దీప్తి నల్లమోతుకు చేదు అనుభవం.. కెప్టెన్సీ లాగేసుకొన్న బిగ్‌బాస్.. తనీష్‌కు నాని వార్నింగ్!

By Rajababu

Recommended Video

Bigg Boss Season 2 Telugu : Episode 77 Highlights

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. ఎంతో ఎదురుచూసి.. కష్టపడి గెలిచిన కెప్టెన్సీ పదవి దీప్తి నల్లమోతు చేజారింది. అలాగే ఇంటి నిబంధనలు ఉల్లంఘించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కౌశల్‌కు తనీష్‌కు పెద్ద గొడవ జరిగింది. నాని రాక కొంత సంతోషాన్ని..మరి కొంత సీరియస్‌ను నింపింది. ఇంటి సభ్యులకు నాని క్లాస్ పీకడం ఈ ఎపిసోడ్‌లో ప్రధాన అంశం. పూర్తి వివరాల్లోకి వెళ్దాం.

ఇంటి సభ్యులకు షాక్

ఇంటి సభ్యులకు షాక్

ఇంటి నిబంధనలు పాటించకపోయినా.. వాటిని అమల్లో పెట్టకపోయిన కఠిన చర్యలు ఉంటాయని బిగ్‌బాస్ హెచ్చరించినట్టే తీవ్రమైన అంక్షలే విధించబడ్డాయి. ఆ క్రమంలో ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ మరోసారి గట్టిగా షాక్ ఇచ్చారు.

దీప్తి నల్లమోతుకు షాక్

దీప్తి నల్లమోతుకు షాక్

ఇంటి సభ్యులు పగలు నిద్రపోరాదని కౌశల్ చెప్పడాన్ని తనీష్ తీవ్రంగా వ్యతిరేకించాడు. దాంతో ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ గొడవలో బిగ్‌బాస్ జోక్యం చేసుకొన్నాడు. ఇంటిని కంట్రోల్ చేయలేని దీప్తి నుంచి కెప్టెన్సీ పదవిని లాగేసుకొన్నాడు. దాంతో ఇంట్లో ఓ రకమైన నిశబ్దం నెలకొన్నది.

తనీష్, గీతాకు హెచ్చరిక

తనీష్, గీతాకు హెచ్చరిక

ఇంటి సభ్యులతో సమావేశమైన నాని ఈ వారం వారిని గట్టిగా మందలించారు. ఇంటి సభ్యులు నిబంధనలు ఉల్లంఘిస్తే శిక్ష తప్ప ఏం జరుగుతుందని విర్రవీగే తనీష్, గీతా మాధురికి గట్టిగానే మందలించాడు. తనీష్‌ను యాటిట్యూడ్ మార్చుకోకపోతే మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందనే సంకేతాలు పంపారు.

ఇంటి సభ్యులకు గట్టిగా వార్నింగ్

ఇంటి సభ్యులకు గట్టిగా వార్నింగ్

అలాగే ఇంటి సభ్యులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాల్సిందే అని నాని మరోమారు స్పష్టం చేశారు. ఇంటి సభ్యుల ద్వందనీతిని ఎండగట్టారు. ముఖం ముందు ఓ మాట.. వెనుక మరో మాట చెప్పే అమిత్, ఇంకా మరికొందరిని పరోక్షంగా హెచ్చరించారు. ముఖ్యంగా గణేష్‌ను సున్నితంగా మందలించారు.

సెలబ్రిటీలతో గేమ్

సెలబ్రిటీలతో గేమ్

ఇంకా ఇంటి సభ్యుల ప్రవర్తన, నడవడికను వారి నుంచే తెలుసుకోవడానికి ప్లేకార్డులతో గేమ్ నిర్వహించారు. ఆ గేమ్‌లో ఇంటి సభ్యుల ఒక్కొకరి గురించి మూడు ప్రశ్నలు వేసి సెలబ్రిటీల నుంచి సమాధానాలు రాబట్టారు. ఆ గేమ్ సరదా సరదాగా గడిచిపోయింది.

ఎలిమినేషన్ రేపటికి వాయిదా

ఎలిమినేషన్ రేపటికి వాయిదా

ప్రతీ శనివారం నిర్వహించే ఎలిమినేషన్ ప్రక్రియను చివర్లో ప్రారంభించారు. కానీ ఎవరిని ప్రొటెక్టెడ్ జోన్‌లోకి పంపించకుండా సస్పెన్స్‌తో ముగించారు. ఆదివారం ఎపిసోడ్‌లో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారననే విషయాన్ని, ప్రొటెక్టెడ్ జోన్‌లో ఎవరు ఉంటారనే విషయాన్ని రేపటికి వాయిదా వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X