Bigg Boss 7 Telugu Voting.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు.. నాలుగో వారంలో కూడా లేడీ కంటెస్టెంట్‌పై ఎలిమినేషన్
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో నాలుగో వారంలోకి ప్రవేశించింది. మూడు వారాల్లో ముగ్గురు లేడీ కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారం షకీలా, మూడో వారం సింగర్ దామిని ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇక నాలుగో వారం ఎలిమినేషన్ కోసం బిగ్‌బాస్ రంగం సిద్దం చేశారు. సోమవారం నాటి నామినేషన్ ప్రక్రియలో ఏం జరిగింది? ఎవరెవరు? నామినేట్ అయ్యారు. తొలి రోజు ఓటింగ్ ప్రక్రియ ఎలా ఉంది? అనే ప్రశ్నలకు సమాధానాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో నామినేషన్ల ప్రక్రియను సరికొత్తగా ప్లాన్ చేశారు. ఇప్పటికే ముగ్గురు హౌస్‌మేట్స్‌గా మారిన శివాజీ, ఆట సందీప్, శోభా శెట్టిని జడ్జీలుగా మార్చారు. నామినేషన్స్ జరిగే ప్లేస్‌లో గిల్టీ బోర్డును పెట్టారు. ఎవరైతే ఇద్దరిని నామినేట్ చేస్తారో.. వారిలో నుంచి ఒకరిని ముగ్గురు జడ్జీలు సెలెక్ట్ చేయాలి. అలా నామినేట్ అయిన కంటెస్టెంట్‌ను గిల్టీ బోర్డుపై పెట్టి.. నామినేషన్‌ను కన్ఫర్మ్ చేయాలి. అయితే ఒకసారి నామినేషన్ చేసిన కంటెస్టెంట్‌ను మరొకరు నామినేట్ చేయకూడదని నిబంధనలు తెలిపారు.

నాగార్జున అక్కినేని హోస్ట్ చేసిన వీకెండ్ షోలో తన మాజీ ప్రియుడి గురించి ఆలోచించి.. మూడ్ ఆఫ్ అయింది. అలాంటి పరిస్థితిలో ఇద్దరిని ఆలోచించకుండా నామినేట్ చేశాను అనే పాయింట్‌పై రతికను శుభ శ్రీ నామినేట్ చేయగా.. ఇంట్లో పనిచేయడం లేదని అమర్ దీప్‌ను నామినేట్ చేసింది. అయితే నేనేదో మాట్లాడితే.. అది విని ఇక్కడ చెబితే.. ఆ క్యారెక్టర్‌ను ఏమనాలి? అని రతిక అంటే.. మైండ్ యువర్ టంగ్ అంటూ శుభ శ్రీ అరిచింది. ఇక పనిచేయడం లేదని శుభశ్రీ అంటే.. నీవు రొటీస్ చేసినందుకు.. శుభ శ్రీ రోటీస్ అని బోర్డు పెట్టుకోమని అమర్ దీప్ అరిచాడు. మీరందరూ వెళ్లినా నేను ఇక్కడే ఉంటాను అని అమర్ దీప్ చెప్పాడు.
ఇక నామినేషన్ల సందర్భంగా డాక్టర్ గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్ మధ్య వాగ్వాదం భారీగానే జరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒకరిపై మరొకరు అరుచుకొన్నారు. గౌతమ్ మీదకు యావర్ దూసుకెళ్లడంతో శివాజీ అరిచి వెనుకకు పిలిచాడు. దాంతో కోపంతో యావర్ వెనక్కు వెళ్లాడు.
ఇలా అవేశాలు, అభ్యంతరాలు, వివాదాస్పద కామెంట్స్‌తో నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నామినేట్ అయిన వారిలో ఆరుగురు ఉన్నారు. నాలుగో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతిక రోజ్, డాక్టర్ గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజా, శుభశ్రీ ఉన్నారు.
బిగ్‌బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్‌కు జరిగిన ఓటింగ్‌లో ఆశ్చర్యకరమైన అంశాలు కనిపించాయి. అత్యధికంగా ఓట్లతో అంటే 35 నుంచి 40 శాతం ఓట్ల ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో ప్రియాంక జైన్ 20 నుంచి 25 శాతం ఒట్లు, ఆ తర్వాత రతిక 10 నుంచి 15 శాతం ఓట్లతో మూడో స్థానంలో, గౌతమ్ 10 శాతానికిపైగా ఓట్లతో నాలుగో స్థానంలో, 10 శాతం ఓట్లతో టేస్టీ తేజ ఐదో స్థానంలో, శుభ శ్రీ 8 నుంచి 10 శాతం ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. దాంతో ఈ వారం టేస్టీ తేజ, రతిక డేంజర్‌లో ఉన్నట్టు ఓట్ల శాతం స్పష్టం చేసింది.


Click it and Unblock the Notifications











