Bigg Boss Telugu 5 Week 7th Nominations: ఆ నలుగురు తప్ప అందరూ నామినేట్.. టైటిల్ ఫేవరెట్లకు ఎలిమినేషన్ ముప్పు

తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని.. గతంలో దేనికీ దక్కనంత రేటింగ్‌ను సొంతం చేసుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఈ కారణంగానే ఇది ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే గత నెలలో ఐదోది కూడా ప్రారంభం అయింది. ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.

Recommended Video

Bigg Boss Telugu 5: Shanmukh @1 నామినేషన్స్‌లో టైటిల్ ఫేవరెట్లు Top 5 Contestants | Filmibeat Telugu

ఇక, ఇందులో ప్రతివారం ఎక్కువ మంది కంటెస్టెంట్లు నామినేషన్స్‌లో ఉంటున్నారు. దీంతో ఈ ప్రక్రియ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ జాబితా ముందే లీకైంది. ఇందులో ఎవరెవరు నామినేట్ అయ్యారో తెలుసుకుందాం పదండి!

గతంలో వాటికి మించేలా ప్లాన్ చేశారుగా

గతంలో వాటికి మించేలా ప్లాన్ చేశారుగా

ఎన్నో అంచనాల నడుమ గత నెలలో ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇందులో గతంలో ఎన్నడూ లేని విధంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. అలాగే, ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచి భారీ రేటింగ్‌ను అందుకుందీ సీజన్. అలా రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోందీ సీజన్.

ఆరు వారాలు.. ఎవరెవరు ఎలిమినేషన్?

ఆరు వారాలు.. ఎవరెవరు ఎలిమినేషన్?

ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రతి వారం నామినేషన్స్‌లో ఎక్కువ మంది ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో మొదటి వారం సరయు రాయ్, రెండో వారంలో సీనియర్ నటి ఉమాదేవి, మూడో వారంలో లహరి షారి, నాలుగో వారంలో నటరాజ్ మాస్టర్, ఐదో వారం హమీదా, ఆరో వారంలో శ్వేతా వర్మ‌లు ఎలిమినేట్ అయ్యారు.

ఈ టాస్కు కోసమే అందరూ వెయిటింగ్

ఈ టాస్కు కోసమే అందరూ వెయిటింగ్

బిగ్ బాస్ షోలో ఎంతో ముఖ్యమైన ఘట్టం నామినేషన్స్ ప్రక్రియే అన్న విషయం తెలిసిందే. ఇది జరుగుతోన్న సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు కనిపిస్తాయి. ఒక్కో సమయంలో కొట్టుకుంటారా అన్నట్లు కూడా ఇది సాగుతూ ఉంటుంది. ఈ టాస్క్ సమయంలోనే కంటెస్టెంట్ల మధ్య ప్రేమ, స్నేహం కూడా మొదలు అవుతుంది. ప్రతి సోమవారం ఈ ఎపిసోడ్ వస్తుంటుంది.

సరికొత్తగా ఏడో వారం నామినేషన్ టాస్క్

సరికొత్తగా ఏడో వారం నామినేషన్ టాస్క్

ఏడో వారానికి సంబంధించిన నామినేషన్స్ టాస్క్ సరికొత్తగా ఉండబోతుందని తెలుస్తోంది. దీనికోసం గార్డెన్ ఏరియాలో ఓ భారీ సెట్ వేశారు. హౌస్‌లో అరటి పండు ఉంటుంది. దాన్ని ఎవరు ముందుగా తీసుకుంటారో వాళ్లు ప్రత్యేక అధికారం దొరుకుతుందని సమాచారం. ఈ టాస్కుతో సంబంధం లేకుండా ఒకరిని నేరుగా నామినేట్ చేసే పరిస్థితి కూడా వచ్చినట్లు తెలిసింది.

ఈ వారానికి నేరుగా నామినేట్ అయ్యాడు

ఈ వారానికి నేరుగా నామినేట్ అయ్యాడు

శనివారం జరిగిన ఎపిసోడ్‌లో లోబోను సీక్రెట్ రూమ్‌లోకి పంపించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే హోస్ట్ అక్కినేని నాగార్జున.. నువ్వు వచ్చే వారానికి నేరుగా నామినేట్ అయ్యావు అని చెప్పాడు. అంటే.. ఈ వారం జరిగే నామినేషన్స్ టాస్కుతో సంబంధం లేకుండానే అతడు ఎలిమినేషన్ జోన్‌లోకి వెళ్లాడు. అయితే, ఈ విషయం మాత్రం హౌస్‌మేట్స్‌కు తెలియదు.

ఏడో వారంలో తొమ్మిది మంది నామినేట్

ఏడో వారంలో తొమ్మిది మంది నామినేట్

ఏడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసినట్లు తెలుస్తోంది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది సభ్యులు నామినేట్ అయ్యారని విశ్వసనీయంగా తెలిసింది. ఇందులో నేరుగా నామినేట్ అయిన లోబోతో పాటు ఆర్జే కాజల్, సిరి హన్మంత్, ఆనీ మాస్టర్, ప్రియ, యాంకర్ రవి, ప్రియాంక సింగ్, శ్రీరామ చంద్ర, జస్వంత్ పడాల ఉన్నారని సమాచారం.

 టైటిల్ ఫేవరెట్లు నామినేట్ అవడంతో

టైటిల్ ఫేవరెట్లు నామినేట్ అవడంతో

ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఈ వారం షణ్ముఖ్ జస్వంత్, సన్నీ, మానస్ తప్పించుకున్నారు. కెప్టెన్ అవడం వల్ల విశ్వ నామినేషన్స్‌లో ఉండడు. మిగిలిన వాళ్లంతా నామినేట్ అయ్యారు. ఇక, ఇందులో రవి, ప్రియ, శ్రీరామ్, సిరి, కాజల్ వంటి టైటిల్ ఫేవరెట్లు ఉండడంతో ఏడో వారం ఓటింగ్ ఆసక్తికరంగా సాగనుంది. మరి ఇందులో ఎవరు వెళ్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X