Bigg Boss 7 Elimination షాకింగ్ ఓటింగ్‌తో జాతకాలు తారుమారు..వార్ వన్‌సైడ్‌గా శివాజీ..డేంజర్ జోన్‌లో ఎవరంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో ఐదో వారంలో ఓటింగ్ రచ్చ రచ్చగా మారింది. ఐదోవారం ఎలిమినేషన్ కోసం ప్రారంభమైన ఓటింగ్‌లో ఊహించిన ఫలితాలు నమోదు అవుతున్నాయి. టాప్ కంటెస్టెంట్లు అనుకొన్న వాళ్ల జాతకాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. గత రెండు రోజుల్లో నమోదు అవుతున్న ఓటింగ్ అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఐదో వారం నామినేషన్‌ల భాగంగా జరిగిన రెండో రోజు ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఐదోవారంలో ఇంటిలో పది మంది సభ్యులే మిగిలారు. అందులో ముగ్గురు హౌస్‌మేట్స్ కావడంతో నామినేషన్‌కు ఏడుగురు మాత్రమే మిగిలారు. అయితే ఈ ఏడుగురిలో మొత్తం మంది నామినేట్ అయ్యారు. శివాజీ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శుభ శ్రీ, టేస్టీ తేజ, అమరదీప్ నామినేట్ అయ్యారు.

అయితే పవర్ అస్త్రను కోల్పోయిన శివాజీపై అనూహ్యమైన సానుభూతి, ఫాలోయింగ్ పెరిగినట్టు తాజా ఓటింగ్‌లో స్పష్టమైంది. గ్రూపిజంతో సీరియల్ యాక్టర్లు ఆడిన డ్రామాలో శివాజీకి అన్యాయం జరిగిందనే కారణంతో అభిమానులు భారీగా ఓటింగ్‌కు పాల్పడినట్టు అర్ధమవుతున్నది. ఈ ఘటనతో శివాజీకి మంచి ఫాలోయింగ్ పెరిగిందనే అభిప్రాయం నెటిజన్లలో కూడా వ్యక్తమవుతున్నది.
ఐదోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్‌లో భాగంగా జరిగిన ఓటింగ్‌లో శివాజీకి భారీగా ఓట్లు పడ్డాయి. శివాజీకి వచ్చిన ఓటింగ్ చూస్తే వార్ వన్ సైడ్ అన్నట్టు కనిపించింది. గత రెండు రోజుల్లో మొత్తంగా పోలైన ఓట్లలో 60 శాతం ఓట్లు శివాజీకే రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది. శివాజీ టాప్ స్థానంలో ఉంటే.. ఆ తర్వాత కంటెస్టెంట్ 10 శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకోవడం షాకింగ్‌గా మారింది.
ఐదోవారం ఓటింగ్ వివరాల్లోకి వెళితే. ప్రిన్స్ యావర్‌కు 10 శాతం, అమర్ దీప్‌కు 9 శాతం, శుభ శ్రీకి 9 శాతం, ప్రియాంక జైన్‌కు 8 శాతం, గౌతమ్‌కు 7.5 శాతం, టేస్టీ తేజకు 5 శాతం ఓట్లు వచ్చాయి. వచ్చే రెండు, మూడు రోజుల్లో భారీగా ఓట్లు తెచ్చుకొంటే చాలా మంది డేంజర్ జోన్ నుంచి భయటపడే అవకాశం ఉందనే అభిప్రాయం కలుగుతున్నది.
ప్రస్తుతం ఐదోవారం శివాజీ తప్ప అందరూ డేంజర్ జోన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నది. ఓట్ల శాతంలో మార్జిన్ తక్కువగా ఉండటంతో ఎవరు ఉంటారో ఎవరు పోతారనే విషయంపై అస్పష్టత కనిపిస్తున్నది. ప్రస్తుతానికి మాత్రం టేస్టీ తేజ ఎలిమినేషన్ కావడం తథ్యమనే ఫీలింగ్ కలుగుతున్నది. గత రెండు వారాలుగా టేస్టీ తేజ డేంజర్ జోన్ నుంచి బయటపడతున్నాడు. ఈ సారి కూడా టేస్టీ తేజ డేంజర్ జోన్ నుంచి బయటపడుతాడా? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











