Bigg Boss 7 Telugu: ప్రిన్స్‌ యావర్‌తో డేటింగ్.. పల్లవి ప్రశాంత్‌తో పెళ్లి.. హాట్ కంటెస్టెంట్‌తో బిగ్ ప్లాన్

తెలుగు బుల్లితెరపై ప్రత్యేకమైన గుర్తింపుతో పాటు ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకుపోతోన్న షో 'బిగ్ బాస్'. సరికొత్త ప్రయోగాలతో కూడిన ఈ షో.. చాలా తక్కువ సమయంలోనే ఆదరణను అందుకుంది. ఫలితంగా తెలుగులోనే టాప్ షోగా వెలుగొందుతోంది. ఇక్కడ ఇప్పటికే ఆరు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో... ఇటీవలే ఏడో దాన్ని కూడా మొదలెట్టుకుంది. ఇక, తాజాగా ఈ సీజన్ 2.Oను కూడా ఆరంభించారు. ఇందులోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ లేడీ హౌస్‌లో ఉన్న కొందరు కంటెస్టెంట్లపై నాటీ కామెంట్స్ చేసింది. ఆ వివరాలేంటో మీరే చూసేయండి!

ఉల్టా పుల్టాలో మరో వెర్షన్:బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో రన్ చేస్తున్నారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా గత ఐదు వారాల్లో ఎన్నో రకాల సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు చూపించారు. ముఖ్యంగా ఎలిమినేషన్స్ అన్నీ విభిన్నంగానే సాగాయి. ఈ క్రమంలోనే గత ఆదివారం ఈ సీజన్‌లో 2.O వెర్షన్‌ను కూడా మొదలెట్టారు. దీంతో ఈ గేమ్ మరింత రసవత్తరంగా మారబోతుందని చెప్పాలి.

Bigg Boss 7 Telugu Contestant Nayani Pavani Shocking Comments On Prashanth and Prince

ఐదుగురు.. ఆమె స్పెషల్:ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ ఏడో సీజన్ 2.O అంగరంగ వైభవంగా మొదలైంది. ఆదివారం రాత్రి ఎపిసోడ్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు హౌస్‌లోకి అడుగు పెట్టారు. అందులో అందరి దృష్టిని ఆకట్టుకున్నది మాత్రం సోషల్ మీడియా సెన్సేషన్ నయని పావని అనే చెప్పాలి. ఈ అమ్మడు తనదైన పెర్ఫార్మెన్స్‌తో సందడి చేసి ఆరంభంలోనే హైలైట్ అయిపోయింది.

దమ్ము, దుమ్ము వాళ్లేనట:బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన ప్రతి కంటెస్టెంట్‌ను హౌస్‌లో ఉన్న వారిలో దమ్ము ఎవరు? దుమ్ము ఎవరు? చెప్పాలని హోస్ట్ అక్కినేని నాగార్జున కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నయని పావనిని కూడా సేమ్ క్వశ్చన్ అడిగాడు. దీనికామె ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ దమ్ము ఆటగాళ్లని చెప్పింది. అలాగే, అమర్‌దీప్ చౌదరి, టేస్టీ తేజలు దుమ్ము ప్లేయర్లు అనేసింది.

తేజను ఫ్రెండ్‌గా అంటూ:ఆ తర్వాత హోస్ట్ అక్కినేని నాగార్జున ఎల్ఈడీ స్క్రీన్ మీద ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజల ఫొటోలను చూపించాడు. అప్పుడు నయని పావనిని 'ఈ ముగ్గురిలో ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? ఎవరిని పెళ్లి చేసుకుంటావు' అని ప్రశ్నించాడు. దీనికి కాసేపు ఆలోచించుకున్న ఆ అమ్మాయి 'తేజతో ఫ్రెండ్‌షిప్ చేస్తాను' అని చెప్పుకొచ్చింది.

ప్రిన్స్‌పై హాట్ కామెంట్స్:ఆ తర్వాత నయని పావని కంటిన్యూ చేస్తూ.. 'ప్రిన్స్ యావర్‌తో డేట్ చేస్తాను. ఎందుకంటే అతడు చాలా హాట్‌గా ఉంటాడు. పైగా తెలుగు రాదు కదా హిందీ మాత్రమే. కాబట్టి కనెక్ట్ కావడానికి
టైమ్ పడుతుంది' అని చెప్పింది. అనంతరం పావని 'ఈ ముగ్గురిలో మిగిలింది ప్రశాంత్ కాబట్టి అతడిని పెళ్లి చేసుకుంటాను' అని చెప్పింది. తర్వాత ఆమె ఇంట్లోకి అడుగు పెట్టేసింది.

బిగ్ బాస్ మాస్టర్ ప్లానేనా:గతంలో కూడా ఇలా కనెక్షన్ గురించి అడిగిన ప్రతిసారీ హౌస్‌లో వాళ్లే జంటలుగా మారారు. ఇప్పుడు కూడా నయని పావని చక్కగా ఆడుతున్న ప్రిన్స్ లేదా ప్రశాంత్‌తో ట్రాక్ నడిపే అవకాశం ఉందని, ఆమె అలా చేయకపోయినా బిగ్ బాస్ టీమ్ క్రియేట్ చేస్తుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అదే జరిగితే ప్రిన్స్ కానీ, ప్రశాంత్ ఆటలో కానీ మార్పులు వచ్చే చాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X