Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ విజేతకు బంపర్ ఆఫర్.. 50 లక్షలతో పాటు మరో ప్రత్యేక బహుమతి

తెలుగు టెలివిజన్‌పై సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూ.. సుదీర్ఘ కాలంగా నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అసలే మాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఈ కార్యక్రమం.. తక్కువ సమయంలోనే విశేషమైన ఆదరణను దక్కించుకుంది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్ల మీద సీజన్లను కంప్లీట్ చేసుకుంటోంది. ఇలా ఇప్పుడు ఏడో సీజన్ కూడా ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఈ సీజన్‌లో విన్నర్‌కు ఇచ్చే ప్రత్యేకమైన విలువైన బహుమతి గురించి నాగార్జున వెల్లడించాడు. ఆ వివరాలేంటో మీరే చూడండి!

తెలుగులో వచ్చే బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) ఎన్నో రికార్డులను క్రియేట్ చేస్తూ సాగుతోన్న విషయం తెలిసిందే. అందుకు అనుగుణంగానే ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రారంభమైన ఏడో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ముఖ్యంగా ఇందులో ఇంతకు ముందెన్నడూ చూడని కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. ఫలితంగా ఇది ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతూ ముందుకు సాగుతోంది.

 Bigg Boss 7 Telugu:

ఉల్టా పుల్టా కాన్సెప్టు కావడంతో బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎవరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే ఐదు వారాలు పూర్తైన తర్వాత ఈ సీజన్ 2.O వెర్షన్‌ను గత ఆదివారమే మొదలు పెట్టారు. ఇందులో మరో ఐదుగురు కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. వీళ్లందరి రాకతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారిపోయే అవకాశం కనిపిస్తోంది.

సాధారణంగా బిగ్ బాస్ (Bigg Boss 7 Telugu) తెలుగు సీజన్లలో గెలిచిన వాళ్లకు మొదటి నుంచి క్యాష్ ప్రైజ్‌ను అందజేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని రూ. 50 లక్షలుగా నిర్ణయించి.. ఇదే మొత్తాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. అయితే, గత మూడు సీజన్ల నుంచి క్యాష్ ప్రైజ్‌తో పాటు టైటిల్ స్పాన్సర్లు ఇచ్చే స్పెషల్ గిఫ్టులను కూడా ఇస్తున్నారు. ఇలా 5, 6 సీజన్లలలో ఫ్లాట్‌లను అందించారు.

ఇక, ఏడో సీజన్‌కు సంబంధించి ఇందులో విజేతగా నిలిచే కంటెస్టెంట్‌కు క్యాష్ ప్రైజ్ మాత్రమే కాకుండా.. కొన్ని లక్షల రూపాయల విలువ చేసే ఓ డైమండ్ నెక్లెస్ సెట్‌ను సైతం ఇవ్వబోతున్నట్లు ఆదివారం ఎపిసోడ్‌లో నాగార్జున వెల్లడించాడు. దీన్ని టైటిల్ స్పాన్సర్లలో ఒకటైన జోస్ అలుకాస్ (Jos Alukkas Jewellery) సంస్థ ఇవ్వబోతున్నట్లు చెప్పాడు.

 Bigg Boss Telugu:

అయితే, ఏడో సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు ఇచ్చే ప్రైజ్ మనీ ఎంత అన్న దానిని మాత్రం నాగార్జున రివీల్ చేయలేదు. దీన్ని ఈ సీజన్ చివర్లో ప్రకటించే అవకాశం ఉంది. అది కూడా ఎప్పటి లాగానే యాభై లక్షల రూపాయలు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక, ఈ డైమండ్ నెక్లెస్ సెట్‌ను చూసిన కంటెస్టెంట్లు అందరూ దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో కనిపించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X