Bigg Boss Telugu 7 వీక్ కంటెస్టెంట్‌కు టాప్ ఓటింగ్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, 3వ వారం మహిళకే ఎలిమినేషన్ ముప్పు
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 7 మూడో వారంలోకి ప్రవేశించింది. గత రెండువారాల్లో అనేక భావోద్వేగాలు, ఇంటి సభ్యుల మధ్య విబేధాలు వ్యవహారం మూడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో స్పస్టంగా కనిపించింది. అరుపులు. పెడబొబ్బలతో సాగిన నామినేషన్ ప్రక్రియ గురించి, ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్లు, తాజా ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
గత రెండువారాల్లో ఇద్దరు కంటెస్టెంట్లైన సీనియర్ హీరోయిన్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. తొలివారం సీనియర్ హీరోయిన్ కిరణ్ రాథోడ్, రెండోవారం షకిలా ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇక మూడో వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేషన్ ప్రక్రియను బిగ్‌బాస్ ప్రారంభించారు. దాంతో ఇంటి సభ్యులు తమకు తోచిన కారణాలు చెప్పి నామినేట్ చేశారు.

మూడో వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారి వివరాల్లోకి వెళితే.. తొలుత ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతిక రోజ్, డాక్టర్ గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, దామిని, టేస్టీ తేజ నామినేట్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. అయితే నామినేషన్ ప్రక్రియ ముగిసిందని అందరూ అనుకొన్నారు.
కానీ నామినేషన్ ప్రక్రియను కొనసాగిస్తూ.. పవర్ ఆస్త్రతో కంటెస్టెంట్స్ నుంచి హౌస్‌మేట్స్ అయిన ఆట సందీప్, యాక్టర్ శివాజీని బిగ్‌బాస్ ఇరుకున పెట్టారు. నామినేషన్ అయిన వారి నుంచి ఒకరిని సేవ్ చేస్తూ.. మరొకరిని నామినేట్ చేయాలని ఆదేశించాడు. దాంతో టేస్టీ తేజను నామినేషన్ నుంచి బయటకు లాగి.. అమర్ దీప్‌ను నామినేషన్‌లోకి పంపారు. అలా అమర్ దీప్ అనుకోకుండా నామినేషన్‌లోకి వచ్చాడు.
మూడో వారానికి నామినేట్ అయిన అమర్ దీప్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతిక రోజ్, డాక్టర్ గౌతమ్ కృష్ణ, శుభ శ్రీ, దామిని తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు సిద్దమయ్యారు. అయితే తొలివారమే భారీ ఓటింగ్ నమోదైంది. అయితే టాప్ కంటెస్టెంట్లు అనుకొన్న ఇద్దరు ఓటింగ్‌లో చివరిస్థానంలో నిలవడం ఆశ్చర్యానికి గురిచేసింది.
బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత తొలి రోజు ఓటింగ్ వివరాల్లోకి వెళితే.. టాప్ స్థానంలో అమర్ దీప్ ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో ప్రిన్స్ యావర్ రెండోస్థానంలో, ప్రియాంక జైన్ మూడో స్థానంలో నిలిచారు. ఇక నాలుగోస్థానంలో రతిక రోజ్, ఐదో స్థానంలో గౌతమ్ కృష్ణ నిలిచారు. చివరి స్థానాల్లో శుభశ్రీ, దామిని ఉండటంతో వారి అభిమానులు ఆందోళనకు గురి అవుతున్నారు.


Click it and Unblock the Notifications











