Bigg Boss 7 Telugu 5 week Elimination తొలి రోజే శివాజీకి రికార్డు ఓటింగ్.. డేంజర్ జోన్‌లో టాప్ కంటెస్టెంట్లు
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో ఐదో వారం సంచలనంగా మారింది. ఐదోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ బిగ్‌బాస్ తెలుగు షో అభిమానుల్లో జోష్ పెంచింది. అయితే తొలి రోజే నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్లకు భారీగా, రికార్డుగా ఓటింగ్ నమోదైంది. దాంతో ఇంకా నాలుగు రోజుల్లో ఓటింగ్ మరింత రచ్చగా మారే అవకాశం ఉంది. అయితే ఐదోవారం ఎలిమినేషన్‌కు జరిగిన నామినేషన్ ప్రక్రియకు జరిగిన ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో నాలుగో వారం తర్వాత లెక్కలు మారిపోయాయి. పవర్ అస్త్ర సాధించి సేఫ్‌గా ఉన్న శివాజీని కంటెస్టెంట్లు కూడబలుక్కొని హౌస్‌మేట్ నుంచి కంటెస్టెంట్‌గా మార్చడంతో ఒక్కసారిగా వాతవారణం గంభీరంగా మారిపోయింది. కొందరు ఇంట్లో గ్రూప్‌గా ఏర్పడి శివాజీ పవర్ అస్త్రను లాగేసుకోవడంతో ఆయన సాధారణ కంటెస్టెంట్‌గా మారిపోయారు.

దాంతో శివాజీ పవర్ అస్త్ర కోల్పోవడంతో ఫాలోవర్స్ సీరియస్ అయినట్టు కనిపించింది. తొలి రోజే రికార్డు స్థాయిలో ఆయనకు ఓట్లు గుద్దేశారు. దాంతో ఆయనకు భారీగా ఓటింగ్ నమోదైంది. తొలి రోజు శివాజీ ఒక్కడికే 50 శాతం ఓటింగ్ రావడంతో ఇతర కంటెస్టెంట్ల అభిమానులకు గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి ఏర్పడింది. ఈ సారి శివాజీ ఇంట్లో కూడా రెబెల్‌గా మారే అవకాశం ఉందనే పరిస్థితి కనిపించింది.
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో ఐదో వారంలో తొలి రోజు నమోదైన ఓటింగ్ వివరాల్లోకి వెళితే.. 50 శాతానికిపైగా శివాజీకి, ఆ తర్వాత ప్రిన్స్ యావర్‌కు 14 శాతం అమర్ దీప్‌కు 9 శాతం, గౌతమ్‌కు 8 శాతం, ప్రియాంకకు 7 శాతం, శుభ శ్రీకి 6 శాతం, టేస్టీ తేజకు 5 శాతం ఓట్లు లభించాయి. ఈ వారం శివాజీ టాప్ గేర్‌లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తున్నది.
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో ఐదో వారం ఓటింగ్ ప్రకారం చూస్తే.. ఎవరైనా డేంజర్ జోన్‌లోకి రావొచ్చనే అభిప్రాయం కలుగుతున్నది. ఎందుకంటే చాలా మంది తక్కువ శాతం ఓటింగ్‌తో మార్జిన్‌లో ఉన్నారు. దాంతో ఓటింగ్ శాతంలో అనేక మార్పులు కనిపించే అవకాశంతోపాటు ఊహించని విధంగా కంటెస్టెంట్లు ప్రమాదంలో కూరుకుపోయే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం డేంజర్ జోన్‌లో టేస్టీ తేజ ఉండటం గమనార్హం. టేస్టీ తేజ డేంజర్ జోన్ నుంచి బయటకు వస్తారా? లేదా అనేది వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉండగా, ఐదోవారం నామినేషన్‌లో ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. శివాజీ, ప్రిన్స్ యావర్, అమర్ దీప్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శుభ శ్రీ, టేస్టీ తేజ నామినేషన్‌లో ఉన్నారు. ఈ వారం కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉండటంతో ఓటింగ్ ప్రక్రియ ఆసక్తికరంగా మారింది. ఎవరు సేఫ్ అవుతారో. ఎవరు అన్ సేఫ్ అవుతారో అనేది చర్చనీయాంశమవుతున్నది.


Click it and Unblock the Notifications











