుగు 7లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లడంతో ఆమె క్రేజ్ మరో స్థాయికి చేరింది. బిగ్ బాస్ తర్వాత సీరియల్స్‌కు దూరమైన ఈ అమ్మడు ఈవెంట్స్, టీవీ షోలు, ఓటీటీ ప్రాజెక్టులతో బిజీగా కొనసాగుతోంది.
ముంబైకి చెందిన ప్రియాంక జైన్ 2015లో తమిళ చిత్రం రంగి తరంగతో నటనలో అడుగుపెట్టింది. ఆ తర్వాత కన్నడలో గోలిసోడాలో నటించి, 2018లో చల్తే చల్తే, వినరా సోదర వీర కుమార వంటి తెలుగు చిత్రాల్లోనూ మెరిసింది. సినిమాల తర్వాత టీవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అవకాశాలతో 2017లో స్టార్ మా లో ప్రసారమైన మౌనరాగం సీరియల్‌లో నటించి బుల్లితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. సీరియల్స్‌తో పాటు యూ గాట్ మీ గర్ల్, సితార, సోచ్ వంటి వెబ్ సిరీస్‌లలోనూ ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ ప్రయాణమే ఆమెను బిగ్ బాస్ తెలుగు 7 హౌస్ వరకు తీసుకెళ్లింది.

ఇటీవల ప్రియాంక వ్యక్తిగత జీవితంపై కూడా చర్చలు జరుగుతున్నాయి. సీరియల్ నటుడు శివకుమార్‌తో ప్రేమలో ఉన్నారన్న వార్తలు కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇద్దరూ లివింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే ఈ విషయాలపై ప్రియాంక ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు.
ఇక తాజాగా ప్రియాంక జైన్ నటించిన 'నయనం' వెబ్ సిరీస్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సిరీస్‌లో వరుణ్ తేజ్, ప్రియాంక జైన్, ఉత్తేజ్ కీలక పాత్రలు పోషించారు. స్వాతి ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ఆరు ఎపిసోడ్లుగా ఈ నెల 19 నుంచి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా ప్రియాంక ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది.
ఇంటర్వ్యూలో ప్రియాంక మాట్లాడుతూ.. తన కెరీర్ మొదట మోడలింగ్‌తో ప్రారంభమైందని చెప్పింది. ఆ సమయంలో కొంతమంది తన హైట్ గురించి నెగెటివ్‌గా మాట్లాడినా, మరికొందరు తనను ప్రోత్సహించారని వెల్లడించింది. అదే సమయంలో యాక్టింగ్ వైపు రావాలని సూచించడంతో సినిమాల కోసం ప్రయత్నించానని, కొన్ని సినిమాల తర్వాత సీరియల్స్‌లో నటించడం ప్రారంభించానని తెలిపింది. సీరియల్స్ వల్లే తనకు అసలైన గుర్తింపు వచ్చిందని, ఆ గుర్తింపే బిగ్ బాస్‌కు వెళ్లే అవకాశాన్ని ఇచ్చిందని పేర్కొంది.
అయితే సీరియల్స్ మానేయడానికి కారణం ఏంటన్న ప్రశ్నకు ప్రియాంక ఇచ్చిన సమాధానం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'సీరియల్స్ చేస్తే ఒకే రోల్‌లో బందీ అయిపోతామనే భయం ఉంది. అలాగే సరైన డేట్స్, టైం దొరకదు. సీరియల్ క్యారెక్టర్లకే పరిమితమైపోతామన్న భావనతోనే సీరియల్స్‌కు దూరంగా ఉన్నాను' అని ఆమె స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ, సీరియల్స్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని, ఆ ప్రయాణాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.
సీరియల్స్, సినిమాల యాక్టింగ్ మధ్య తేడా ఉందా అన్న ప్రశ్నకు ప్రియాంక ఆసక్తికరంగా స్పందించింది. 'సీరియల్స్ అయినా సినిమాలైనా, ఒక నటిగా పాత్రకు ప్రాణం పోయడమే నా లక్ష్యం. యాక్టింగ్‌లో పెద్దగా తేడా ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సీరియల్స్ చేస్తున్నప్పుడూ నేను చాలా ప్రిపేర్ అయ్యే సెట్‌కి వెళ్లేదాన్ని. డైలాగ్స్ ముందుగానే తెలుసుకుని, ఒక్క టేక్‌లో షాట్ పూర్తి చేయాలని ప్రయత్నించేదాన్ని' అని వెల్లడించింది.
మొత్తానికి.. సీరియల్స్ వల్లే తనకు గుర్తింపు వచ్చినప్పటికీ, ఒకే రకమైన పాత్రల్లో చిక్కుకుపోతానన్న భయంతో రూట్ మార్చుకున్నానని ప్రియాంక జైన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నయనం వెబ్ సిరీస్‌తో కొత్తగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బిగ్ బాస్ బ్యూటీ, రాబోయే రోజుల్లో మరిన్ని విభిన్న పాత్రలతో అలరించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.


Click it and Unblock the Notifications











