Bigg Boss Nominations: 5వ వారంలో ఏడుగురు.. ఎలిమినేట్ చేయమన్న శివాజి.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్
చిత్ర విచిత్రమైన సంఘటనలు.. ఊహించని పరిణామాలు.. కంటెస్టెంట్ల మధ్య రకరకాల ఎమోషన్స్‌తో సాగుతోన్న ఏకైక రియాలిటీ షో బిగ్ బాస్. ఎన్నో భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చే దానికి మాత్రమే అన్నింటి కంటే ఎక్కువ స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది దేశంలోనే నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది. దీంతో నిర్వహకులు వరుస పెట్టి సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని రంజుగా నడుపుతున్నారు. ఇక, ఈ సీజన్ ఐదో వారంలో నామినేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. ఆ సంగతులు మీకోసమే!
కొత్త కంటెంట్‌తో సాగుతూ:బిగ్ బాస్ తెలుగులో సక్సెస్ అవడంతో దీని నుంచి ఏడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితమే ఇది మొదలైంది. ఇందులో ఆరంభం నుంచే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ఆరంభంలో రంజుగానే సాగింది. ముఖ్యంగా ఉల్టా పుల్టా ట్విస్టులతో ఫుల్ మజా దొరుకుతోంది. దీంతో రేటింగ్ కూడా బాగానే వస్తోంది.

నాలుగు వారాల్లో వాళ్లంతా:ఈ సీజన్‌లోకి శుభ శ్రీ, నటి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు ఎంట్రీ ఇచ్చారు. వీరి నుంచి మొదటి వారం కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారం దామిని, నాలుగో వారం రతికా ఎలిమినేట్ అయ్యారు.
నామినేషన్ కత్తిపోటుతో:బిగ్ బాస్ ఏడో సీజన్ ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను గతంలో చూసిన కాన్సెప్టుతోనే నిర్వహించారు. దీని ప్రకారం.. ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరిని ఎంచుకుని.. సరైన కారణాలతో నామినేట్ చేయాలి. ఇందుకోసం నామినేట్ చేయాలనుకున్న వాళ్ల మెడలో ఉన్న షీటుపై కత్తితో పొడవాల్సి ఉంటుందని బిగ్ బాస్ వివరించాడు.
ఫుల్ గొడవలు.. గ్రూప్స్‌గా:మామూలుగానే బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కులో గొడవలు జరుగుతూ ఉంటాయి. అందుకు అనుగుణంగానే ఐదో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియలో కొందరు కంటెస్టెంట్ల మధ్య గొడవలు జరిగినట్లు తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రిన్స్ యావర్ - ప్రియాంక, శుభశ్రీ - ప్రియాంక, అమర్‌దీప్ - శివాజి, గౌతమ్ - శివాజి మధ్య పెద్ద గొడవలే అయినట్లు సమాచారం.
తేజను నాగార్జునే చేశాడు:బిగ్ బాస్ ఏడో సీజన్ నాలుగో వారంలో జరిగిన ఓ టాస్కులో టేస్టీ తేజ గౌతమ్‌పై పదే పదే దాడి చేసిన విషయం తెలిసిందే. అందుకోసం అతడిని హోస్ట్ అక్కినేని నాగార్జున ఐదో వారానికి గానూ నేరుగా నామినేట్ చేసేశాడు. దీంతో ఈ నామినేషన్స్‌లో అతడిని ఎవరూ ఎంపిక చేసే చాన్స్ ఉండదు. అలాగే, పవర్ అస్త్ర గెలిచిన సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్‌నూ నామినేట్ చేయకూడదు.
ఏడుగురు నామినేషన్‌లో:బిగ్ బాస్ ఏడో సీజన్‌లోని ఐదో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ గత రాత్రే ముగిసింది. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారని తెలిసింది. అందులో టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శివాజి, శుభశ్రీ రాయగురు, అమర్‌దీప్ చౌదరి, గౌతమ్ కృష్ణలు ఉన్నట్లు ఓ న్యూస్ తాజాగా బయటకు వచ్చేసింది.
ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్:ఇప్పటికే ప్రసారం అయిన ప్రోమోలో గౌతమ్ కృష్ణ తనను అకారణంగా నామినేట్ చేశాడన్న ఉద్దేశంతో శివాజి 'ఇప్పుడు వీడు చెప్పేది మీరు నమ్మేటట్లైతే నన్ను ఎలిమినేట్ చేయండి. లేదంటే వాడిని చేయండి' అని రిక్వెస్ట్ చేశాడు. ఇక, ఈ వారంలో పవర్ అస్త్ర ఉన్న ముగ్గురు మినహా అందరినీ నామినేట్ చేసి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో ఈ సారి ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











