Bigg Boss Nominations: 3వ వారంలో ఏడుగురు నామినేట్.. శివాజి పవర్‌తో అతడు సేఫ్.. స్ట్రాంగ్ ప్లేయర్ బలి
మన బుల్లితెరపై రకరకాల కాస్సెప్టులతో షోలు వస్తున్నాయి. అయితే, అందులో కొన్ని మాత్రమే ప్రత్యేకమైన గుర్తింపును, ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. వరుసగా సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోన్న ఇది.. ఇప్పుడు ఏదో దానితో వచ్చేసింది. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన అంశాలను హైలైట్ చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఏడో సీజన్‌లోని మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ, లిస్ట్ మొత్తం లీక్ అయిపోయారు. ఆ వివరాలేంటో మీరు కూడా చూసేయండి మరి!
నిజంగా ఉల్టా పుల్టా సీజన్‌గా:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను నిర్వహకులు రెండు వారాల క్రితమే ప్రారంభించారు. ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో రూపొందిన ఇది.. ఆరంభం నుంచి ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఇందులో గతంలో ఎప్పుడూ చూడని సరికొత్త కంటెంట్‌ను చూపిస్తున్నారు. అలాగే, ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. మొత్తంగా ఈ సీజన్‌తో ప్రేక్షకులకు మజాను ఇస్తూ రేటింగ్‌ను రాబడుతున్నారు.

అప్పుడే ఇద్దరు ఎలిమినేట్:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా ఎలిమినేట్ అయిపోయారు.
నామినేషన్స్ చాలా కొత్తగా:బిగ్ బాస్ షోలో ప్రతి సోమవారం నామినేషన్స్ టాస్కును నిర్వహిస్తారు. షో మొత్తంలో ఎంతో ముఖ్యమైన ఇది ఏడో సీజన్‌లో చాలా కొత్తగా జరుగుతోంది. ముఖ్యంగా గతంలో మాదిరి టాస్కులు కాకుండా చాలా కొత్తగా డిజైన్ చేస్తున్నారు. దీంతో ఈ సీజన్‌లో నామినేషన్స్ మరింత హైలైట్ అవుతున్నాయి. దీనికితోడు పవర్ అస్త్ర ఉన్న వాళ్లకు స్పెషల్ పవర్స్ కూడా ఇస్తున్నారు.
మూడో వారం టాస్క్ ఇలా:బిగ్ బాస్ ఏడో సీజన్ మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను పాత సీజన్లలో మాదిరి కాన్సెప్టుతోనే నిర్వహించారు. బిగ్ బాస్ ఒక కంటెస్టెంట్‌ను పిలవగా.. అతడు లేదా ఆమె ఎవరైతే నామినేట్ చేయాలనుకున్న వారి ముఖ్యంగా క్రీమ్ పూయాలి. అందుకు తగిన కారణాలను కూడా చెప్పాలి. ఇందులో సందీప్, శివాజికి పవర్ అస్త్ర ఉండడంతో సేఫ్ అయ్యారు.
ఫుల్ గొడవలు... శివాజితో:బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా శోభా శెట్టి - శుభశ్రీ.. ప్రిన్స్ - ప్రియాంకకు పెద్ద గొడవ జరిగిందని సమాచారం. ఇక, శుభశ్రీ, శోభాలో ఎవరు కరెక్టో చెప్పాలని బిగ్ బాస్ శివాజిని అడిగాడు.
ఏడుగురు నామినేషన్‌లో:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని మూడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణ, దామినిలు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.
స్పెషల్ పవర్‌తో స్వాప్:వాస్తవానికి మూడో వారం నామినేషన్స్‌లో టేస్టీ తేజను కంటెస్టెంట్లు నామినేట్ చేశారట. అయితే, శివాజి అండ్ సందీప్‌కు ఉన్న స్పెషల్ పవర్‌తో నామినేట్ అయిన వారిలో ఒకరిని సేఫ్‌గా ఉన్న వాళ్లతో స్వాప్ (మార్చాలని) బిగ్ బాస్ సూచించాడని సమాచారం. దీంతో వీళ్లిద్దరూ కలిసి టేస్టీ తేజ స్థానంలో అమర్‌దీప్ చౌదరిని నామినేట్ చేశారు. ఇలా ఈరోజు టాస్క్ జరగనుంది.


Click it and Unblock the Notifications











