Bigg Boss 7 Elimination ఉల్లిపాయలు కట్ చేసినందుకు నామినేషన్.. పల్లవి ప్రశాంత్ చేసిన పనికి ఆ ఇద్దరు లబోదిబో!
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో నామినేషన్ల ప్రక్రియ కంటెస్టెంట్లలో బలబలాలు, బలహీనతలు బయటపడ్డాయి. కొందరు లాజిక్‌గా నామినేట్ చేస్తే.. మరికొందరు లాజిక్ లేకుండా నామినేట్ చేశారు. అయితే కొందరు కంటెస్టెంట్లు తమ కారణాలు చెబుతూ నామినేట్ చేసిన విధానంపై మరికొందరు ముఖంపైనే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాంటి నిరసనలు, అసంతృప్తిల మధ్య ఓ కంటెస్టెంట్ ఉల్లిపాయలను ఆధారంగా చేసుకొని నామినేట్ చేయడం ఫన్నీగా మారింది. ఆ కంటెస్టెంట్ ఎవరు? అనే వివరాల్లోకి వెళితే..
తెలంగాణలోని సిద్దిపేటకు చెందిన పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డగా యూట్యూబ్‌లో పాపులారిటీ ఉంది. అయితే బిగ్‌బాస్‌లోకి రావాలని తపన పడుతున్న రైతు బిడ్డ కోరికను బిగ్‌బాస్ తీర్చాడు. దాంతో కామన్ మ్యాన్ కేటగిరిలో బిగ్‌బాస్ ఇంటిలోకి అడుగుపెట్టారు. అయితే ఇతర కంటెస్టెంట్లతో పోల్చితే చాలా అమాయకంగా కనిపించాడు. అయితే ఇంటిలో తన తోటి సభ్యులతో కలువడానికి ఇంకా తంటాలు పడుతున్నాడు.

అయితే నామినేషన్ సందర్భంగా కిరణ్ రాథోడ్, షకీలాను నామినేట్ చేశాడు. కిరణ్ అక్క వచ్చేసి.. డల్ కనిపించింది. దాంతో అక్క వీక్ అనిపించింది. ఆ తర్వాత షకీలాను నామినేట్ చేస్తూ అక్కను ఏదైనా అంటే.. వెంటనే బాధపడుతున్నది. అందుకే వీరిద్దరిని నేను నామినేట్ చేస్తున్నా. వారిద్దరూ యాక్టివ్‌గా ఆడాలని అనుకొంటున్నాను అని తన కారణాలను పల్లవి ప్రశాంత్ చెప్పాడు. అయితే పల్లవి చెప్పిన కారణాలు కిరణ్, షకీలాకు విస్మయం కలిగించాయి.
నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే కిరణ్ రాథోడ్ బయటకు వచ్చి.. వెంటనే నేను ఎక్కడ బాధపడ్డాను అని అడిగిత.. అక్కడ అని ప్రశాంత్ ఏదో చెప్పబోయాడు. దాంతో పక్కనే ఉన్న అతను.. ఉల్లిగడ్డలు కోస్తుంటే.. ఏడ్చావు కదా అని అన్నాడు. దాంతో వాట్ నాన్సెన్స్.. ఉల్లిగడ్డలు కోసినప్పుడు కన్నీళ్లు వస్తే నామినేట్ చేస్తావా? కిరణ్ రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తనను నామినేట్ చేయడంపై కిరణ్ రాథోడ్ జీర్ణించుకోలేకపోయింది. శివాజీతో మాట్లాడుతూ.. నేను ఎప్పుడు ఏడ్చాను. ఉల్లిగడ్డలు కోస్తే కళ్లలో నీళ్లు రావా? అది బాధపడ్డినట్టా అని కిరణ్ రాథోడ్ ఫైర్ అయింది. దాంతో ప్రశాంత్ మాట్లాడుతూ.. అక్కడ అంటూ ఏదో చెప్పబోయాడు. దాంతో అక్కడ బక్కడా కాదు అంటూ అసహనం వ్యక్తం చేసింది. ఉల్లిపాయలు, ఎల్లిపాయలు అంటూ నామినేట్ చేయవద్దు అని షకీలా కూడా అభ్యంతరం చెప్పింది.
బిగ్‌బాస్ తెలుగు 7 షోలో తొలివారం ఇంటి నుంచి వెళ్లడానికి నామినేట్ అయిన వారిలో ఎనిమిది మంది ఉన్నారు. వారిలో శోభా శెట్టి, రతిక రోజ్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, డాక్టర్ గౌతమ్, యాక్టర్ షకీలా, సింగర్ దామిని తదితరులు ఉన్నారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో అందరూ టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తికరంగా మారింది. అయితే తొలివారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే మాట వినిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











