Bigg Boss 7 Telugu ఇంటిసభ్యుల మధ్య ఎలిమినేషన్ మంట!సింగర్ దామినిపై కార్తీకదీపం మోనిత ఫైర్..నామినేట్ ఎవరెవరంటే?

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో రెండో రోజే ఇంటి సభ్యుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకొన్నాయి. ఇంటిలోకి అడుగుపెట్టిన ఇంటి సభ్యులు ఒకరికొకరు ఆనందంతో బాండింగ్ ఏర్పరుచుకోవాలని చేసిన ప్రయత్నాలకు బిగ్‌బాస్ గండి కొట్టాడు. తొలివారానికి జరిగే ఎలిమినేషన్ పేరుతో నామినేషన్ల ద్వారా కంటెస్టెంట్లలో నిజస్వరూపాన్ని బయటపెట్టే ప్రయత్నం చేశారు. తొలివారం నామినేషన్ల ప్రక్రియ ఇంటిలో ఎలాంటి రచ్చ, మంట రేపిందనే విషయంలోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలోని ఇంటిలో 2వ రోజు కంటెస్టెంట్ల మధ్య ఆగ్రహవేశకాలు బయటకు వచ్చాయి. తొలివారం ఎలిమినేషన్ కోసం నిర్వహించిన నామినేషన్ల ప్రక్రియ కోసం నరకం గదిని వేదికగా ఎంచుకొన్నారు. నరకపు గదిలోకి కంటెస్టెంట్లను నామినేషన్ వేయమని కోరాడు. చీకటి గదిలో ఎముకల గూడు ఉన్న చిత్రాలు కంటెస్టెంట్లకు భయాన్ని కలుగజేసేలా కనిపించాయి.

Bigg Boss 7 Telugu Nominations: Shobha Shetty Target Singer Damini, Ratika fires on Aata Sandeep

నరకం గదిలో కంటెస్టెంట్లు భయపడుతూనే నామినేషన్ల ప్రక్రియను నిర్వహించారు. ఓ దారం దండానికి కంటెస్టెంట్ల ఫోటోలు వేలాడ దీసి.. తాము నామినేట్ చేయాలనుకొనే వారి ఫోటో చించి ఓ బుట్టలో వేయాలి. ఇలా తమకు నచ్చని, ఇంటిలో సరిగా రెస్పాండ్ కాని వారిగా భావించిన తోటి ఇంటి సభ్యులను నామినేట్ చేస్తూ ప్రక్రియను కొనసాగించారు.

నామినేషన్ ప్రక్రియలో ప్రిన్స్ యావర్, షకీలా మధ్య విభేదాలు భయపడ్డాయి. నీ తండ్రి కింగా? అని షకీలా అడిగింది అంటూ ప్రిన్స్ యావర్ భగ్గుమన్నాడు. అయితే తాను ఏదో సరదాగా కింగ్ అని అడిగినందుకు నామినేట్ చేస్తాడా? అని షకీలా ఆవేదన చెందింది. ఇక ఇంటిలో ఆట సందీప్, రతికపై మండిపడింది. కిరణ్ రాథోడ్, పల్లవి ప్రశాంత్ కూడా సీరియస్ అయ్యారు.

సింగర్ దామిని తన వంతుగా శోభాశెట్టి (కార్తీక దీపం మోనిత)ని నామినేట్ చేసింది. దాంతో శోభ శెట్టి కోపంతో ఊగిపోయింది. నామినేషన్ అంటే ఇంటి నుంచి బయటకు పంపడం కదా అండీ.. ఆ రీజన్ కరెక్ట్ కాదండి.. అని శోభ అంటే.. నేను చెప్పిన కారణాలు తప్పు కావొచ్చు అని దామిని బదులిస్తుంటే.. మీరు చెప్పిన కారణాలు తప్పే అంటూ దామినిపై శోభ గట్టిగా అరిచింది. నీవు నాకేమీ చెప్పకు.. వచ్చేవారం నేను ఎవరిని నామినేట్ చేయాలో నాకు తెలుసు అని శోభా శెట్టి వార్నింగ్ ఇచ్చింది.

ఇదిలా ఉండగా, తొలివారం ఎలిమినేషన్ కోసం చేపట్టిన నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యుల మధ్య మంటపెట్టింది. తొలివారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారిలో ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, కిరణ్ రాథోడ్, గౌతమ్ కృష్ణ, రతిక, శోభా శెట్టి, సింగర్ దామిని, ప్రియాంక జైన్ ఉన్నట్టు తెలిసింది. ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్ల జాబితాను బిగ్‌బాస్ అధికారికంగా వెల్లడించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X