Bigg Boss 7 Telugu : యావర్ కు బిగ్ బాస్ తెలుగు క్లాసులు, హగ్గులిస్తూ ప్రియాంక, కొడుతూ నేర్పించిన శోభా!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్.. ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి ప్రతీ ఒక్కరూ రాత్రి కాగానే టీవీల ముందు వాలిపోతున్నారు. కొత్త సీజన్ వస్తుందంటే చాలు ఆసక్తిగా టీవీ చూసేస్తుంటారు చాలా మంది. అయితే ఇందులో ఉండే కంటెస్టెంట్లు ఏం చేసినా వాళ్లను పొగిడే వాళ్లతో పాటు తిట్టే వాళ్లు కొందరు. అలా ప్రతీ వారం ఒకరు ఎలిమినేట్ అవుతూ.. వెళ్తుండగా.. ఉన్న వారు చేసే ఎంటర్ టైన్ మెంట్ తో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు ప్రేక్షకులు. అయితే తాగాజా వచ్చిన ఎపిసోడ్ లో.. బిగ్ బాస్ ఓ అదిరిపోయే టాస్క్ ఇచ్చారు. ఎన్ని సార్లు పనిష్మెంట్ ఇచ్చినా మళ్లీ మళ్లీ ఇంగ్లీష్ మాట్లాడుతున్న ప్రిన్స్ యావర్ కు తెలుగు నేర్పించాలనేది ఈ టాస్క్.
యావర్ తప్పుకు తేజకు శిక్ష : అయితే ఈ టాస్క్ లో ప్రతీ ఇంటి సభ్యుడు.. యావర్ కు 5 తెలుగు పదాలు నేర్పించాల్సి ఉంటుంది. నేర్పించిన పదాలు సరిగ్గా పలకకపోయినా, యావర్ ఇంగ్లీషులో మాట్లాడిన టేస్టీ తేజ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఆ శిక్ష 5 గుంజీలు తీయడం. అలాగే ఈ టాస్క్ కు అమర్ దీప్ సంచాలక్ గా వ్యవహరించారు. ముందుగా పంచకట్టులో వచ్చిన టేస్టీ తేజ యావర్ కు తెలుగు నేర్పించే ప్రయత్నం చేశాడు. ఈక్రమంలోనే దీన్ని చాలా ఫన్నీగా చేయాలనుకున్న యావర్... చిన్న పిల్లాడిలా బిహేవ్ చేస్తూ అందరినీ ఆట పట్టించాడు. ముఖ్యంగా టేస్టీ తేజను ఓ ఆట ఆడుకున్నాడు.

తేజ పంచ లాగేసిన యావర్ : ముందుగా గుడ్ మార్నింగ్ అంటూ అతి చేసిన యావర్.. టేస్టీ తేజ చెప్పడంతో శుభోదయం పంతులు గారు అంటూ చేతులు కట్టుకొని నిల్చున్నాడు. ఈక్రమంలోనే తేజ.. ముందుగా గుడ్డు పగులుద్ది అనే పదం నేర్పించాడు. ఆ తర్వాత పదం చెప్పబోయేలోపే యావర్.. తేజ పంచ లాగాడు. అది సరి చేసుకున్న తేజ నడ్డి విరుగుద్ది అని చెప్పాడు. ఇంతలోనే తేడ ముడ్డిపై తన్నాడు యావర్. ఆ తర్వాత ఇల్లంతా నవ్వులు, పరుగులు. ఇదయ్యాక చెంప చెల్లుమంటుంది అని చెప్పగా యావర్ కొట్టి చూపించాడు. ఇది తట్టుకోలేని తేజ ఇక చెప్పడం మానేశాడు. ఆపై వచ్చిన శుభ శ్రీ యావర్ ను టీజ్ చేస్తూ.. ముద్దు ముద్దుగా తెలుగు నేర్పించింది.
నేను నిన్ను ప్రేమిస్తున్నానని, గాలొస్తుంది అంటూ నేర్పించింది. మూడోది వదిలెయ్ అంటూ, నాలుగోది అందమైన అమ్మాయి అనే పదం నేర్పించింది. కానీ ఆ తర్వాత వచ్చిన శోభా శెట్టి మాత్రం టీచర్ కు రెస్పెక్ట్ ఇవ్వాల్సిందేనని చెప్పింది. కానీ యావర్ అదేం పట్టించుకోకుండా.. ఓ పిచ్చి పాటను పాడాడు. ఆ పాటకు కంటెస్టెంట్లందరూ నవ్వారు. ఆ తర్వాత శోభ భార్య, భర్త, అతమ్మని నేర్పించే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే యావర్ జోకులు చేస్తుంటే... నాలుగు దెబ్బలు కూడా వేసింది శోభా టీచర్. ఆ తర్వాత మామయ్య, మరదలు పదాలు నేర్పించి వెళ్లింది.
ఇక రంగంలోకి దిగిన ప్రియాంక జైన్.. నిన్న నైట్ నువ్వు బెడ్ మీద చేసింది ఏంటంటూ మొదలెట్టింది. అది విన్న అందరూ డబుల్ మీనింగ్ డైలాగ్ అంటూ నవ్వుకున్నారు. గురక పదం నేర్పించిన వెంటనే శోభాతో నువ్వు చేసిందేంటి అని అడిగింది. దీనికి కంటెస్టెంట్లు సరసం అంటూ కామెంట్లు చేశారు. కానీ అదేం కాదంటూ వెళ్లిన ప్రియాంక యావర్ ను కౌగిలించుకుంది. హగ్ ఇచ్చి మరీ కౌగిలింత అనే తెలుగు పదం నేర్పించింది. దీనికి అమర్.. నాకు ఏ టీచర్ ఇలా పాఠాలు చెప్పలేదంటూ ఫీల్ అయ్యాడు. ఆ తర్వాత పంచుకోవడం వంటి పదాలు నేర్పించింది. ఆ తర్వాత అమర్ దీప్ వెలుగు, చిరుత, జింక, పిల్లి వంటి పదాలు నేర్పించాడు. చివరగా వచ్చిన శివాజీ.. నాకు, తెలుగు, నేర్పిన, మీకు, ధన్యవాదాలు అనే పదాలు నేర్పించడంతో టాస్క్ ముగిసింది.


Click it and Unblock the Notifications











