Bigg Boss 7 Telugu: రతికా, రాహుల్ బ్రేకప్ రీజన్ ఇదే.. నాగార్జునను తిట్టింది అందుకే.. సంచలన నిజం లీక్
తెలుగులో తిరుగులేని షోగా వెలుగొందుతూ సుదీర్ఘ కాలంగా టెలివిజన్ రంగంలో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది బిగ్ బాస్. దీని ద్వారా ఎంతో మంది వెలుగులోకి రావడంతో పాటు పలువురు బిగ్ సెలెబ్రిటీలుగానూ మారిపోయారు. ఇక, ఇప్పుడు జరుగుతున్న ఏడో సీజన్‌లో ఆరంభంలోనే అందరి దృష్టిని ఆకర్షించి హైలైట్ అవుతోంది లోకల్ బ్యూటీ రతికా రోజ్. ఈ అమ్మడు తన బ్రేకప్ లవ్ స్టోరీతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక, ఇప్పుడు ఆమె ప్రియుడు ఎవరు? అతడికి ఎందుకు బ్రేకప్ చెప్పాల్సి వచ్చింది? అనే విషయాలు బయటకు వచ్చాయి. అవి మీకోసమే!
ఆరంభంలోనే రతికా హైలైట్:ఇటీవలే మొదలైన ఏడో సీజన్‌లోకి 14 మంది సభ్యులు వచ్చారు. అందులో లోకల్ బ్యూటీ రతికా రోజ్ మాత్రం అందరి దృష్టినీ ఆకర్షించింది. దీనికి కారణం ఈ అమ్మడు స్టేజ్‌పై నాగార్జునపైనే నిందలు వేస్తూ మాట్లాడడడమే. అంతేకాదు, బిగ్ బాస్ హౌస్‌లోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ముందుకు సాగుతోంది. దీంతో రతికా రోజ్‌కు ఫాలోయింగ్ భారీ స్థాయిలో పెరుగుతూనే ఉంటోంది.

రతికా మాజీ లవర్ రాహులే:ప్రీమియర్ ఎపిసోడ్‌లో రతికా రోజ్ తన మాజీ ప్రియుడి గురించి మాట్లాడిన తర్వాత అందరూ అతడు ఎవరా అని ఎంక్వైరీ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ఆమెను ప్రేమించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లీగంజ్ అని ఓ న్యూస్ లీకైంది. అంతేకాదు, వీళ్లిద్దరూ కలిసి ఉన్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి.
అప్పటి నుంచే లవ్ ట్రాక్:రాహుల్ సిప్లీగంజ్ ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తున్న సమయంలోనే అంటే 2019లో 'హే పిల్లా' అనే ఓ సాంగ్‌ను రూపొందించాడు. ఇందులో రతికా రోజ్ (అప్పుడు ఆమె పేరు ప్రియాంక) ఫీమేల్ లీడ్‌గా చేసింది. ఆ పాట చేస్తున్న సమయంలోనే వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారట. అలా చాలా రోజుల పాటు చెట్టాపట్టాలేసుకుని తిరిగినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ ఇటీవలే వైరల్ అయింది.
బిగ్ బాస్ షో తర్వాత గ్యాప్:2019లోనే జూలైలో ప్రారంభం అయిన బిగ్ బాస్ మూడో సీజన్‌లో రాహుల్ సిప్లీగంజ్ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అందులో అతడు అసాధారణమైన ఆటతీరుతో మెప్పించాడు. ఫలితంగా ఈ సీజన్‌లో విజేతగా నిలిచి సత్తా చాటుకున్నాడు. ఇక, బిగ్ బాస్ షోలోకి వెళ్లిన తర్వాత రతికా - రాహుల్ మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలిసింది. దీని తర్వాత ఇద్దరికీ బ్రేకప్ కూడా అయిందట.
బ్రేకప్‌కు కారణం ఇదేనట:రాహుల్ సిప్లీగంజ్‌కు రతికా రోజ్ బ్రేకప్ చెప్పడానికి బిగ్ బాస్ షోలో అతడు వ్యవహరించిన తీరే కారణం అని తాజాగా ఓ న్యూస్ లీకైంది. అందులో అతడు పునర్నవి భూపాలంతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా కనిపించాడు. అంతేకాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా అదే కంటిన్యూ చేశాడు. దీంతో రతికా రోజ్.. రాహుల్ సిప్లీగంజ్‌కు దూరం అయిపోయిందనే టాక్ వినిపిస్తోంది.
నాగ్‌పై నిందలు అందుకే:వాస్తవానికి బిగ్ బాస్ మూడో సీజన్ జరిగే సమయంలో రాహుల్ సిప్లీగంజ్ - పునర్నవి భూపాలం మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు మొదట చెప్పింది హోస్ట్ నాగార్జునే. తర్వాత వాళ్లిద్దరి బంధాన్ని హైలైట్ చేస్తూ ఎన్నో కామెంట్లు చేసింది కూడా ఆయనే. అందుకే ఏడో సీజన్ ప్రీమియర్ ఎపిసోడ్‌లో రతికా 'చేసిందంతా చేసి ఇప్పుడిలా అడుగుతున్నారా' అని నిందలు వేసిందని టాక్.
తాజా ఎపిసోడ్‌తో కన్ఫార్మ్:రతికా రోజ్ తన మాజీ ప్రియుడు రాహుల్ సిప్లీగంజే అని చెప్పకపోయినా ఆమె చేస్తున్న కామెంట్లతో కన్ఫార్మెషన్ వచ్చేస్తుంది. ఇక, తాజా ఎపిసోడ్‌లో బిగ్ బాస్ నువ్వు ఎవరినైనా మిస్ అవుతున్నావా అని అడగ్గా.. తన పేరెంట్స్ గురించి కాకుండా బాయ్‌ఫ్రెండ్ గురించి చెప్పింది. అంతేకాదు, చాలా ఏళ్ల నుంచి మిస్ అవుతున్నా అంది. పై ప్రోమోలో దాదాపుగా కన్ఫార్మ్ చేసింది.


Click it and Unblock the Notifications











