Bigg Boss Nominations: నామినేషన్స్‌లో బిగ్ ట్విస్ట్.. షో చరిత్రలోనే తొలిసారిగా.. 2వ వారంలో ఎవరంటే!

ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి పరిచయమై.. ఎవరూ ఊహించని విధంగా చాలా భారీ స్థాయిలో స్పందనను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కాన్సెప్టుతో నడిచే ఈ షోకు మన ప్రేక్షకులు పడిపోయారు. అందుకే ఇది ఇక్కడ సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా నిర్వహకులు సీజన్లను క్రమం తప్పకుండా పూర్తి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే ఏడో దాన్ని మొదలు పెట్టారు. ఇక, ఈ సీజన్ రెండో వారం నామినేషన్స్ లిస్ట్ తాజాగా బయటకు వచ్చేసింది. ఇందులో ఎవరున్నారో మీరే చూడండి మరి!

అంతా కొత్తగానే.. ఉల్టా పుల్టా:తెలుగులో బిగ్ బాస్ షో క్రమం తప్పుకుండా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని గతంలో ఎన్నడూ చూడని ఉల్టా పుల్టా అనే కంటెంట్‌తో తీసుకు వచ్చారు. ఫలితంగా ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా ప్రారంభం అయింది. అందుకు అనుగుణంగానే మొదటి వారంలో ఈ షో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయింది.

Bigg Boss 7 Telugu 2nd Week Nominations List Leaked

14 మంది.. ఆమె ఎలిమినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ప్రియాంక జైన్, హీరో శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం జరిగిన ఎలిమినేషన్‌లో కిరణ్ రాథోడ్ షో నుంచి వెళ్లిపోయింది.

నామినేషన్స్‌పై స్పెషల్‌గా:బిగ్ బాస్ షోలో ప్రతి సోమవారం జరిగే ఎపిసోడ్‌లోనే నామినేషన్స్ టాస్కును చూపిస్తారు. షో మొత్తానికి ఊపిరిని పోసే కంటెంట్ ఇందులోనే దొరుకుతుంది. కాబట్టి దీనిపై నిర్వహకులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. ఇందుకోసం గతంలో వాడిన టాస్కులను కాకుండా ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఏడో సీజన్ కోసం సరికొత్త కంటెంట్‌తో రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది.

రెండో వారంలో బిగ్ ట్విస్ట్:బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఏడో సీజన్ రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను గతంలో మాదిరిగా కాకుండా సరికొత్తగా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్‌ను పిలవగా.. అతడు లేదా ఆమెను ఎవరైతే నామినేట్ చేయాలనుకున్నారో ఒకరి తర్వాత ఒకరు వచ్చి నామినేట్ చేయాలి. ఇందుకోసం బటన్ నొక్కి వాళ్లపై నీళ్లు పడేయాలి.

గొడవలు పెట్టిన బిగ్ బాస్:సాధారణంగానే నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా శివాజితో ప్రియాంక జైన్, అమర్‌దీప్ వాదన పెట్టుకున్నారు. అలాగే, సందీప్ మాస్టర్‌తో ప్రిన్స్ యావర్, రతికాతో టేస్టీ తేజ గొడవలు పెట్టుకున్నారు.

మొత్తం 8 మంది నామినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని రెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మరోసారి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, రతికా రోజ్, శోభా శెట్టి, అమర్‌దీప్ చౌదరి, శివాజి, టేస్టీ తేజ, దామినిలు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.

సందీప్‌కు స్పెషల్ పవర్:తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో నామినేషన్స్ టాస్క్ జరిగిన తీరును చూపించారు. ఇక, చివర్లో పవర్ ఆస్త్రాన్ని గెలిచి ఇమ్యూనిటీ పొందిన సందీప్‌కు బిగ్ బాస్ ఓ స్పెషల్ పవర్ ఇచ్చినట్లు చూపించారు. దీనిబట్టి అతడు మరో కంటెస్టెంట్‌ను నేరుగా నామినేట్ చేసే అవకాశం పొందాడు. మరి అతడు ఎవరిని నామినేట్ చేశాడో అన్నది మాత్రం సస్పెన్స్‌గా మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X