Bigg Boss 7 Telugu elimination పవర్ అస్త్ర గెలుచుకొన్నదెవరు? తొలివారం బిగ్‌బాస్ నుంచి వెళ్లేదెవరు?
బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్ ఉల్టా పల్టా అంటూ అనేక ట్విస్టులు, టర్న్‌లతో కొనసాగుతున్నాయి. కొంత ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో తొలివారాన్ని ముగించుకొన్నది. అయితే ఇంటిలోకి వెళ్లిన కంటెస్టెంట్లు.. హౌస్‌మేట్స్ కాదు.. కేవలం కంటెస్టెంట్లు మాత్రమే అని హోస్ట్ నాగార్జున చెప్పి షాకిచ్చారు. ఇమ్యునిటీ, టాస్క్ ఆడి ఇంటిలో వసతులు గెలుచుకోవాలని సూచించారు. 6వ రోజు బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో జరిగిన, జరగబోయే విషయాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ ఇంటిలో పవర్ అస్త్ర టాస్క్ గత మూడు రోజులుగా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతున్నది. ఫైనల్‌గా ఇమ్యూనిటీని సాధించేందుకు ఆట సందీప్, శివాజీ, రతిక, ప్రియాంక జైన్ పోటీలో ఉన్నారు. పవర్ అస్త్ర సాధించిన కంటెస్టెంట్ దాదాపు ఐదు వారాల పాటు నామినేషన్, ఎలిమినేషన్ లేకుండా ఇంటిలో ఉంటాడు. ఇలాంటి సువర్ణ అవకాశాన్ని చేజిక్కించుకొనేందుకు నలుగురు కంటెస్టెంట్లు సిద్దమయ్యారు.

అయితే పవర్ అస్త్ర టాస్క్‌లో నలుగురి కంటెస్టెంట్లలో అట సందీప్ విజయం సాధించారు. దాంతో పవర్ అస్త్రను ఆట సందీప్ సొంతం చేసుకొన్నాడు. దాంతో ఐదు వారాల పాటు ఎలిమినేషన్, నామినేషన్ లేకుండా ఇంటిలో సేఫ్ జోన్‌లో ఉండే అవకాశాన్ని ఆట సందీప్ సొంతం చేసుకొన్నారు.
ఇక ప్రస్తుతం వారం నామినేషన్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్లలో శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ ఇద్దరు సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఓటింగ్‌లో చివరిగా ఉన్న వారిలో ప్రిన్స్ యావర్, హీరోయిన్ కిరణ్ రాథోడ్ డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఒకవేళ ఎలిమినేషన్ జరిగితే.. కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి.
అయితే బిగ్‌బాస్ తెలుగు 7 షోలో తొలివారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చనే మాట కూడా బలంగా వినిపిస్తున్నది. తొలివారం ఎలిమినేషన్ లేకుండా రెండోవారం ఇద్దరు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయవచ్చని చెబుతున్నారు. తొలివారం ఎలిమినేషన్ ఉందా? లేదా అనేది కొద్ది గంటల్లో స్పష్టమవుతుంది.
బిగ్‌బాస్ ఇంటిలోకి రెండోవారం ఆరంభంలో మరో 7 సభ్యులను పంపించేందుకు ఏర్పాట్లు జరిగాయి. హీరోయిన్ ఫర్జానా, యూట్యూబర్ నిఖిలు, బోలే షవాలీ, వర్షిణి సౌందర్ రాజన్, అంబటి అర్జున్, యాక్టర్ క్రాంతి, ఐశ్వర్య పిస్సే తదితరులు ఇంటిలోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. ఇంకా ఈటీవీ ప్రభాకర్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. బిగ్‌బాస్ తెలుగు 7 షోలో మొత్తం ఇంటిలో 21 మందితో షోను నడిపించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











