Bigg Boss Telugu 7 బిగ్ బాస్ టీమ్ మరో ట్వీస్టు.. సీక్రెట్ రూమ్‌లోకి ఆ టాప్ కంటెస్టెంట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇక వీకెండ్ ఎపిసోడ్ వస్తే చాలు.. అందరూ టీవీల ముందు అతుక్కుపోతారు. ఇక ఈసారి సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ ముందు నుంచి బిగ్ బాస్ నిర్వాహకులు చెబుతునే ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే ఈసారి ట్విస్టులు, షాక్ లు ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నాడు బిగ్ బాస్. ఇక ఈవారం మామూలు ట్విస్టు కాదు.. ఒక ఎలిమినేషన్ తో పాటు.. ఒకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపనున్నారట. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ రసవత్తరంగా సాగుతోంది. సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో... 5వారాలుగా నాన్ స్టాప్ గా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక ఓటీటీ వేదికగా 24 గంటల స్ట్రీమింగ్ అందుబాటులో ఉండగా.. టీవీల్లోకి వచ్చేసరికి 1 గంట ఎపిసోడ్ ప్రసారం చేస్తున్నారు. ఇక వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసరికి గంటన్నర ప్రసారం చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ సీజన్ 7 ఈసారి బాగానే ఆకట్టుకుంటోంది.

బిగ్ బాస్ హౌజ్ లోకి 14 మంది ఎంటర్ అవ్వగా.. అందులో ఇప్పటికే కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్ ఎలిమినేట్ అయ్యారు. ఇక 5వ వారంలో కూడా ముగ్గురు ఎలిమినేట్ అవుతారని అంతా అనుకంటున్నారు. ఇక బిగ్ బాస్ బిగ్ ట్విస్టు ఇచ్చి.. ఇద్దరు ఎలిమినేట్ అన్నట్లు చూపించనున్నారు. అందులో ఒకరు శుభ శ్రీ రాయగురు కాగా.. మరొకరు డాక్టర్ గౌతమ్. ఇక వీరు ఎలిమినేట్ అన్నట్లుగా షోలో చూపించనున్నారు.
నిజానికి వీరిలో ఒక్కరే ఎలిమినేట్ కానున్నారు. అది ఎవరంటే.. శుభ శ్రీ. అయితే గౌతమ్ ను ఎలిమినేట్ చేసినట్లు చూపించి.. అతన్ని సీక్రెట్ రూమ్ లోకి పంపించనున్నారట. సీక్రెట్ రూమ్ లో గౌతమ్ ను 3 రోజుల పాటు దాచి పెట్టి... ఆ తర్వాత హౌజ్ లోకి ఎంటర్ చేయనున్నట్లు సమాచారం. అయితే ఇలా సీక్రెట్ రూమ్ లోకి పంపండం కొత్తేమి కాదు.. కానీ ఈసారి గౌతమ్ ను ఎలిమినేట్ పేరుతో పంపించి.. మళ్లీ ప్రేక్షకులను షాక్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం రెడి అయిపోయింది.
ఇక ఉన్న 10మందిలో ఇద్దరు ఎలిమినేట్ అయిపోతే.. మిగిలింది.. 8 మంది.. 8 మందితో 10 వారాలు నడపటం కష్టం. ఇక ఈవారం బిగ్ బాస్ తెలుగు 2.ఓ ఉంటుందని నాగార్జున కూడా ప్రోమోల్లో హింట్ ఇస్తున్నాడు. ఇక ఈ మిని లాంచ్ లో ఐదుగురు కంటెస్టెంట్స్ ఎంటర్ అవుతారని తెలుస్తోంది. ఐదుగురితో పాటు.. ఇంట్లో ఉన్న 10 మందిలో శుభ శ్రీ ఎలిమినేట్ కాగా.. గౌతమ్ సీక్రెట్ టాస్క్ లోకి వెళ్లగా.. మిగిలింది 8మంది. ఐదుగురుతో ఎనిమిది మంది చేరితే... 13 మంది అవుతారు.
ఇక గౌతమ్ మళ్లీ ఎంట్రీ ఇస్తే... 14 మంది అవుతారు. ఇక మళ్లీ ఆట మొదటికి వస్తుంది.. అప్పుడు ఇంకా రసవత్తరంగా ఉంటుందని బిగ్ బాస్ ప్లాన్. ఇక బిగ్ బాస్ మిని లాంచ్ లో అడుగు పెట్టబోయేది.. అంబటి అర్జున్, బోలే షవాలి, పూజా మూర్తి, నయన పావని, అశ్విని శ్రీ. వీరి ఎంట్రీ తో బిగ్ బాస్ ఎలా మారనుందో చూడాలి ఇక.


Click it and Unblock the Notifications











