Bigg Boss 7 Telugu: గుక్కపెట్టి అమర్ దీప్ ఏడుపు.. షర్ట్ విప్పేసి అలాంటి పని!
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ రియాల్టీ షో రసవత్తరంగా సాగుతోంది. ముఖ్యనంగా మొన్నటి, నిన్నటి ఎపిసోడ్ లు అయితే అందరినీ కన్నీరు పెట్టించాయి. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్లే కాకుండా.. రోజూ ఈ షో చూస్తున్న వారంతా చాలా ఎమోషనల్ అయిపోయారు. ముఖ్యంగా అమర్ దీప్ అయితే గుక్కపెట్టి మరీ ఏడ్చాడు. లేఖ పైన రాసి ఉన్న కన్నా అనే పేరు చూసి కన్నీరు మొదలు పెట్టిన అతడు నాన్ స్టాప్ గా ఏడుస్తూనే ఉన్నాడు. మరో వైపు సందీప్ మాస్టర్ కూడా తన అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని తెగ ఆరాట పడిపోయాడు. ఈక్రమంలోనే ఆ లేఖ తనకంటే సందీప్ మాస్టర్ కే ఎక్కువ ముఖ్యం అని భావించిన అమర్ దీప్ లేఖను త్యాగం చేయక తప్పలేదు.
సందీప్ మాస్టర్ తన అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవాలని మూడు వారాలుగా ఫుల్ ఫీల్ అవుతున్నట్లు చెప్పుకొచ్చిన అమర్ దీప్.. తనకు కూడా ఇంట్లో వాళ్లు పంపిన లేఖను చూడాలనిపిస్తోందని చెప్పాడు. తేజూకు తాను ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదని ఎప్పుడూ అనుకుంటుందని.. కానీ ఇప్పుడు కూడా అదే ప్రూవ్ చేస్తున్నట్లు అవుతుందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఓవైపు ఏడుస్తూనే మరో వైపు తన లేఖను త్యాగం చేశాడు. తేజూ నీ విలువ నాకు బాగా తెలుస్తుందంటూ కన్నీరు పెట్టుకున్నాడు. లేఖను త్యాగం చేసి.. అవి ముక్కలు అవుతుంటే కింద పడి మరీ ఏడ్చాడు. అతడిని ఆపేందుకు సందీప్ మాస్టర్ ఎంతగానో ప్రయత్నం చేశాడు.

అయినప్పటికీ అతడి ప్రయత్నాలు ఫలించలేదు. ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని గట్టిగా ఏడ్చారు. అమర్ దీప్ అయితే తాను వేసుకున్న చొక్కాను విప్పి మరీ ముక్కలు అయిన లేఖను తన డ్రెస్సులో వేసుకున్నాడు. వాటన్నిటిని చాలా జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లి ఒక్కొక్కటీ చూసుకుంటూ మరింత ఎమోషనల్ అయ్యాడు. ఈ ఎపిసోడ్ లు అమర్ దీప్ ను చూస్తే.. అయ్యో పాపం అని అనకుండా ఉండలేం. అంతలా ఏడ్చి ఆగమైన అమర్ దీప్ ను ఓదార్చేందుకు ఓ వైపు ప్రియాంక, మరోవైపు శోభా శెట్టి గట్టిగానే ప్రయత్నం చేశారు. అలాగే అమర్ దీప్ తెచ్చుకున్న లేఖ ముక్కలను చూసుకుంటూ అలాగే కూర్చుండిపోయారు.
ఆ తర్వాత కెమెరా ముందుకు వచ్చిన అమర్ దీప్.. తేజూ ఐ యామ్ సారీ, నేను ఇప్పటి నుంచి గట్టిగా ఆడతానంటూ చెప్పుకొచ్చాడు. ఏం రాశశావో కూడా చూడలేకపోయానంటూ మరోసారి కన్నీరు పెట్టుకున్నాడు. నేను ఏడిస్తే బాగోనని చెబుతూనే.. చిన్న పిల్లాడి కంటే దారుణంగా ఏడ్చాడు. మరోవైపు లెటర్ పొందిన సందీప్ మాస్టర్ కూడా లేఖను చూసుకుంటూ మొహానికి పెట్టుకుని మరీ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. ఆ లేఖను చదువుకుంటూ ఒకటే ఏడుపు. ఓ వైపు అమర్ దీప్, మరోవైపు సందీప్ మాస్టర్ ఒకరిని మించి మరొకరు ఏడ్చారు.
ఆ తర్వాత వచ్చిన శివాజీ, పల్లవి ప్రశాంత్ లు కూడా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ అయితే విపరీతంగా ఏడ్చేశాడు. శివాజీ మాత్రం చాలా స్పోర్టివ్ గా తీసుకుంటూ హాయిగా కాఫీ తాగాడు. నాకు నా పెళ్లాం రాసింది అదేం రాస్తదో నాకు తెలుసని చెబుతూ... నువ్వే లేఖ తీసుకో అంటూ చెప్పుకొచ్చాడు. నువ్వు గెలువు.. నేను నీ వెనకాల ఉంటానని చెప్పుకొచ్చాడు. శివాజీ చెప్పన మాటలతో మరింత ఎమోషనల్ అయిన పల్లవి ప్రశాంత్ ఏడుస్తూనే ఉన్నాడు. మంచిగ ఆడు.. మీ నాయను పేరు నిలబెట్టంటూ శివాజీ పల్లవి ప్రశాంత్ కు సూచించాడు. సగం ఎపిసోడ్ మొత్తం ఏడుపు, ఎమోషనల్ గానే కొనసాగింది. మీరూ ఆ ఎపిసోడ్ చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











