Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్.. ముందుగానే ఏడో సీజన్.. అసలు ప్లాన్ అదేనా!
గతంలో ఎన్నడూ చూడని కంటెంట్‌తో వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొంది నెంబర్ వన్ రియాలిటీ షోగా ఎదిగింది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది.
అదే సమయంలో భారీ స్థాయి రేటింగ్‌ను సైతం దక్కించుకుని రికార్డులు తిరగరాసింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో సీజన్‌ను ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా నిర్వహకులు షో ఫ్యాన్స్‌కు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూసేయండి!

ఏడో సీజన్‌పై ప్రకటనతో హ్యాపీ: ప్రతి ఏడాదీ బిగ్ బాస్ షోకు తెలుగులో అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఏడో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వాళ్లంతా వేచి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే దీనికి సంబంధించిన లోగో, ప్రోమోలు స్టార్ మా విడుదల చేయడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక, ఈ సీజన్ సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుండడంతో అంతా ఆసక్తిగా ఉన్నారు.

ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతోనే: బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకూ వచ్చిన సీజన్లు అన్నీ సూపర్ సక్సెస్ అయ్యాయి. కానీ, ఆరో సీజన్ మాత్రం ఆశించిన రీతిలో ఆకట్టుకోలేదు. దీంతో నిర్వహకులు ఇప్పుడు ఏడో సీజన్‌లో 'ఉల్టా పుల్టా' అనే కొత్త కాన్సెప్టును పరిచయం చేయబోతున్నారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని టాస్కులు కూడా పెట్టబోతున్నారు. ముఖ్యంగా ఓటింగ్‌లో మార్పులు తీసుకు రాబోతున్నారు.
కంటెస్టెంట్లు పేర్లు బయటకు: బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరన్న విషయం సీక్రెట్‌గానే ఉంచుతారు. అంత పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటారు. ఇక, ఏడో సీజన్‌కు సంబంధించి మోహన భోగరాజు, అమర్‌దీప్, అంజలి, సందీప్ మాస్టర్, జబర్ధస్త్ మహేశ్, యాంకర్ నిఖిల్, కమెడియన్ రియాజ్, సింగర్ దామిని, బుల్లెట్ భాస్కర్, పవిత్ర తదితరులు పాల్గొనబోతున్నట్లు లీక్ అయింది.

ఏర్పాట్లు పూర్తి.. దాని మీదనే: సెప్టెంబర్ 3వ తేదీన ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించిన పనులన్నీ దాదాపుగా కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. అయితే, హౌస్‌లో మాత్రం తుది మెరుగులు దిద్దుతున్నారని అంటున్నారు. ఇక, కంటెస్టెంట్ల ప్రోమో షూట్లను ఈ వారంలో పూర్తి చేయనున్నారట. అలాగే, వచ్చే శుక్రవారం నుంచి ఎంట్రీ సాంగ్‌లను షూట్ చేస్తారని తెలుస్తోంది.
ముందుగానే రాబోతుందిగా: బిగ్ బాస్ ఏడో సీజన్ సెప్టెంబర్ 3వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభం అవుతుందని టీమ్ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు, సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 9:30 గంటలకు.. శని, ఆదివారాల్లో మాత్రం రాత్రి 9 గంటలకు ఇది ప్రసారం అవుతుందని తాజాగా బిగ్ బాస్ టీమ్ ప్రకటించింది. దీంతో షో అభిమానులంతా తెగ సంతోష పడిపోతున్నారు.
టైం.. అసలు ప్లాన్ అదేనా: గతంలో బిగ్ బాస్ షోను సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేసేవారు. ఐదో సీజన్ నుంచి మాత్రం వీక్ డేస్‌లో రాత్రి 10 గంటలకు ప్రసారం చేశారు. దీంతో ఈ షో రేటింగ్ తగ్గిపోయింది. ఈ కారణంగానే ఇప్పుడు ఏడో సీజన్‌ను గతంలో మాదిరిగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు ప్రసారం చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











