Bigg Boss 7 Telugu: ఏడో సీజన్ డేట్ ప్రకటన.. ఆ విషయంలో ఉసూరుమనిపించిన బిగ్ బాస్

తెలుగు బుల్లితెర చరిత్రలోనే ఊహించని విధంగా ప్రేక్షకుల ఆదరణను అందుకుంటూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. సరికొత్త కంటెంట్‌తో పరిచయం అయినా.. ఇక్కడి ప్రేక్షకుల మన్ననలు అందుకున్న ఇది.. ఇప్పటికే విజయవంతంగా ఆరు సీజన్లను పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఏడో దాన్ని కూడా నిర్వహకులు మొదలెట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొత్త సీజన్‌కు సంబంధించిన ప్రారంభ తేదీ ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. కానీ, ఓ విషయంలో నిరాశనే మిగిల్చింది. ఇంకెందుకు ఆలస్యం? దీనిపై మీరూ ఓ లుక్కేయండి!

ఏడో సీజన్‌.. ఉల్టాపుల్టా అంటూ: ప్రతి ఏడాదీ బిగ్ బాస్ షోకు అభిమానులు పెరుగుతూనే ఉన్నారు. దీంతో ఏడో సీజన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని వాళ్లంతా వేచి చూస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఇటీవలే దీనికి సంబంధించిన లోగో, ప్రోమోలను స్టార్ మా విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. ఇక, ఈ సీజన్ ఉల్లాపుల్టాగా ఉంటుందని నాగార్జున చెప్పడంతో అంచనాలు పెరుగుతున్నాయి.

Bigg Boss 7 Telugu Starting Date Promo Released

ఏడో సీజన్ ప్రాసెస్ ఇప్పుడిలా: బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం పనులన్నీ చకచకా జరుగుతున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక, తాజా సమాచారం ప్రకారం.. ఇప్పటికే సెట్ వర్క్ దాదాపుగా పూర్తైందని తెలుస్తోంది. అలాగే, స్టేజ్ వర్క్ కూడా చాలా వరకూ కంప్లీట్ అయిందని అంటున్నారు. ముఖ్యంగా కంటెంస్టెంట్లతో అగ్రిమెంట్లు కూడా చివరి దశకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

కంటెస్టెంట్లు పేర్లు బయటకు: బిగ్ బాస్ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఎవరన్న విషయం ప్రీమియర్ ఎపిసోడ్ రోజే తెలుస్తుంది. అంత పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంటారు. ఇక, ఏడో సీజన్‌కు సంబంధించి మోహన భోగరాజు, అమర్‌దీప్, అంజలి, సందీప్ మాస్టర్, జబర్ధస్త్ మహేశ్, యాంకర్ నిఖిల్, కమెడియన్ రియాజ్, సింగర్ దామిని, బుల్లెట్ భాస్కర్, పవిత్ర తదితరులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.

అసలైన ప్రోమో వచ్చేసింది: బిగ్ బాస్ ఏడో సీజన్ త్వరలోనే ప్రారంభం కాబోతుందని ఇటీవలే ఓ ప్రోమో వీడియోను విడుదల చేశారు. అయితే, ఇది ఎప్పటి నుంచి మొదలవుతుందన్న దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఏడో సీజన్‌కు సంబంధించిన డేట్ గురించిన వివరాలతో మరో ప్రోమోను విడుదల చేశారు. ఇందులో దీన్ని సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

ఆ విషయంలో నిరాశ పరిచి: బిగ్ బాస్ షో నుంచి కొత్త ప్రోమో రాబోతుంది అని శనివారమే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో దీనిపై షోను ఇష్టపడే వాళ్లంతా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే తాజాగా ప్రోమోను విడుదల చేసి.. ఇందులో షోకు సంబంధించిన డేట్‌ను రివీల్ చేశారు. కానీ, ఈ వీడియోలో పాత కంటెంట్‌నే చూపించారు. దీనిపై బిగ్ బాస్ ఫ్యాన్స్ తీవ్రంగా నిరాశ చెందుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X