Bigg Boss 7 Telugu: ఏకంగా ముగ్గురు ఎలిమినేట్.. షో చరిత్రలో తొలిసారి.. కంటెస్టెంట్ల ఓట్లతో ట్విస్ట్
అసలు అంచనాలు లేకుండానే వచ్చినా.. గతంలో ఎన్నడూ చూడని కాన్సెప్టే అయినా.. తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్‌ను అందుకున్న ఏకైక షో బిగ్ బాస్. ఆరంభం నుంచే రికార్డు స్థాయిలో టీఆర్పీని అందుకుంటోన్న ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడుపుతున్నారు. ఇందులో ఐదో వారంలో ఏకంగా ముగ్గురు కంటెస్టెంట్లను ఎలిమినేట్ చేయబోతున్నట్లు తెలిసింది. అయితే, అంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. అసలేం జరిగింది? మీరే చూసేయండి మరి!
ఇదెక్కడి సీజన్‌రా నాయనా: బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో నడపబోతున్నట్లు నిర్వహకులు ముందుగానే ప్రకటించారు. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని ఎవరూ ఊహించని కంటెంట్‌తో నడుపుతున్నారు. ముఖ్యంగా ఇందులో షాకింగ్ ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. దీంతో ఈ షోకు అదిరిపోయే స్పందన కూడా లభిస్తోంది. ఫలితంగా రేటింగ్ కూడా భారీగానే దక్కుతోంది.

నాలుగు ఎలిమినేషన్స్‌లో: ఈ సీజన్‌లోకి షకీలా, కొరియోగ్రాఫర్ సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, నటి రతికా రోజ్, ప్రియాంక జైన్, శివాజి, సింగర్ దామిని, నటుడు ప్రిన్స్ యావర్, శుభ శ్రీ, నటుడు గౌతమ్ కృష్ణ, నటి కిరణ్ రాథోడ్, రైతు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్‌లు వచ్చారు. వీరి నుంచి తొలి వారంలో కిరణ్ రాథోడ్, రెండో వారంలో షకీలా, మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతికాలు ఎలిమినేట్ అయ్యారు.
ఐదో వారం సస్పెన్స్‌గానే: బిగ్ బాస్ ఐదో వారం ముగిసిన తర్వాత 2.O సీజన్ ప్రారంభం అవుతుందని ముందే తెలిసింది. అందుకే ఈ వారం నామినేషన్‌లో ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్, ప్రియాంక, శివాజి, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణ, అమర్‌దీప్‌లలో ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది సస్పెన్స్‌గా మారింది. దీంతో ఆదివారం ఎపిసోడ్‌పై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది.
ఆమె వెళ్లిందంటూ లీకు: సాధారణంగా బిగ్ బాస్ షోలో ఎలిమినేషన్ అనేది ఎంతో సీక్రెట్‌గా జరుగుతుంది. కానీ, ఇది ముందుగానే లీక్ అవుతోంది. ఇందులో భాగంగానే ఐదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ న్యూస్ కూడా ఇప్పటికే బయటకు వచ్చేసింది. దీని ప్రకారం.. ఈ వారంలో శుభశ్రీ రాయగురు షో నుంచి బయటకు వెళ్లిపోయినట్లు తెలిసింది. మరి దీనిపై ఆదివారం ఎపిసోడ్‌లో క్లారిటీ వస్తుంది.
అసలు ట్విస్టులు కూడా: ఐదో వారంలో శుభశ్రీ రాయగురు ఏడో సీజన్ నుంచి ఎలిమినేట్ అయినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలోనే.. దీని గురించి చాలా రకాల ట్విస్టులు కూడా ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ వారం ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా ఎలిమినేట్ అయినట్లు మరో వార్త బయటకు వచ్చింది. దీంతో అసలేం జరుగుతుందో తెలియక అందరూ జుట్టు పీక్కుంటున్నారు.
హౌస్‌మేట్ల ఓట్ల ద్వారానే: ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా తేజ, శుభశ్రీ, గౌతమ్‌లు తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో మిగిలారట. వీళ్లు ముగ్గురూ ఎలిమినేట్ అయ్యారని.. కంటెస్టెంట్లు వీళ్లలో ఒకరిని సేఫ్ చేయాలని నాగార్జున చెప్పాడని తెలిసింది. దీంతో అందరూ కలిసి టేస్టీ తేజను సేఫ్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ వారంలో గౌతమ్ కృష్ణ, శుభశ్రీ షో నుంచి ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారని టాక్.
ఆమె ఇంటికి.. అతడేమో: మొత్తానికి ఐదో వారంలో శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణలు ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన తర్వాత.. వాళ్లను స్టేజ్ మీదకు తీసుకు వచ్చారని తెలిసింది. అయితే, అప్పుడే అసలు ట్విస్ట్ ఇస్తూ వీళ్లిద్దరిలో శుభశ్రీని ఇంటికి పంపించగా.. గౌతమ్‌ను మాత్రం సీక్రెట్ రూమ్‌కు తలరించారని సమాచారం. ఇలా ఆదివారం ఎపిసోడ్ ఎన్నో ట్విస్టులతో సాగబోతుందన్న మాట.


Click it and Unblock the Notifications











