Bigg Boss 7 Telugu నామినేషన్లలో 8 మంది కంటెస్టెంట్లు.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

బిగ్‌బాస్ 7 తెలుగు రియాలిటీ షోలో యుద్ద వాతావారణం మధ్య రెండోవారం నామినేషన్లు ముగిసాయి. 2వ వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య ఆవేశాలను రెచ్చగొట్టింది. దాంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొంటూ నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. ఈ వారం నామినేట్ అయిన వారెవరు? ఎవరికి ఎంత శాతం ఓట్లు వచ్చాయనే వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో రెండోవారమే గ్రూప్ గేమ్ మొదలైంది. సీరియల్ ఆర్టిస్టులు అందరూ ఓ గ్రూప్‌గా మారిపోయారు. అలా గ్రూప్‌గా మారిన అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి తదితరులు ఒక జట్టుగా మారి.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ను టార్గెట్ చేశారు.

Bigg Boss 7 Telugu 2nd Week Nominations and Voting details

ఇక గ్రూప్ గేమ్ ఆడుతున్న అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి‌తో యాక్టర్ శివాజీ మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కనిపిస్తున్నారు. అయితే శోభా శెట్టిని నామినేషన్ చేయడంతో ఆమె తట్టుకోలేకపోయింది. శివాజీకి శోభా శెట్టి గట్టిగా బదులిచ్చేందుకు ప్రయత్నించగా బలమైన పాయింట్ లేకపోవడంతో ఆమె తేలిపోయినట్టు కనిపించింది.

ఇలాంటి పరిస్థితుల మధ్య రెండోవారం బిగ్‌బాస్ నుంచి బయటకు వెళ్లడానికి జరిగిన నామినేషన్ల ప్రక్రియలో 8 మంది నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, శోభా శెట్టి, డాక్టర్ గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, షకీలా, శివాజీ తదితరులు ఉన్నారు.

అయితే బిగ్‌బాస్ షోలో 2వ వారం నామినేషన్లు పూర్తి కాగానే.. ఓటింగ్‌ను వెంటనే ప్రారంభించారు. తొలి రోజే భారీగా ఓటింగ్ నమోదు అయింది. ఈ ఓటింగ్ విషయానికి వస్తే.. పల్లవి ప్రశాంత్‌కు 50 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. దాంతో ప్రశాంత్ టాప్ రేంజ్‌లో ఓటింగ్ సాధిస్తున్నాడు. ఆ తర్వాత దారిదాపుల్లో కూడా మిగితా వారు లేకపోవడం గమనార్హం.

బిగ్‌బాస్ 7 తెలుగు రెండోవారం ఓటింగ్ ప్రకారం.. పల్లవి ప్రశాంత్ 50 శాతానికిపైగా, అమర్ దీప్‌కు 18 శాతం, శివాజీకి 17 శాతం, రతిక 9 శాతం, గౌతమ్ కృష్ణకు 4 శాతం, టేస్టీ తేజా 3 శాతం, షకీలాకు 3 శాతం ఓట్లు నమోదు అయ్యాయి. ఇంకా మూడు రోజులు ఇంకా సమయం ఉన్నందున ఓటింగ్ శాతంలో కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X