Bigg Boss Nominations: 4వ వారంలో ఆరుగురు నామినేట్.. ఆ ఇద్దరే లక్కీ.. కాళ్లు పట్టుకుంటానన్న శివాజి

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు వస్తున్నాయి. కానీ, అందులో రియాలిటీ ఆధారంగా నడిచేవి మాత్రం చాలా తక్కువగానే ఉంటున్నాయి. అందుకే అలా పరిచయమై.. అనతి కాలంలోనే సక్సెస్‌ఫుల్ షోగా మారిపోయింది బిగ్ బాస్. దీంతో నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఇది కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతూ మజాను పంచుతోంది. ఇక, నాలుగో వారం నామినేషన్స్ ప్రక్రియ వివరాలు తాజాగా లీక్ అయ్యాయి. ఆ డీటేల్స్ మీకోసం!

Bigg Boss 7 Telugu Show 4th Week Nominated Contestants List Leaked

వాటికి సంబంధం లేకుండా: మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ రెస్పాన్స్ దక్కుతోంది. దీనికితోడు ఉల్టా పుల్టా కాన్సెప్టు కావడంతో ఏడో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. వాటికి ఏమాత్రం తగ్గకుండానే ఈ సీజన్ సరికొత్త కంటెంట్‌తో నడుస్తోంది. ఇందులో గత సీజన్లలో జరిగిన వాటికి ఏమాత్రం సంబంధం లేని సీన్స్ కనిపిస్తున్నాయి.

ముగ్గురు లేడీస్ బయటకు: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, సీరియల్ హీరో అమర్‌దీప్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, నాలుగో వారం దామిని వెళ్లిపోయారు.

నామినేషన్ న్యాయస్థానం: బిగ్ బాస్ ఏడో సీజన్ నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ కొత్త కాన్సెప్టుతోనే నిర్వహించారు. దీని ప్రకారం.. ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని కోర్టు బోనులో నిలబెట్టి కారణాలు చెప్పాలి. వాటికి జడ్జ్‌లు శోభా శెట్టి, సందీప్, శివాజీలు అంగీకరించాలి. అలా కంటెస్టెంట్లతో పాటు జడ్జ్‌లను కూడా తృప్తి పరిస్తేనే ఇందులో నామినేట్ అవుతారు.

ఫుల్ గొడవలు.. ప్రిన్స్‌తోనే: సాధారణంగా బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రిన్స్ యావర్‌ను చాలా మంది టార్గెట్ చేసినట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో కనిపించింది. దీంతో ఈ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

ఆరుగురు నామినేషన్‌లో: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, రతికా రోజ్, శుభశ్రీ రాయగురు, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణలు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.

ఆమె కాళ్లు పట్టుకునేలా: ఈరోజు రాత్రి ప్రసారం కాబోతున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ముందుగా ఆదివారం ఎపిసోడ్‌లో శివాజి అన్న మాటలపై రతికా అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో అతడు ఆమెకు సారీ చెప్పాడు. అయినా వినకపోవడంతో 'నువ్వు హర్ట్ అయ్యానంటే సారీ చెప్పా. ఇంకా సాగదీస్తున్నావు కాళ్లు పట్టుకోవాలా' అంటూ కిందకు వంగాడు.

ఆ ఇద్దరు మాత్రం లక్కీ: ఇప్పటికే లీకైన సమాచారం ప్రకారం.. నాలుగో వారంలో ఆరుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. మిగిలిన వారిలో ముగ్గురు పవర్ అస్త్రాలను గెలుచుకుని జడ్జ్‌లుగా ఉన్నారు. ఇక, మరో ఇద్దరు అమర్‌దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ మాత్రం ఈ వారం నామినేషన్స్ తప్పించుకున్నట్లు తెలిసింది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ కూడా ఆసక్తికరంగా సాగే అవకాశం కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X