Bigg Boss 7 Telugu 1 week Elimination నామినేషన్‌లో 8 మంది.. ఎలిమినేషన్ జాబితాలో ఉన్నది ఎవరంటే?
తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత రేటింగ్ ఉన్న బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ అట్టహాసంగా, ఇంతకు ముందెన్నడూ లేని విధంగా ట్విస్టులతో ఆరంభమైంది. హోస్ట్ నాగార్జున అనుక్షణం ఈ సీజన్ డిఫరెంట్‌గా ఉండబోతుంది. మీరు ఊహించుకొన్నట్టు అసలే ఉండదు. అంతా ఉల్టా పుల్టా అంటూ పదే పదే చెప్పారు. వినోదాత్మకంగా, ఎమోషనల్‌గా కంటెస్టెంట్లు బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టారు. అయితే తొలివారం నామినేషన్స్ రెండో రోజే జరిగాయి. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశం ఉన్న వారు ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలోకి వెళ్లిన వారు మొత్తం 14 మంది ఉన్నారు. వారిలో ప్రియాంక జైన్, యాక్టర్ శివాజీ, సింగర్ ధామిని, ప్రిన్స్ యావర్, శుభశ్రీ రాయగురు, షకీలా, ఆట సందీప్, కార్తీకదీపం మోనిత శోభా శెట్టి, యూట్యూబర్ టేస్టీ తేజ, కంటెస్టెంట్ రతిక, యువ హీరో డాక్టర్ గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్, జానకి కలగనలేదు ఫేమ్ అమర్ దీప్ ఉన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలోకి వెళ్లిన వారికి హోస్ట్ నాగార్జున ఝలక్ ఇచ్చారు. అయితే కంటెస్టెంట్లందరూ హౌస్‌మేట్స్ కాదని స్పష్టం చేశారు. గతంలో బిగ్‌బాస్ ఇళ్లంతా విలాసవంతంగా, అన్ని సౌకర్యాలతో కళకళలాడుతుండేది. కానీ ఈ సారి మాత్రం ఇంటి సభ్యులు తమకు కావాల్సిన బెడ్స్, చైర్లు, సోఫాలు ఇతర వస్తువలన్నింటినీ వారే గేమ్స్ ఆడి సమకూర్చుకోవాలి అని నాగార్జున రూల్స్ చెప్పారు.
అయితే ఇంటిలో ఉన్న 14 మంది ఉన్నప్పటికీ.. మీ స్థానం కన్ఫర్మ్ కాలేదు. ఆ కన్ఫర్మేషన్ పొందేందుకు మీరు ఎంత వరకు వెళ్తారనేది మీ ప్రతిభపై ఆధారపడి ఉంటుంది అని బిగ్‌బాస్ ఘాటుగా చెప్పాడు. దాంతో 35 లక్షలు ఇస్తానని చెప్పాడు. పట్టుకొని పోతే బాగుండేదని యాక్టర్ శివాజీ దీర్ఘాలు తీశాడు.
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లందరూ ఇంకా పూర్తిగా సెటిల్ కాకముందే.. అంతా సర్దుకోక ముందే తొలివారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ప్రతీసారి మాదిరిగానే నామినేషన్ ప్రక్రియ కొంత ఎమోషనల్‌గా, గందరగోళంగా సాగిందనేది సమాచారం.
తాజా సమాచారం ప్రకారం తొలివారం ఎలిమినేషన్ కోసం మొత్తం 8 మంది నామినేట్ అయ్యారనేది తాజా సమాచారం. నామినేషన్ జాబితాలో ఉన్న వారిలో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, రతిక, శోభా శెట్టి, సింగర్ దామిని, ప్రియాంక జైన్ ఉన్నట్టు సమాచారం. నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యావర్, కిరణ్ రాథోడ్‌కు తెలుగు భాష గురించి అసలే తెలియదు. వారిద్దరి కారణంగా అందరూ తెలుగులో తప్ప మిగితా భాషల్లో మాట్లాడుతుండటం ఇబ్బందికరంగా మారినట్టు కనిపించింది.


Click it and Unblock the Notifications











